ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియోలు చూసి.. మారుతినగర్ సుబ్రమణ్యంలో ఆఫర్.. రమ్య పసుపులేటి
ప్రముఖ నటుడు, టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ రావు రమేష్, ఇంద్రజ జంటగా నటించిన సినిమా మారుతీ నగర్ సుబ్రమణ్యం. ఇందులో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య, అతని సరసన రమ్య పసుపులేటి నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించగా లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ఆగస్టు 23వ తేదీన సినిమా విడుదల అవుతున్నది. ఈ సందర్భంగా యువ హీరోయిన్ రమ్య పసుపులేటి మీడియాతో మాట్లాడుతూ.
నేను బాలనటిగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. చాలా యాడ్స్‌లో నటించాను. పంచాక్షరి చిత్రంలో, మహేష్ బాబుతో స్పైడర్ సినిమాలో నటించాను. నాకు ఇండస్ట్రీలోకి రావడానికి బ్యాకప్ లేదు. ఎవరి సపోర్ట్ కూడా లేదు. అయితే మధ్యలో సినిమాలు ఆపేసి చదువుకొన్నాను. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీ చేయాలని అనుకొన్నాను. కానీ డిగ్రీ ఉంది కదా.. ఇకపై యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టాను. వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఇక ఇన్స్‌టాగ్రామ్‌లో నా రీల్స్, ఫోటోలు, వీడియోలు చూసి దర్శకుడు లక్ష్మణ్ కార్య నాకు ఆఫర్ ఇచ్చారు. మారుతినగర్ సుబ్రమణ్యం లాంటి సినిమా ఆఫర్ రావడం హ్యాపీగా ఫీలయ్యాను అని రమ్య పసుపులేటి అన్నారు.

యాక్టింగ్ పరంగా ఏదైనా చేయవచ్చు. కానీ హాస్యం పండించడం చాలా కష్టం. ఈ సినిమాలో ఫన్ క్రియేట్ చేసే పాత్రలో కనిపించబోతున్నాను. నవ్వించే అవకాశం వచ్చింది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకోంటారనే విషయంపై ఆసక్తిగా ఉంది. నా వరకు నేను చాలా పర్‌ఫెక్ట్‌గా నటించాను. అల్లు అరవింద్ కాబోయే కోడలిననే భ్రమలో ఉంటాను అని రమ్య తన క్యారెక్టర్ గురించి కొంత చెప్పింది.
మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాలో అమాయకంతోపాటు కొంత తింగరితనం ఉండే అమ్యాయి పాత్ర చేశాను. వెస్ట్రన్ గానే కాకుండా సంప్రదాయ పద్దతిలో కూడా కనిపిస్తాన. మేడమ్ సార్ పాట చూస్తే నా క్యారెక్టర్ ఏమిటో అర్దవుతుంది. అకింత్ కోయాతో క్యూట్ లవ్ స్టోరి ఉంటుంది. అంకిత్ మంచి కోస్టార్ అని చెప్పింది.
ఇకీ సినిమాలో రావు రమేష్, ఇంద్రజ లాంటి టాలెంటెడ్, సీనియర్ యాక్టర్లతో నటించాలని చెప్పినప్పుడు భయం వేసింది. ఒకసారి సెట్‌లోకి వెళ్లిన తర్వాత వారు ఇచ్చిన ప్రోత్సాహం చూసి ఆ భయం పోయింది. వాళ్లిద్దరు చాలా కంఫర్ట్ ఇచ్చి బాగా చూసుకొన్నారు. ఓసారి బాగా చేశావమ్మా అని ప్రశసించడం మరిచిపోలేని విషయం. ఇంద్రజతో నాకు పెద్దగా కాంబినేషన్ సీన్లు లేవు అని రమ్య పసుపులేటి చెప్పారు.


Click it and Unblock the Notifications











