తాత రామానాయుడు అడుగుజాడల్లోనే.. రాజకీయ ప్రవేశంపై రానా దగ్గుబాటి ఆసక్తికరమైన కామెంట్
సినీ తెరపై భళ్లాలదేవగా ముద్ర వేసుకొన్న రానా దగ్గుబాటి విభిన్నమైన పాత్రలతో తెలుగు, హిందీ, తమిళ సినిమాలతో రాణిస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్‌తో కలిసి భీమ్లా నాయక్ చిత్రంలో నటించారు. భీమ్లా నాయక్‌లో డేనియల్ శేఖర్ పాత్ర గురించి, భీమ్లా నాయక్ సమయంలో పవన్ కల్యాణ్ గురించి, అలాగే వ్యక్తిగత, ఫ్యామిలీ జీవితం గురించి రానా మాట్లాడుతూ..

పవన్ కల్యాణ్ ఎంట్రీతోనే..
చిన్నతనం నుంచే నేను సినిమా ప్రపంచంలో బతికాను. నేను సినిమాలు చేసే విధానమే డిఫరెంట్. స్కూల్‌కు వెళ్లకుండా సినిమా గురించి తెలుసుకోవడం చిన్నతనం జరిగింది. రియాలిటీకి నేను ఎక్కువగా దగ్గరగా ఉంటాను. అందుకే యూత్‌ను నేను కనెక్ట్ అయి ఉంటాను. అందుకే నా సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ చేయాలనుకొన్నప్పుడు ఇంత పెద్ద క్యాన్వాస్ లేదు. పవన్ కల్యాణ్ ఎప్పుడైతే సినిమా చేశాడో అప్పుడే ఈ సినిమా లార్జర్ మూవీ అయింది అని రానా దగ్గుబాటి అన్నారు.

పవన్ కల్యాణ్‌ను డామినేట్ చేయలేదు
భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కల్యాణ్ క్యారెక్టర్‌ను నేను డామినేట్ చేశానని చెప్పడం సరికాదు. మంచి కంటే ఎప్పుడు చెడు ఎక్కువ ఎట్రాక్ట్ చేస్తుంది. ఒకడు మంచిగా మాట్లాడితే.. మరొకడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే.. రెండో వాడినే ఇష్టపడుతాం. అందుకే డానియల్ శేఖర్ పాత్ర ఎక్కువ మందికి నచ్చి ఉంటుంది. పవన్ కల్యాణ్, మేము ఓ డిఫరెంట్ సినిమా చేయాలని అనుకొన్నాం. పోలీస్ స్టేషన్‌లో పవన్ కల్యాణ్ చేసిన సీన్లు చాలా మందికి నచ్చవు. అందుకే ఒరిజినల్ నుంచి చాలా దూరంగా కొత్త వెర్షన్ డిజైన్ చేశాం. మంచి క్యారెక్టర్లను కథలోకి తీసుకొచ్చాం అని రానా దగ్గుబాటి చెప్పారు.

పెళ్లి తర్వాత నాలో మార్పులు
పెళ్లి తర్వాత నాలో చాలా మార్పులు వచ్చాయి. అందుకే భీమ్లా నాయక్‌లో సంయుక్త మీనన్‌తో కలిసి చేసిన సన్నివేశాలు చాలా ఫీల్‌గుడ్‌గా ఉన్నాయి. నేను ఏదైనా పాత్ర చేసేటప్పుడు నిజ జీవితంలోని అంశాలు నాపై ప్రభావం చూపుతాయి. అందుకే సంయుక్త మీనన్, సముద్రఖనితో చేసిన సీన్లలో మెచ్యురిటీ, కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అనే ముద్ర కనిపించిందనుకొంటాను అని రానా దగ్గుబాటి అన్నారు.

రాజకీయాలపై ఆసక్తి లేదు
ఇక తన తాత రామానాయుడు స్పూర్తితోనే సినిమా రంగంలో ముందుకు సాగుతున్నాం. అయితే తన తాత రాజకీయాల్లోను రాణించారు. అయితే ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం సినిమాలతోనే సరిపోతుంది. సినిమాలే నాకు ప్రయారిటి. మున్ముందు ఏం జరుగుతుందో చెప్పలేను అని రానా అన్నారు.

వెంకటేష్ గారితో వెబ్ సిరీస్
వెంకటేష్ గారితో నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఆయన జోన్‌లోకి నేను వెళ్లలేదు. నా జోన్‌లోకి ఆయన రాలేదు. మేమిద్దరం ఒక జోన్ క్రియేట్ చేసుకొని దానిలోకి వెళ్లాం. ఆ వెబ్ సిరీస్ గురించి మున్ముందు చాలా మాట్లాడాలి. ఇంకా దానికి సమయం ఉంది. నెట్ ఫ్లిక్స్‌తో చాలా ఒప్పందాలు జరిగాయి. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడలేను అని రానా చెప్పారు.


Click it and Unblock the Notifications











