twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్ సీఎం కావాలి... ఆయన ముఖ్యమంత్రి అయితే: వర్మ.. అతడు మాత్రం కమెడియన్..

    |

    వివాదాలకు కేరాఫ్ అడ్రస్, దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం పలు వివాదంలో కూరుకుపోయింది. సెన్సార్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమా రిలీజ్ వాయిదా వేసింది. ఇంకా సెన్సార్ పూర్తి కాకుండానే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మార్చి 29న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

    సెన్సార్ సర్టిఫికెట్ లభించలేదు

    సెన్సార్ సర్టిఫికెట్ లభించలేదు

    లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా లభించలేదు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నిబంధనలకు అనుగుణంగా లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను తెరకెక్కించాం. అందుకే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించాం. ఎలాంటి అవరోధాలు లేకుండా త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంటుంది అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

     నెగిటివ్ అంశాలే కీలకంగా

    నెగిటివ్ అంశాలే కీలకంగా

    ప్రతీ సినిమాకు నెగిటివ్ అంశాలే ప్రభావితం చేస్తాయని నేను నమ్ముతాను. ఈ సినిమాకు సమస్యనే అసల కథ. గాంధీ సినిమాను తీసుకొంటే బ్రిటీష్ రూలింగ్ కథకు కాన్‌ఫ్లిక్ట్. అది లేకుండా గాంధీ బాల్యం, పెళ్లి ఇలాంటి అంశాల ఆధారంగా తీస్తే దానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో లక్ష్మీపార్వతి, వైశ్రాయ్ హోటల్ ఘటనలే సినిమాకు ఆధారం. ఎన్టీఆర్ జీవితంలోని చివరి రోజుల్లో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున ఆ కోణంలో సినిమాను తెరకెక్కించాను.

    ఎన్ని కోట్లు కావాలి? డబ్బులిస్తే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఆపేస్తారా?ఎన్ని కోట్లు కావాలి? డబ్బులిస్తే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఆపేస్తారా?

    అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా

    అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా

    తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఓటర్లపై సినిమాపై ప్రభావం ఉంటుంది. అయితే ఏ మేరకు ఉంటుందో నేను చెప్పలేదు. వైశ్రాయ్ ఘటనకు దారి తీసిన పరిస్థితులు ఎవరికీ తెలియదు. నాకు తెలుసు కాబట్టే సినిమా తీశాను. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి జీవితాలకు సంబంధించి నేను నమ్మిన నిజం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కథ.

     సినిమా ప్రభావం ప్రభుత్వాలపై

    సినిమా ప్రభావం ప్రభుత్వాలపై

    ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రజల సమస్యలకు పరిష్కారం లభించదు, రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని అనుకోను. మార్పు అనేది నిరంతర ప్రక్రియ మాత్రమే. రాజకీయాల్లో మార్పు ప్రభావం ప్రజల జీవితంపై ఉండదని నేను నమ్ముతాను. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన పెద్దగా మార్పు ఉండదని నేను నమ్ముతాను.

    పవన్ కల్యాణ్ సీఎం అయితే

    పవన్ కల్యాణ్ సీఎం అయితే

    ఏపీకి ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రులైతే బాగుంటుందని అనుకొంటాను. అందులో ఒకరు పవన్ కల్యాణ్.. రెండో వ్యక్తి కేఏ పాల్. పవన్ కల్యాణ్ అందంగా ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రి కావాలనుకొంటున్నాను. అతను సీఎం అయితే ఫ్రంట్ పేజ్‌లోనే ఫొటో చూసుకోవచ్చు. సీఎం కాకపోతే సినిమా పేజీలో చూసుకోవాల్సి వస్తుంది.

    కేఏ పాల్ ఓ కమెడియన్‌‌

    కేఏ పాల్ ఓ కమెడియన్‌‌

    ఇక క్రైస్తవ మత గురువు కేఏ పాల్ సీఎం అయితే కామెడీ బాగా పండుతుంది. నవ్వుకోవడానికి బోలెడన్నీ వార్తలు ఉంటాయి. అయితే కేఏ పాల్ జీవితాన్ని తెరకెక్కించే ఆలోచన లేదు. నాకు ఆయనంటే భయం. నా జీవితంలో మొదటిసారి ఓ వ్యక్తికి భయపడ్డానంటే అదీ కేఏ పాల్ మాత్రమే అని వర్మ తనదైన శైలిలో సెటైర్ వేశాడు.

    English summary
    Director Ram Gopal Verma coming with Lakshmis NTR movie. This movie set to release on March 29th. In this occassion, RGV speaks to Telugu filmibeat exclusively and He wants to see Pawan Kalyan as Chief Minister.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X