వర్షం పడితే వదిలేస్తాడనుకొన్నా.. అయినా వదల్లేదు.. రమ్యకృష్ణ

బాహుబలి తర్వాత రమ్యకృష్ణ మరోసారి తెరపైన విశ్వరూపం చూపించింది. నీలాంబరి, శివగామి పాత్ర తర్వాత శైలజారెడ్డి పాత్రలో తన నటనకు సంబంధించిన మరో కోణాన్ని చూపించింది. ప్రస్తుతం శైలజారెడ్డి అల్లుడు చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ పుట్టిన రోజు సెప్టెంబర్ 15 కావడంతో ఆమె మీడియాతో ముచ్చటించారు. శైలజారెడ్డి అల్లుడు గురించి ఏం చెప్పారంటే..

నా పుట్టిన రోజుకు కానుకగా

నా పుట్టిన రోజుకు కానుకగా

నా పుట్టిన‌రోజుకి శైలజారెడ్డి చిత్రం సూప‌ర్‌హిట్ అవ్వ‌టం చాలా ఆనందంగా వుంది. అలాగే ఈ చిత్రంలో అంద‌రూ చాలా నిజాయితీగా కష్ట‌ప‌డ్డారు.. వారంద‌రికి నా ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు. ఇగో ఉన్న ఊరిపెద్ద పాత్రలో కనిపించాను. సీన్స్ అన్ని చాలా కొత్త‌గా వుంటాయి. చాలా బాగుంటాయి. రొటీన్‌కు భిన్నంగా ఈ సినిమాలో కొత్త అత్త‌, అల్లుడ్ని చూస్తారు.

శైల‌జారెడ్డి అల్లుడు చిత్రంలో

శైల‌జారెడ్డి అల్లుడు చిత్రంలో

శైలజారెడ్డి పాత్ర వైవిధ్యంతో కూడుకొన్నది. ఓ పక్క ఊరులో ఆడ‌వాళ్ళ‌కి అన్యాయం జ‌రిగితే ఏంత‌వ‌ర‌కైనా పోరాడే ధీర‌త్వం.. మ‌రో వైపు త‌ల్లిగా కూతురు మీద ప్రేమ‌.. స‌మ‌స్య వ‌స్తే ఎదుర్కునే ధైర్యం ఇన్ని వున్నాయి శైల‌జారెడ్డి పాత్ర‌లో.. మారుతి గారు ఈ పాత్ర‌ని మ‌లిచిన విధానం చాలా బాగుంది. ఈ చిత్రంలొ అత్త పాత్ర రెగ్యుల‌ర్‌గా ఉండ‌దు.. మీరు ఎప్పూడూ చూస్తున్న అత్త అల్లుళ్ళ మ‌ద్య కామెడి కూడా ఈ చిత్రం లో క‌నిపించ‌దు. చూసిన వారికి , చూసేవారికి స్వీట్ స‌ర్ప‌రైజ్ లా వుంటుంది.

అత్తగా నాకు ఇగో..

అత్తగా నాకు ఇగో..

అత్త గా నాకు ఇగో , కూతురికి ఇగో అంశాలు నవ్వు తెప్పించేలా ఉంటాయి. నేనూ ఎంజాయ్ చేశాను.. సేమ్ నాలాంటి పాత్ర ఇంకోక‌టి నాకు తోడుగా వుంది అని పాపం చైత్య‌న్య గారికి మాత్రం ఫుల్ టెన్ష‌న్ వుంది.. కాని మీరు చూస్తే ఇవ‌న్ని ఫ‌న్ జెనెరేట్ చేస్తాయి. మా ముగ్గురి మ‌ద్యలో న‌రేష్ గారు, మాణిక్యం గా ఫృధ్వి గారు, వెన్నెల కిషోర్ పాత్రలు కామెడిగా వుంటాయి.. కొన్నిసార్లు షూటింగ్ స్పాట్‌లో కూడా ఆపేసి న‌వ్వేవాళ్ళం.. నేను బాగా ఎంజాయ్ చేశాను.

