twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫెయిల్యూర్స్‌తో అథోపాతాళంలోకి.. నన్నే భుజాన మోస్తున్నది.. అందుకే 2.0 కామెంట్స్: వర్మ

    |

    పాపులర్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వరుస విజయాలతో సతమవుతున్న సమయంలో భైరవ గీత సినిమా రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించకపోయినప్పటికీ, సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా సిద్ధార్థ్ అనే యువ దర్శకుడిని దక్షిణాది సినిమాకు పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తన సినిమా, సిద్ధార్థ్ గురించి రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించారు. వర్మ చెప్పిన విషయాలు ఏమిటంటే..

    నన్నే భుజాన మోస్తున్నది

    నన్నే భుజాన మోస్తున్నది

    నేను ఈ సినిమాను భుజాన వేసుకోలేదు. భైరవగీతనే నన్ను భుజాన వేసుకొని మోస్తన్నది. సక్సెస్ లేక అథోపాతాళానికి వెళ్తున్న నాకు చేయి అందించే చిత్రం భైరవగీతం. సిద్ధార్థ తీసిన తీరు నన్ను చాలా ఆకట్టుకొన్నది. అతడి విజన్ చూస్తే ముచ్చేటేసింది. ఈ మధ్యకాలంలో నా వద్ద పనిచేసిన వారెవరూ అంతగా ఇంప్రెస్ చేయలేదు.

    కొత్త హీరోయిన్‌తో చేయడానికి

    కొత్త హీరోయిన్‌తో చేయడానికి

    కొత్త హీరోయిన్‌తో చేయడానికి కారణం కథలో ఉంటే ఇంటెన్సిటీ. కొత్త వాళ్లతో సినిమా తీసినప్పుడు పాత్రలపై బలమైన ప్రభావం ఉంటుంది. గతంలో పాత హీరోయిన్లను రిపీట్ చేస్తే ఎందుకు చేస్తున్నారని అడిగారు. కొత్తవాళ్లతో తీస్తే పాత హీరోయిన్లతో ఎందుకు చేయడం లేదనే ప్రశ్న వినిపిస్తుంది. కొత్త, పాత అనే తేడా లేకుండా కథకే ప్రధాన్యం ఇస్తాడు.

    ఆ డైరెక్టర్ పిచ్చోడు అయుండాలి లేదా ఫ్రాడ్ అయ్యుండాలి.. రామ్ గోపాల్ వర్మ అనుమానంఆ డైరెక్టర్ పిచ్చోడు అయుండాలి లేదా ఫ్రాడ్ అయ్యుండాలి.. రామ్ గోపాల్ వర్మ అనుమానం

     ఓవరాల్‌గా ఇంప్రెస్ అయ్యాను..

    ఓవరాల్‌గా ఇంప్రెస్ అయ్యాను..

    నా కెరీర్‌లోనే చాలా మంది దర్శకులును పరిచయం చేసి ఉంటాను. దాదాపు నా స్కూల్ నుంచి 40 మంది వరకు దర్శకులుగా పరిచయం అయ్యారు. సిద్ధార్థ విషయంలో నాకు బలమైన నమ్మకం ఏర్పడింది. కథ చెప్పడంలో ప్రతీ దర్శకుడికి ఓ లాగ్వేంజ్ ఉంటుంది. గతంలో ఓ సీన్, లేదా కొన్ని సీన్లు చూసి ఇంప్రెస్ అయి ఉండవచ్చు. సిద్ధార్థ విషయంలో ఓవరాల్‌గా ఇంప్రెస్ అయ్యాను. అతడి సినిమాటిక్ లాంగ్వేజ్ నచ్చింది.

    రియలిస్టిక్ సినిమాలంటే

    రియలిస్టిక్ సినిమాలంటే

    గ్రామీణ నేపథ్యంగా, నేటివిటీ సినిమాలకు దూరంగా ఉండటమనేది నిజమే. కానీ రియలిస్టిక్ సినిమాలు నాకు నచ్చుతాయి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా ప్రేమ, పగ అనే సినిమాలు తీయలేదు. కానీ ఇది పేద, సంపన్న కుటుంబాల మధ్య సంఘర్షణ ఉంటుంది. యాక్షన్, లవ్ అంశాలు మిలితమై ఉంటాయి.

     పబ్లిసిటీ కోసమే 2.0పై కామెంట్

    పబ్లిసిటీ కోసమే 2.0పై కామెంట్

    దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ 2.0 చిత్రంపై వ్యాఖ్యలు చేయడం పబ్లిసిటీలో భాగమే. అంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రమైనప్పటికీ.. ఎక్కువగా పిల్లలు చూసి ఎంజాయ్ చేయడం ఖాయం. అలాంటి సినిమాలు ముఖ్యంగా పిల్లల్ని టార్గెట్ చేసుకొని తీస్తారు. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది.

    English summary
    Popular Director Ram Gopal Varma presenting Bhairava Geeta movie, which is directed by Siddarth T. Danunjaya and Irra Mor is the lead pair. This movie is set to release on Novembeber 30 against Shanakar's 2.0. In this occassion, Varma spoke to Telugu filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X