twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    16 మంది అమ్మాయిలతో కలిసి బిగ్‌బాస్‌కు వెళ్తా.. 500 కెమెరాలు ఉన్నా డోంట్ కేర్.. రాంగోపాల్ వర్మ

    |

    కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సినీ పరిశ్రమ స్తంభిస్తే.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం వరుసగా సినిమాలు రూపొందించి సంచలనం రేపారు. నిస్తేజంలో ఉన్న ప్రేక్షకులను, సినీ ప్రముఖులను తన సినిమాలతో ఉత్తేజానికి గురిచేశారు. కరోనావైరస్ డిసెంబర్ 11వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఫిల్మీబీట్‌ తెలుగుతో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ...

    Recommended Video

    RGV Gives Clarity On Making Donald Trump Biopic | Filmibeat Telugu
     థియేటర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్

    థియేటర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్

    కరోనావైరస్ చిత్రాన్ని ఎప్పుడో రిలీజ్ చేయాల్సింది. అయితే మధ్యలో పవర్ స్టార్, ఇతర షార్ట్ ఫిలింస్ మాదిరిగా కాకుండా ఇది కంప్లీట్ ఫీచర్ ఫిలిం. అందుకే ఈ సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేయాలని అనుకొన్నాం. థియేటర్లు ఓపెన్ లేట్ కావడం వల్ల కరోనావైరస్ రిలీజ్ ఆలస్యం అయింది.

    కరోనావైరస్ సినిమా కథ ఇదే..

    కరోనావైరస్ సినిమా కథ ఇదే..

    కరోనావైరస్ సినిమా గురించి వర్మ వెల్లడిస్తూ.. ఒక ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉన్నప్పుడు.. వారి మధ్య కరోనావైరస్‌ను చేర్చితే ఎలా ఉంటుందని ఆలోచించి చేసిన సినిమా ఇది. శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా ఆకుల, వంశీ చాగంటి, దక్షి గుత్తికొండ తమ పాత్రలకు అనుగుణంగా నటించారు అని వర్మ తెలిపారు. నిర్మాత నట్టి కుమార్‌తో సినిమా పరంగా చాలా కంఫర్ట్ ఉంది. డిస్ట్రిబ్యూషన్ ప్లాన్, ప్లానింగ్ విషయాల్లో మాకు ఒకేరకమైన ఆలోచనలు ఉన్నాయి అంటూ వర్మ తెలిపారు.

    నిజ జీవిత హార్రర్ సినిమా

    నిజ జీవిత హార్రర్ సినిమా

    కరోనావైరస్ మూవీ భయాన్ని, ఎమోషన్స్‌ను కలిగిస్తుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. నిజజీవిత హార్రర్ సినిమా అని ట్యాగ్ లైన్ పెట్టడానికి కూడా అదే కారణం. దెయ్యం కూడా కనిపించకుండా వెంటాడి చంపుతుంది. అలాగే కరోనావైరస్ కూడా దెయ్యం మాదిరిగానే కనిపించకుండా చంపేలా బిహేవ్ చేసింది. అందుకే కరోనావైరస్‌ను సినిమాగా తీసాం అని అన్నారు.

     సన్నీలియోన్ కోసం బిగ్‌బాస్ చూశా

    సన్నీలియోన్ కోసం బిగ్‌బాస్ చూశా

    బిగ్‌బాస్ గురించి మాట్లాడుతూ.. నేను ఎక్కువగా చూడను. గతంలో సన్నీలియోన్ హిందీ బిగ్‌బాస్‌లో వచ్చినప్పుడు మాత్రమే చూశాను. కేవలం సన్నిలియోన్ కోసం కొన్ని ఎపిసోడ్ మాత్రమే చూడాల్సి వచ్చింది. తెలుగులో అసలు చూడలేదు అని వర్మ అన్నాడు. హోస్ట్‌గా వెళ్లడానికి ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశాడు.

    16 మంది అమ్మాయిలతో నన్ను కలిపి పంపిస్తే..

    16 మంది అమ్మాయిలతో నన్ను కలిపి పంపిస్తే..

    ఇక బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేయడం ఇష్టమే. కానీ కొన్ని షరతులు ఉంటాయి. బిగ్‌బాస్ ఇంటిలోకి 16 మంది అమ్మాయిలు, నన్ను మాత్రమే పంపిస్తే నేను వెళ్తాను. 16 మంది అమ్మాయిలు తప్ప మరొకరు ఉండకూడదు. 500 కెమెరాలు ఉన్నా డోంట్ కేర్.. నైట్ విజన్ కెమెరాలున్నా అసలే పట్టించుకోను అంటూ రాం గోపాల్ వర్మ పేర్కొన్నారు.

    English summary
    opular director Ram Gopal Varma reveals his opinion about Bigg Boss Telugu 4: He said I wish to go house with only 16 women contestants. He further said that, I watched once becuase sunny leone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X