అదే ఫీల్ ‘బ్యూటీఫుల్‌’లో కనిపించింది.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్

Recommended Video

Ram Gopal Varma Exclusive Interview About Beautiful Movie

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూట్ మార్చి.. రొమాంటిక్ ట్రాక్‌లో పడ్డాడు. నాటి క్లాసిక్ మూవీ రంగీలా చిత్రానికి ట్రిబ్యూట్‌లా తెరెక్కించిన బ్యూటీఫుల్ పోస్టర్స్, స్టిల్స్‌తో అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నాడు.

 అమ్మాయిలను ఆ విధంగా చూస్తా..

అమ్మాయిలను ఆ విధంగా చూస్తా..

అమ్మాయిలను గన్స్‌లా చూస్తారా? ఫ్లవర్స్‌లా చూస్తారా? అని అడగ్గా.. కచ్చితంగా అమ్మాయిలను పూవ్వుల్లానే చూస్తానని చెప్పుకొచ్చాడు. బ్యూటీఫుల్ కథ దాదాపు ఏడేళ్ల క్రితమే విన్నానని, అప్పటి నుంచి దానిపై కసరత్తులు చేస్తూనే ఉన్నానని తెలిపాడు. సరైన క్యాస్టింగ్ కోసం ఇన్నేళ్లు ఎదురు చూశానని అన్నాడు.

 ఆర్జీవీ సొంత కథ..?

ఆర్జీవీ సొంత కథ..?

బ్యూటీఫుల్ మూవీ స్టోరీ తనది కాదని, తనకు తెలుసిన వ్యక్తిదని క్లారిటీ ఇచ్చాడు. రంగీలా చిత్రంలో హ్యాపీ ఎండింగ్ అనుకుంటారు. కానీ నిజజీవితంలో ఓ అమ్మాయి, అబ్బాయి కంటే ఎక్కువ సంపాదిస్తే ఎలా ఉంటుంది. ఎదురయ్యే పరిస్థితులేంటి అన్నదే బ్యూటీఫుల్ అని చెప్పుకొచ్చాడు. రంగీలాలో ఉన్న ఫీల్ బ్యూటీఫుల్‌లోనూ కనిపించిందని పేర్కొన్నాడు.

రూట్ మార్చాడా..?

రూట్ మార్చాడా..?

ఎప్పుడూ సమకాలీన అంశాలను, సంఘటనలను ఆధారంగా చేసుకుని చిత్రాలను తెరకెక్కిస్తాడు వర్మ. తాజాగా మళ్లీ రొమాంటిక్ జానర్‌ను తెరకెక్కించడంతో అందరిలోనూ అదే అనుమానం తలెత్తుంది. అయితే వీటిపై స్పందిస్తూ బ్యూటీఫుల్ కథను ఎప్పుడో విన్నానని, అప్పటి నుంచి తీయాలని అనుకుంటానని చెప్పుకొచ్చాడు.

ఎమోషన్స్ ఎక్కడైనా ఒక్కటే..

ఎమోషన్స్ ఎక్కడైనా ఒక్కటే..

తనపై ఎక్కువగా పాశ్చాత్య రచయిత ప్రభావం ఉంటుందని ఆర్జీవీ తెలిపాడు. అయితే మనుషులు ఎక్కడున్నా ఎమోషన్స్ ఒకటేనని, కలర్, భాషా, ప్రాంతం బట్టి అవేవీ మారవని అన్నాడు. తాను ఎక్కువగా వెస్ట్రన్ లిటరేచర్‌ను చదివానని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X