Ram Charan.. ఏ ఇద్దరు హీరోలు అలా చేసినా సినిమా హిట్టే.. హిందీలో ఆచార్య రిలీజ్ ఎప్పుడంటే?

ఆచార్య సినిమాకు సంబంధించి నిర్మాతగా నేను ఎంట్రీ ఇచ్చాను. అయితే నా పాత్ర ముందుగా అనుకోలేదు. కొరటాల శివ ముందుగా కేవలం 15 నిమిషాల పాత్రను మాత్రమే డిజైన్ చేశారు. పూజా హెగ్డే, నా రోల్ అతిథి పాత్రలు మాత్రమే. కథ డెవలప్‌మెంట్‌లో భాగంగా నా పాత్ర 40 నిమిషాల మేరకు పెరిగింది. కథ డిమాండ్ మేరకే పాత్ర నిడివి పెరిగింది. కథను బట్టే నేను కొరటాల శివతో కలిసి నటించాలని అనుకొన్నా. అందుకు రాజమౌళికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. మిర్చి సమయం నుంచే నేను కొరటాల శివతో నటించాలనుకొంటున్నాను. అప్పటి నుంచి మా మధ్య డిస్కషన్ జరుగుతున్నది. కానీ మా పర్సనల్ కమింట్‌మెంట్స్ కారణంగా కుదర్లేదు అని రాంచరణ్ చెప్పారు. ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి మెగా పవర్ స్టార్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

కొరటాల శివ త్యాగం..

కొరటాల శివ త్యాగం..

చిరంజీవి గారి వద్దకు ఆచార్య కథ వచ్చినప్పుడు నా పాత్ర గురించి ఏమీ అనుకోలేదు. నా పాత్ర కోసం వేరే వేరే ఆప్షన్స్ ఉండేవి. ఆచార్య సినిమా పూజా జరిగినప్పుడు నేను లేను. ఆ విషయం గురించి చర్చ జరగలేదు. సైరా ముగిసిన తర్వాత RRR మూవీ సమయంలో ఇది జరిగింది. రంగస్థలం నుంచి కొరటాల శివతో సినిమా చేయాలని అనుకొన్నాను. అయితే RRR సినిమా, శివ గారు ఒకేసారి కథ చెప్పారు. అయితే RRR గురించి శివ గారి వద్ద ప్రస్తావించాను. నేను మీ సినిమానే చేస్తానని చెప్పాను. అయితే .. నా సినిమా కంటే SS రాజమౌళితో సినిమా చేయడమే కరెక్ట్. మనం పుల్‌‌ఫ్లెడ్జ్‌గా పెద్ద సినిమా ఒకటి చేద్దాం. తొందర తొందరగా సినిమా చేయాల్సిన అవసరం లేదని కొరటాల శివ చెప్పారు. ఆ సమయంలో కొరటాల శివతో చిరంజీవి చేస్తానని అనడంతో ఆచార్య సినిమా ప్రారంభమైంది.

మహేష్ బాబు ప్రస్తావన నాకు తెలియదు

మహేష్ బాబు ప్రస్తావన నాకు తెలియదు

నా పాత్ర కోసం తొలుత మహేష్ బాబు అనుకొన్నారో లేదో నాకు తెలియదు. మ్యాట్నీ ఆఫీస్‌లో ఎలాంటి చర్చలు జరిగాయో తెలియదు. నిర్మాతగా నేను మ్యాట్నీ ఆఫీస్‌కు ఆ సమయంలో వెళ్లలేదు. నేను RRR సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాను. మహేష్ బాబు విషయం నాకు అసలే తెలియదు. కొరటాల శివతో రెండుసార్లు సినిమా అనుకొని ఆగిపోయాయి. అయితే సినిమాతో సంబంధం లేకుండా కొరటాల శివతో నా అనుబంధం కొనసాగింది అని రాంచరణ్ చెప్పారు.

