»   » బాలయ్యతో సినిమా చేయాలని ఉంది.. ‘తీయడం ఈజీ.. రిలీజ్ చేయడమే కష్టం’!

బాలయ్యతో సినిమా చేయాలని ఉంది.. ‘తీయడం ఈజీ.. రిలీజ్ చేయడమే కష్టం’!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  నందు, సౌమ్య వేణుగోపాల్, పూజారామచంద్రన్ ముఖ్య తారాగణంతో హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్ శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహన్ రావు ఇప్పిలి నిర్మాతలుగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వం వహించిన చిత్రం 'ఇంతలో ఎన్నెన్ని వింతలో'. ఈ చిత్రం ఏప్రిల్ 6న విడుదలయ్యి మంచి మన్ననలను పొందుతూ సక్సెస్ బాటలో పయనిస్తోంది.. ఈ సందర్బంగా నిర్మాత రామ్మోహన్ రావు ఇప్పిలి మీడియా తో ముఖాముఖిలో పాల్గొన్నారు..

   ప్రశ్న: ప్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేశారు.. ?

  ప్రశ్న: ప్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేశారు.. ?

  జవాబు: దర్శకుడు వరప్రసాద్ వరకూటి నా స్నేహితుడు.. విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజ్ లో ఇద్దరం కలసి చదువుకున్నాం.. అప్పటినుంచే అతను మాకు మంచి కథలను చెప్పేవాడు.. అతను సినిమా ఫీల్డ్ కు వచ్చాక కూడా మాతో టచ్ లో ఉండేవాడు.. అలా మా జర్నీ మొదలయ్యింది.. అప్పుడే వరప్రసాద్ నాకు ఇంతలో ఎన్నెన్ని వింతలో కథ వినిపించాడు లైన్ చాలా బాగుంది.. మంచి అవకాశం దొరికి అందరూ సహకరిస్తే కథను సినిమాగా మలచాలని బావించాము.. అనుకున్నట్టే అన్నీ కుదిరాయి సినిమా స్టార్ట్ చేసాము.. విడుదల కూడా చేసాము సినిమా సక్సెస్ అయ్యింది.. కథ గురుంచి చెప్పాలంటే.. ఒక నలుగురి కుర్రాళ్లలో ఒకరికి ( హీరో నందు ) నిశ్చితార్థం అవుతుంది 36గంటల్లో పెళ్లి ముహూర్తం..ఫ్రెండ్స్ పార్టీ అడుగుతారు. ఈలోగా ఆ నలుగురు వివిధ కారణాల చేత సమస్యల్లో ఇరుక్కుపోతారు.. అప్పుడు ఆ పెళ్లి జరిగిందా..? మిగతా ముగ్గురు పెళ్ళికి వచ్చారా..? ఆ సమస్యనుంచి ఎలా బయటపడతారు అనేది చిత్ర కథాశం.. దాన్నే ఉత్కంఠ భరితంగా చాలా బాగా తెరకెక్కించాడు దర్శకుడు వరప్రసాద్.

  ప్రశ్న: థియేటర్ల ఫీడ్ బ్యాక్ ఎలావుంది?

  ప్రశ్న: థియేటర్ల ఫీడ్ బ్యాక్ ఎలావుంది?

  జవాబు: చాలా బాగుందండి.. ఈ శనివారానికి 40 థియేటర్ల ను పెంచుతున్నాము.. ముఖ్యంగా బీసీ సెంటర్ లో మంచి టాక్ వస్తోంది.. పెద్ద ఆర్టిస్టులు ఎవరూ లేకపోయినా కథ బాగుండటం తో మంచి పేరువస్తోంది.. చుసిన ప్రతిఒక్కరూ ఎవరూ బాగోలేదని చెప్పడం లేదు.. మౌత్ టాక్ తోనే పబ్లిసిటీ బాగొచ్చింది.. అందరికీ ఈ సందర్బంగా కృతజ్ఞతలను తెలియచేస్తున్నా..

  ప్రశ్న: థియేటర్లను పెంచాలనే ఆలోచన ఎవరిది..?

  జవాబు: డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచనే నండి.. టాక్ బాగొచ్చింది థియేటర్లను పెంచుదామని అడిగారు సరే అనడం జరిగింది.. ముఖ్యంగా ఆంధ్రాలో రెస్పాన్స్ బాగుంది..

