‘దేవర కంటే నా కొడుకు సినిమానే బెస్ట్.. భారీ నష్టం వచ్చినా అలాంటి తృప్తి’

ఇటీవల కాలంలో చిన్న చిత్రం అయినప్పటికీ తెలుగు సినిమా రంగంలో కొంత సందడి సృష్టించిన మూవీ రామ్ నగర్ బన్నీ. ప్రముఖ టెలివిజన్ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ తెలుగు తెరకు పరిచయవుతూ రూపొందించిన ఈ సినిమా విడుదలకు ముందే ఓ రకమైన బజ్ క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్‌కు ముందే ఆయనకు యాటిట్యూడ్ స్టార్ అనే పేరును నెటిజన్లు ఇవ్వడం క్రేజీగా మారింది. అయితే ఈ సినిమా గురించి, తన కుమారుడి గురించి, మూవీ వైఫల్యం గురించి ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ..

నా కుమారుడు నటించిన రామ్ నగర్ బన్నీ సినిమాకు ఊహించని రెస్పాన్స్ విడుదలకు ముందు రావడం చాలా సంతోషం కలిగింది. ఫస్ట్ టైమ్ యాక్టర్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి.. రిలీజ్‌కు ముందే అందరీ దృష్టిలో నిలిచిన అతి కొద్ది మందిలో చంద్రహాస్ పేరు ఉండటం చాలా హ్యాపీగా అనిపించింది. అలా నా కుమారుడు సొంతంగా అభిమానులను పాజిటివ్‌ గానో.. నెగిటివ్ గానో సంపాదించుకోవడం గర్వంగా అనిపించింది.

Ram Nagar Bunny producer ETV Prabhakar about Devara impact and His Son Chandrahaas talent

రామ్‌నగర్ బన్నీ సినిమాకు ముందే చాలా మంది నిర్మాతలు మా అబ్బాయితో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా రిలీజ్ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకొందామని అనుకొన్నాను. అయితే మూవీ రిలీజ్ తర్వాత సినిమాపై, నా కుమారుడి ఫెర్ఫార్మెన్స్‌పై సానుకూలంగా రివ్యూలు రావడం సంతోషమేసింది అని ప్రభాకర్ చెప్పారు.

అయితే ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌ను వసూళ్ల రూపంలోకి మలుచుకోలేకపోయాం.అయినా మాకు ఎలాంటి బాధ లేదు. మా అబ్బాయికి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందనే సంతృప్తి మాకు చాలూ అనుకొన్నాం అని అన్నారు. ఆయితే ఆ సమయంలో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడంతో మా సినిమాపై ఎవరూ దృష్టి పెట్టలేకపోయారు. అంతేగానీ మా సినిమా విషయంలో ఇప్పటి వరకు ప్రేక్షకుల నుంచి గానీ, సినీ ప్రముఖుల నుంచి గానీ ఎలాంటి కంప్లైంట్స్ రాకపోవడం ఇంకా హ్యాపీగా ఉంది అని అన్నారు.

Ram Nagar Bunny producer ETV Prabhakar about Devara impact and His Son Chandrahaas talent

మేము సంధ్య థియేటర్‌లో రామ్‌నగర్ బన్నీ సినిమా చూడటానికి యూనిట్‌తోపాటు వెళ్లాం. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు వచ్చి.. దేవర కంటే మీ సినిమానే బాగుంది అని అనడం కొంత అతిశయోక్తి అయినా మాకు ఆనందం కలిగించింది. అయితే అలాంటి స్పందనను ప్రేక్షకులు జెన్యూన్‌గా ఇచ్చినప్పుడు పాజిటివ్‌గా తీసుకోవడం మంచిదే కదా. అని అన్నారు.

రామ్‌నగర్ బన్నీ సినిమా విషయానికి వస్తే.. సుమారుగా 5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు సుమారుగా 1 కోటి రూపాయలు ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చింది. థియేట్రికల్ రన్ ద్వారా 50 లక్షలు గ్రాస్ వచ్చింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే చంద్రహాస్ నటించిన మరో రెండు సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X