ఆచార్యలో చాలా డిఫరెంట్ పాత్రలు

ఆచార్యలో చాలా డిఫరెంట్ పాత్రలు

ఆచార్యలో చిరంజీవి గారిది, నాది పూర్తిగా చాలా డిఫరెంట్. ధర్మం కోసం ప్రాణాలను కూడా త్యాగం చేసే పాత్రలు. గురుకులంలో విద్యార్థిని. ధర్మం కోసం పాటుపడే వ్యక్తిని. అలాగే నక్సలైట్‌గా చిరంజీవి ధర్మం కోసం పోరాటం చేస్తుంటాడు. ఇలా ధర్మం కోసం పాటుపడే ఇద్దరు వ్యక్తుల కథ. ఈ కథలో సోనుసూద్, నేను స్నేహితులం. హనుమాన్ వ్యాయమశాలలో విద్యార్థులం. కానీ ధర్మం కోసం స్నేహాన్ని కూడా పక్కన పెట్టే పాత్ర నాది అని రాంచరణ్ తెలిపారు.

చిరంజీవితో ఆ 22 రోజులు..

చిరంజీవితో ఆ 22 రోజులు..

నా జీవితంలో 35 ఏళ్లుగా తండ్రిగా తెలిసిన చిరంజీవి గారు వేరు. ఆచార్య సినిమాలో 22 రోజులపాటు చూసిన చిరంజీవి గారు వేరు. మారెడుమిల్లిలో ఉదయం నుంచి రాత్రి వరకు కలిసి ఉండేవాళ్లం. సెట్‌లో ఆయనను చూస్తే భయంగా ఉండేది. షూటింగ్ సమయంలో సహ నటుడిగా నాకు ఇచ్చిన మర్యాద, గౌరవం అద్భుతం. చిరంజీవి, నేను కలిసి నటించడం వల్ల కథలో మా ఇమేజ్‌కు తగినట్టు కథను మార్చలేదు. చిన్న సీన్‌ కూడా మార్చకుండా సినిమా తెరకెక్కించాం. ఒకవేళ మా కోసం కొంచెం మార్చినా గానీ.. అది తెలిసిపోతుంది అని అన్నారు.

కొరటాల శివ 90 శాతం కష్టపడితే..

కొరటాల శివ 90 శాతం కష్టపడితే..


ఆచార్య కథలో ఏ ఇద్దరు హీరోలు నటించినా.. సినిమా సూపర్ హిట్. కాకపోతే చిరంజీవి గారితో నేను కలిసి నటించడం వల్ల కొంత ఎమోషన్స్, క్రేజ్ అదనంగా యాడ్ అవుతాయి. కొరటాల శివ దర్శకుడిగా 90 శాతం కష్టపడి కథను సిద్దం చేశారు. కథను అర్ధం చేసుకోవడానికి 10 శాతం కష్టపడ్డాం. కథలోని పాత్రలకు సరెండర్ అయిపోతే.. మనం కూడా కనిపిస్తాం. డాడీ ఉండటం, సినిమాను మేము కూడా నిర్మించడంతో ఈ సినిమాలో చిరంజీవితో కలిసి నటించే అవకాశం వచ్చింది. సినిమాలో సెకండాఫ్‌లో ఆయనతో పూర్తిగా నటించే అవకాశం వచ్చింది అని రాంచరణ్ అన్నారు.

ఆచార్యను హిందీలో ఎందుకు రిలీజ్ చేయలేదంటే?

ఆచార్యను హిందీలో ఎందుకు రిలీజ్ చేయలేదంటే?


ఆచార్య సినిమాను దక్షిణాది రాష్ట్రాల్లో రిలీజ్ చేయాలని దర్శకుడు కొరటాల శివ మొదటి నుంచి అనుకొంటున్నారు. RRR తర్వాత హిందీలో రిలీజ్ చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్‌కు కావాల్సిన సమయంల లేకపోయింది. నా పాత్రకు స్వయంగా నేను డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకొన్నాను. అందుకే ఆలస్యం అయింది. మరో నెల తర్వాత ఆచార్యను హిందీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాం అని రాంచరణ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X