చైతూ మంచి నటుడు అవుతాడు

చైతూ మంచి నటుడు అవుతాడు

నిజ జీవితంలో నాగ‌చైతన్య ఎలాంటి ఇగో లేని మ‌నిషి. ఆయనతో నటించడం చాలా హ్య‌పీగా వుంది. యాక్టింగ్‌లో పరిణతి సాధించాడు. సినిమాలో నన్ను, అనుని క‌న్విన్స్ చేసే సీన్ వుంటుంది. ఆ సీన్‌ను చాలా ఈజ్‌తో మెచ్చూర్డ్ ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. భవిష్యత్‌లో మంచి నటుడు అయ్యే అవకాశం ఉంది.

 మారుతి చాలా స్పీడ్‌గా వర్క్..

మారుతి చాలా స్పీడ్‌గా వర్క్..

డైర‌క్ట‌ర్‌ మారుతి గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ బాబోయ్ స్పీడ్ గా వ‌ర్క్ చేస్తారు. మిష‌న్ లా ... జ‌స్ట్ రెడి అయ్యి కూర్చుందామ‌నుకునే స‌రికి రెడీ రెడీ అని కాల్ చేస్తారు. ఓ రోజు వ‌ర్షం ప‌డుతుంది క‌దా వ‌దిలేస్తాడేమో అనుకున్నా.. ఆ గ్యాప్ లో కూడా తీసేశారు.. వెరీ గుడ్ ఫ్యూచ‌ర్ వుంది. వెరీ గుడ్ ప్లానింగ్‌.. నా కెరీర్ లో ఇంత ఫాస్ట్‌గా షూటింగ్ చేసి ఇంత ఫాస్ట్‌గా ఇచ్చిన చిత్రం శైల‌జారెడ్డి మాత్ర‌మే..

అన్నిరకాలుగా చేయడం ఓ వరం

అన్నిరకాలుగా చేయడం ఓ వరం

నేను సీరియ‌స్ పాత్ర ఎలా చేస్తానో అంతే సులభంగాగా కామెడి కూడా చేయడం నాకు వరం లాంటింది. ఆర్టిస్ట్ అంటే అన్ని చేయ్యాలి.. కో-ఆర్టిస్ట్ పెర్‌ఫెక్ట్ గా వుంటే కామెడి కూడా చాలా బాగా వ‌స్తుంది. అది కూడా స్పాంటెనియ‌స్‌గా వస్తుంది. నేను కామెడి బాగా చేసింది. పంచ‌తంత్రం చిత్రం ఈ శైల‌జారెడ్డి అల్లుడులో నా చుట్టూ కామెడి జ‌రుగుతుంది. హిలేరియ‌స్‌గా వుంటుంది. కాని నేను సీరియ‌స్ గా వుండాలి.. ఇది నాకు డిఫ‌కల్ట్‌గా అనిపించింది.

 గ్రేట్ పీపుల్స్‌తో వర్క్ చేశా

గ్రేట్ పీపుల్స్‌తో వర్క్ చేశా

మీరు సినిమాలో చూశారు అంద‌రూ చాలా అందంగా కనిపిస్తారు. కానీ మారుతి వ‌ర్క్ స్పీడ్ కి ఆయ‌న ప‌రిగెత్తి ప‌రిగెత్తి షూట్ చేసేవాడు పాపం.. గ్రేట్ పీపుల్ తో వ‌ర్క్ చేశాను అనే ఫీలింగ్ వుంది నాకు. నేను చేసిన వెరైటి రోల్స్ మాత్ర‌మే న‌న్ను ఆర్టిస్ట్‌గా నిల‌బెట్టాయి.. సో ఇలాంటి వైరైటి రోల్స్ వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాను.

 దర్శకుడిని, నటీనటులను నమ్మీ

దర్శకుడిని, నటీనటులను నమ్మీ

ఎస్ రాధాకృష్ణ, పీడీపీ ప్రసాద్ చాలా ఫ్యాష‌నేట్ ప్రోడ్యూస‌ర్స్. అలాగే ద‌ర్శ‌కుడ్ని నమ్మి న‌టీన‌టుల్ని న‌మ్మి ఇలా చిత్రాలు చేసే నిర్మాత‌లు చాలా అరుదుగా వుంటారు. వారికి నా త‌రుపున కంగ్రాట్స్‌.. చాలా మంచి చిత్రం.. చ‌క్క‌టి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా అంద‌రూ ఆద‌రిస్తున్నారు. ఇలాగే శైల‌జారెడ్డి అల్లుడ్ని మరింత ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X