పవన్ కల్యాణ్ హీరో అంటే మైండ్ బ్లాంక్.. అలాంటి సినిమా తీసి హిట్ కొడుతా.. రానా దగ్గుబాటి (ఇంటర్వ్యూ)

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, భళ్లాలదేవ రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో యువ దర్శకుడు సాగర్‌ కే చంద్ర దర్శకత్వం వహించిన చిత్రం 'భీమ్లానాయక్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. అయ్యప్పన్నమ్ కోషియం సినిమాకు రీమేక్‌ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రంలో డేనియేల్‌ శేఖర్‌ పాత్రతో మెప్పించిన రానా దగ్గుబాటి ఫిబ్రవరి 2వ తేదీన తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటిస్తూ..

పవన్, త్రివిక్రమ్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నా

పవన్, త్రివిక్రమ్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నా


భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారనే విషయం తెలిసి.. ఈ ప్రాజెక్ట్‌ చాలా పెద్దది అయిపోయిందే అనుకొన్నాను. పవన్ కల్యాణ్ లాంటి పెద్ద స్టార్ వచ్చి ఇలాంటి జోనర్ సినిమాను. ఆ పాత్రను చేస్తున్నారని తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇక త్రివిక్రమ్ ఒక ఎక్సైటింగ్ పర్సన్. అతడు ఏమి మాట్లాడినా విలువైనది అనిపిస్తుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకొనే అవకాశం కలిగింది. పవన్, త్రివిక్రమ్ నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నాను. భీమ్లా నాయక్ నాకు మంచి అనుభూతిని కలిగించింది అని రానా దగ్గుబాటి అన్నారు.

తెలుగు నేటివిటికి అనుగుణంగా

తెలుగు నేటివిటికి అనుగుణంగా

అయ్యప్పనుమ్ కోషియం ఒకే పాయింట్‌తో మూడు గంటలు నడుస్తుంది. అది మలయాళంలో వర్కువుట్ అయింది. తెలుగు నేటివిటికి వచ్చే సరికి ఆ కథలో అనేక కొన్ని ట్విస్టులు, మలుపులు చేయాలి. అదే భీమ్లా నాయక్ సినిమాలో జరిగింది. కొన్నిసార్లు చెడ్డ పాత్ర కూడా మంచి పేరు తెస్తుంది. నెగిటివ్ పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది అని రానా చెప్పారు.

పవన్ కల్యాణ్ డిఫరెంట్ పర్సనాలిటీ

పవన్ కల్యాణ్ డిఫరెంట్ పర్సనాలిటీ

ఒక్కో సినిమా, పాత్ర, ఒక్కో స్టార్‌తో నాకు విభిన్నమైన రకంగా అనుభూతిని కలిగిస్తుంది. పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేసేటప్పుడు తెలియని ఫీలింగ్ కలిగింది. పవన్ కల్యాణ్ నాకు ముందు తెలుసు. చాలా డిఫరెంట్ పర్సనాలిటీ. స్వచ్ఛమైన హృదయం కలిగిన వాడు. ఆయనను చూస్తే చెప్పలేనంత ఎనర్జీ కలుగుతుంది. ఆయనను కలవడం చాలా తక్కువ. అలాంటి వ్యక్తికి దగ్గరగా పనిచేయడం గొప్ప అనుభవం అని రానా చెప్పారు.

సూపర్ హిట్ హడావిడితో..

సూపర్ హిట్ హడావిడితో..

భీమ్లానాయక్‌ విడుదల రోజు నేను ముంబైలో వేరే షూటింగ్‌లో ఉన్నా. షూట్‌ కంప్లీట్‌ అయ్యాక అక్కడ ఉన్న తెలుగు ఆడియన్స్‌తో సినిమా చూశా. అప్పటికే సోషల్‌ మీడియాలో సినిమా సూపర్‌హిట్‌ అని హడావిడి జరుగుతోంది. మిత్రులు, సినిమా పరిశ్రమ నుంచి ప్రశంసలు, అభినందనలతో అప్పటికే చాలా మెసేజ్‌లు వచ్చాయి. చాలా ఆనందంగా అనిపించింది అని రానా పేర్కొన్నారు.

మా నాన్న ఏమన్నాడంటే..

మా నాన్న ఏమన్నాడంటే..

నేను చేసిన డేనియల్ శేఖర్ పాత్ర చూసి నాన్న సురేష్ బాబు చాలా సంతృప్తి చెందారు అని రానా తెలిపారు. ఆయన అలా చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. బాహుబలి తర్వాత మళ్లీ ఈ సినిమాకే చాలా గొప్పగా చెప్పారు. ఏదో ఒక రోజు పాటలు, ఫైట్స్ లేకుండా టాకీతోనే సినిమా తీసి హిట్‌ కొడతా అని మా నాన్నతో చెబుతుంటా. అలాంటి ప్రయత్నం చేస్తా. ఇకపై అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ సినిమాలు చేస్తాను. సోషల్‌ మీడియాలో దాని గురించే చర్చ నడుస్తోంది. అలాంటి చిత్రాలు చేయాలని నాకూ ఇప్పుడే తెలిసింది. 'ఇతర ఇండస్ట్రీల్లో కథల్ని చెబుతారు. తెలుగు ఇండస్ట్రీ మాత్రం ఫిల్మ్‌ మేకింగ్‌‌పై దృష్టిపెట్టింది. వకీల్‌సాబ్‌ రిలీజ్‌ సమయంలో ఓ డిస్ట్రిబ్యూటర్‌ చెప్పారు. అప్పుడే నాకు ఈ విషయాలన్నింటి మీద ఓ అవగాహన వచ్చింది అని రానా దగ్గుబాటి పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X