twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందీ సినిమాలకు అందుకే దూరమయ్యా.. బాలీవుడ్‌పై రమ్యకృష్ణ హాట్ కామెంట్

    |

    బాలీవుడ్ కెరీర్‌పై దక్షిణాది నటి రమ్య కృష్ణ కామెంట్ చేయడం మీడియాలో ఆసక్తిని రేపింది. హిందీ చిత్ర సీమకు దూరంగా ఉండటానికి కారణాలను వెల్లడించిన ఇంటర్వ్యూ ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌ అనంతరం బాలీవుడ్‌లో వ్యత్యాసాలు, బయటి వ్యక్తులపై ఇండస్ట్రీ రియాక్షన్‌పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

    స్టార్ హీరోయిన్‌గా ఉండగానే..

    స్టార్ హీరోయిన్‌గా ఉండగానే..

    దక్షిణాదిలో రమ్యకృష్ట స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే హిందీ చిత్రాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అగ్ర హీరోలతో సమానంగా రాణిస్తున్నప్పుడు హిందీలో కూడా అమితాబ్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ లాంటి టాప్ హీరోల సరసన నటించారు. ఖల్ నాయక్, బడే మియా చోటే మియా, క్రిమినల్ లాంటి సినిమాల్లో నటించారు. అయితే అనూహ్యంగా హిందీ పరిశ్రమకు దూరం కావడం అంతుపట్టని ప్రశ్నగా మారింది.

    20 ఏళ్ల తర్వాత మళ్లీ హిందీలోకి

    20 ఏళ్ల తర్వాత మళ్లీ హిందీలోకి

    దాదాపు 20 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణ మళ్లీ బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఫైటర్ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా నాకు హిందీలో మంచి పేరును తెచ్చిపెడుతుంది. బాహుబలి సినిమాలో నాకు ఎంత గుర్తింపు వచ్చిందో నాకు అలాంటి ప్రశంసలే దక్కుతాయి అని అన్నారు.

    నా సినిమాలు ఆడలేదు.. అందుకే

    నా సినిమాలు ఆడలేదు.. అందుకే

    ఈ క్రమంలో బాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. నేను హిందీ సినిమా పరిశ్రమ నుంచి బ్రేక్ తీసుకోలేదు. నేను నటించిన సినిమాలు బాలీవుడ్‌లో ఆడలేదు. దాంతో నాకు హిందీలో నటించాలనే ఆసక్తి కలుగలేదు. అదే సమయంలో నా కెరీర్ దక్షిణాదిలో టాప్ రేంజ్‌లో కొనసాగుతున్నది. దాంతో ఇక్కడే బీజీగా మారిపోయాను.

     అమితాబ్‌తో ప్రాజెక్టు ఆగిపోయిందని..

    అమితాబ్‌తో ప్రాజెక్టు ఆగిపోయిందని..

    వాస్తవానికి హిందీ, తమిళంలో అమితాబ్ బచ్చన్‌తో ఓ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. దాంతో అటువైపు వెళ్లాలనే ఆసక్తి తగ్గిపోయింది. ఇలాంటి కొన్ని విషయాలు హిందీ పరిశ్రమకు దూరంగా ఉండటానికి కారణమయ్యాయి అని రమ్యకృష్ణ వెల్లడించింది.

    కారులో మద్యం బాటిళ్లతో పట్టుపడటం

    కారులో మద్యం బాటిళ్లతో పట్టుపడటం

    తాజాగా రమ్యకృష్ణ వివాదంలో చిక్కుకోవడం సెన్సేషనల్‌గా మారింది. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే రమ్యకృష్ణ కారులో మద్యం బాటిళ్లతో పట్టుపడటం తమిళనాడులో సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేయగా, ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ వ్యవహారంపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మాట్లాడటానికి ఆమె నిరాకరించారు.

    రమ్యకృష్ణ కెరీర్ ఇలా..

    రమ్యకృష్ణ కెరీర్ ఇలా..

    రమ్యకృష్ణ కెరీర్ విషయానికి వస్తే.. దక్షిణాదిలో ఇప్పటికి అగ్రతారగా గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు తన సుదీర్ఘమైన కెరీర్‌లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. నరసింహలో నీలాంబరి, బాహుబలిలో శివగామి పాత్రలు ఆమె నటనకు మచ్చు తునక అని సినీ వర్గాలు పేర్కొంటాయి.

    English summary
    South Super Actress Ramya Krishnan shares her experience about Bollywood. Ramya Krishna has given reason Why She keep way from Hindi movie offers. After nearly 20 years gap, She is doing Telugu, Hindi project fighter which produced and directed by Puri Jagannadh, Co produced by Karan Johar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X