Ram Charan KTLA 5 ఇంటర్వ్యూ.. ఆస్కార్‌ను గెలుచుకుంటే ఎలా ఉంటుంది.. చెర్రీ ఆసక్తికరమైన ఆన్సర్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఇటీవల కాలంలో హాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. రీసెంట్ గా ABC గుడ్ మార్నింగ్ అమెరికాన్ షో ద్వారా ఇంగ్లీషు మీడియాలో మొదటిసారి అడుగు పెట్టిన చరణ్ ను గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్న సమయంలో ఇప్పుడు మరో షోలో హైలెట్ అయ్యారు. లాస్ ఏంజిల్స్ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ KTLA రామ్ చరణ్ ను ఇంటర్వ్యూ చేసింది. మార్చి 12న లాస్‌ ఏంజెల్స్‌ లో జరగనున్న 95వ ఆస్కార్‌ వేడుకపై రామ్‌చరణ్‌ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు.

అందుకే అందరికి నచ్చింది

అందుకే అందరికి నచ్చింది

రామ్ చరణ్ మాట్లాడుతూ.. చాలా దేశాల్లో RRR పేరు వైరల్ గా మారింది. దర్శకుడు రాజమౌళి తీసిన అత్యుత్తమ సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. డ్రామా అలాగే మంచి ఎమోషన్ తో రెండు పాత్రలు భీమ్ అల్లూరి పాత్రలను చక్కగా హైలెట్ చేశారు. భారతదేశం ఎదుర్కొన్న అనేక వలసవాద అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటం వంటి కాన్సెప్ట్ లో రావడం వలన చాలా మంది వ్యక్తులకు ఈ సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది.. రామ్ చరణ్ అన్నారు.

7 రోజుల రిహార్సల్ తర్వాత

7 రోజుల రిహార్సల్ తర్వాత

'నాటు నాటు' అనేది చాలా అందమైన పాట. ఆ సాంగ్ షూట్ సెట్లో దాదాపు 300 మంది ప్రొఫెషనల్ డ్యాన్సర్లు ఉన్నారు. 7 రోజుల రిహార్సల్ తర్వాత దాదాపు 17 రోజుల పాటు షూట్ చేశారు. నేను వారి అంచనాలకు తగ్గట్టుగా డ్యాన్స్ చేయాలని అనుకుని వర్క్ చేయడం జరిగింది. ఇక ప్రేక్షకులు మాకు చాలా ప్రేమను ఇచ్చారు. పాటను ఆస్కార్ వేదికపై ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకులకు మా ప్రేమను చూపించినట్లే.. అని రామ్ చరణ్ తెలియజేశారు.

ఆస్కార్‌ను గెలుచుకుంటే ఎలా ఉంటుంది?*

ఆస్కార్‌ను గెలుచుకుంటే ఎలా ఉంటుంది?*

అలా జరిగితే ఇది నా జీవితంలో అత్యంత మధురమైన క్షణం అవుతుంది. నేను అక్కడ గెస్ట్ గా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు నామినేట్ అయినందున అవార్డును మా బృందంతో ఇంటికి తీసుకెళ్లడానికి నేను ఎదురుచూస్తున్నాను. మా సినిమా రేపు (యుఎస్‌లో) రీ-రిలీజ్ అవుతోంది. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని నిరాశపరచదు.. అని రామ్ చరణ్ అన్నారు.

RRR పాట ఆస్కార్ రేసులో ఉండటం అంటే..

RRR పాట ఆస్కార్ రేసులో ఉండటం అంటే..

నటుడిగా ఇది అత్యంత సంతృప్తికరమైన అనుభూతి అని చెప్పవచ్చు. 85 సంవత్సరాల మా చిత్ర పరిశ్రమ చరిత్రలో మొదటిసారి ఒక భారతీయ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. ఆస్కార్ కు నామినేట్ కావడంతో మా సినిమాను అత్యుత్తమంగా అభినందిస్తున్నారు. ఇక వివిధ దేశాలలో ఎక్కువ మంది ప్రేక్షకులను RRR అలరిస్తున్నందుకు నేను హ్యాపీగా ఉన్నాను. మేము ఈ పరిశ్రమలో ఉండాల్సిన సమయం వచ్చింది. అంటూ రామ్ చరణ్ తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X