  ప్రశ్న: కల్లెక్షన్స్ ఎలా ఉన్నాయి..?

  జవాబు: సంతృప్తి కరంగా ఉన్నాయండి.. అందరూ మెచ్చుకుంటున్నారు.. చెప్పాలంటే చిన్న సినిమాకు పెద్ద రెస్పాన్స్ వచ్చింది..

  ప్రశ్న: సినిమా రిలీజింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?

  ప్రశ్న: సినిమా రిలీజింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?

  జవాబు: సినిమాను తీయడం కంటే విడుదల చేయడమే కష్టం అనిపించింది.. పెద్ద సినిమాలను దృష్టిలో పెట్టుకొని థియేటర్ల సమస్య రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది.. అందుకే ఈ సినిమా విడుదల తేదీ కోసం మేము మూడు నెలల పాటు ఎదురుచూసి ఏప్రిల్ 6న మంచి డేట్ అని ఫిక్స్ అయ్యి ఆ రోజునే విడుదల చేయడం జరిగింది..

  ప్రశ్న: మీ సర్కిల్ లో అంటే కుటుంబం, స్నేహితుల నుంచి ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది..?

  జవాబు: మంచి జాబ్స్ చేసుకోకుండా.. సినిమా ఏంటని మొదట అందరూ అనే వారు,కానీ మేము మొదటి నుంచీ కథను బాగా నమ్మాము.. ప్రేక్షకులనుంచి వస్తున్న మంచి రెస్పాన్స్ ను చూసి మంచి సినిమా చేశారని.. కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ మెచ్చుకుంటున్నారు. కథనే నమ్మారని ఇప్పుడు మాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు.. చాలా హ్యాపీ గా ఉంది.

  ప్రశ్న: మీ స్వస్థలం ఎక్కడ.. మీరు వృత్తి ఏంటి ?

  జవాబు: మాది శ్రీకాకుళం. మా పాట్నర్ ఒంగోలు వాసి.. నేను జీ.వి.కె. బయోలో జూనియర్ సైంటిస్ట్‌గా చేసున్నా.. ప్రస్తుతానికి సెలవులో ఉన్నాను.

  ప్రశ్న: ఒక ఆడియన్ గా మీకెలా అనిపించింది ఈ సినిమా..?

  జవాబు: తాళిబొట్టు తీసేసే సీన్, తార తిరిగివచ్చే సన్నివేశాలు నన్ను బాగా ఇంప్రెస్స్ చేశాయి..

  ప్రశ్న: ప్రొడ్యూసర్‌గా కంటిన్యూ అవుతారా..?

  ప్రశ్న: ప్రొడ్యూసర్‌గా కంటిన్యూ అవుతారా..?

  జవాబు: మంచి కథలు దొరికితే తప్పకుండా చేస్తాము.. మా బ్యానర్ లో తప్పకుండా మరో మంచి సినిమా ఉంటుంది.. ఆ వివరాలన్నీ అతి త్వరలోనే అనౌన్స్ చేస్తాము.. మంచి సినిమాలనే తీయాలనే కాన్సెప్ట్ తో వచ్చాము అవే తీస్తాము..

  ప్రశ్న: పెద్ద హీరోలతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారా..?

  జవాబు: ఇప్పుడు మంచి టీమ్ దొరికింది మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.. హ్యాపీ. పెద్ద హీరోలతో అంటే అదృష్టం అవకాశం కలసి వస్తే తీస్తాము.. బాలయ్యతో సినిమా చేయాలనే ఆలోచన ఉంది కానీ అది అత్యాశే అవుతుందని భావిస్తున్నా... ప్రస్తుతానికి ఇలానే సంతృప్తితో ఉన్నాము(నవ్వుతూ) అంటూ ముఖాముఖిని ముగించారు నిర్మాత రామ్మోహన్ రావు ఇప్పిలి.

  English summary
  Inthalo ennenni vinthalo movie has stepped into 2nd week in the hari hara chalana chitra banner which is released on april6th. This movie is getting huge response i both andhra pradesh and telangana. Producer Rammohan Rao was inaugurated the press meet on this occasion. On this occation Producer Ram Mohan Rao Ippili said that.. team "inthalo ennenni vinthalo" enjoying the film success only beacause of our media friends.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more