For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకొంటా.. మగవాళ్లు కంటతడి.. రాశీ ఖన్నా

By Rajababu
|
Rashi Khanna Interview With Filmibeat

అందాల తార రాశీ ఖన్నా బాలీవుడ్‌ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించినప్పటికీ.. తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకొన్నది. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం రూపొందించిన మద్రాస్ కేఫే తర్వాత అవసరాల శ్రీనివాస్ రూపొందించిన ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అగ్ర హీరోల పక్కన నటిస్తు తన ప్రతిభను చాటుకొంటున్నారు.

ఇటీవల వచ్చిన తొలి ప్రేమ చిత్రంలో ఆమె నటనపై విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఆమె నితిన్‌తో కలిసి శ్రీనివాస కల్యాణం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 9న రిలీజ్ అవుతున్న సందర్భంగా తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. తెలుగు పెళ్లి అంటే ఇష్టం ఏర్పడింది.. తెలుగు అబ్బాయితో పెళ్లి జరిగితే బాగుంటుందని అనుకొంటున్నాను అని ఇంకా ఆమె చాలా విషయాలు తెలిపారు.

ఎమోషనల్‌కు లోనయ్యాను

ఎమోషనల్‌కు లోనయ్యాను

ఆదివారం రాత్రి సినిమా చూశాను. చాలా ఎమోషనల్‌కు లోనయ్యాను. నా కెరీర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లినట్టు అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాను. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ప్రకాశ్ రాజ్, జయసుధ మధ్య జరిగే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి.

ఫ్యామిలీ, లవ్‌స్టోరి

ఫ్యామిలీ, లవ్‌స్టోరి

శ్రీనివాస కల్యాణం చిత్రం మంచి లవ్ స్టోరి. ప్రేమ ఎలా పెళ్లి వరకు వెళ్లిందనే అంశంగా కథ సాగుతుంది. ఇందులో శ్రీ అనే పాత్రను పోషిస్తున్నాను. ఫ్యామిలీ వ్యాల్యూస్, రక రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. పెళ్లి సీన్లు చాలా బాగుంటాయి. పెళ్లిలో జరిగే తంతులో ప్రతీ విషయం గురించి చాలా విషయాలు తెలుసుకొంటారు. ప్రేక్షకుల హృదయాలను తాకే చిత్రమవుతుందని బలంగా నమ్ముతాను.

కథ చెప్పినప్పుడు భావోద్వేగానికి

కథ చెప్పినప్పుడు భావోద్వేగానికి

దర్శకుడు సతీష్ వేగేశ్న కథ చెప్పినప్పుడే నాకు ఆ ఫీలింగ్ కలిగింది. కథ చెప్పినప్పుడు ఎలా అనిపించిందో.. సినిమా చూసిన తర్వాత కూడా అదే ఉద్వేగానికి లోనయ్యాను. అమలాపురంలో సన్నివేశాల చిత్రీకరణ బాగుంది. విజువల్స్ చాలా అద్బుతంగా ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, జయసుధ, సితార, నరేష్ తదితరుల పాత్రలు ఆకట్టుకొనే విధంగా ఉంటుంది.

పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది

పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది

పెళ్లి ప్రధాన అంశంగా జరిగే ఈ సినిమా ప్రతీ ఒక్కరిని మూలాలకు తీసుకెళ్తుంది. ఈ జనరేషన్‌కు శ్రీనివాస కల్యాణం సినిమా చాలా అవసరం. సెకండాఫ్‌ షూట్ చేస్తున్నప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక బలంగా కలిగింది. అద్భుతమైన కుటుంబ విలువలు ఉన్న చిత్రం. ఉత్తరాదికి చెందిన దానిని. కానీ తెలుగు సంప్రదాయ పద్దతిలో జరిగే పెళ్లి చాలా ఆకట్టుకొన్నది. ఈ సినిమా గొప్ప అనుభూతికి లోనయ్యాను.

తెలుగు అమ్మాయిలా ఫీలయ్యాను

తెలుగు అమ్మాయిలా ఫీలయ్యాను

శ్రీనివాస కల్యాణం సినిమా నన్ను తెలుగు అమ్మాయిలా ఫీల్ అయ్యేలా చేసింది. తెలుగు సాంప్రదాయాలు నన్ను బాగా కదలించాయి. నాతోపాటు మా నాన్న కూడా ఈ సినిమా చూశాడు. ఆయన సినిమా చూస్తున్న సేపు కంటతడి పెట్టాడు. సినిమా చూస్తూ ఓ మగవాడు ఏడ్వటం ఇదే తొలిసారి. ప్రతీ ప్రేక్షకుడు కూడా అదే అనుభూతికి లోనవుతాడు. నాకు డబ్బింగ్ చెప్పిన ప్రియాంక కూడా ఫోన్ చేసి ఏడ్చింది. ఈ సినిమాలో అంత ఇంటెన్సెటి ఉంది.

రిలేషన్స్, ఎమోషన్స్ ప్రధానంగా

రిలేషన్స్, ఎమోషన్స్ ప్రధానంగా

శ్రీనివాస కల్యాణానికి మిక్కి జే మేయర్ సంగీతం అదనపు ఆకర్షణ. క్లైమాక్స్‌లో సన్నివేశాలను తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఈ చిత్రంలో నందిత శ్వేత క్యారెక్టర్ బాగుంది. సితార రోల్ కూడా ఆకట్టుకొంటుంది. జయసుధ ఈ సినిమాకు వెన్నముకగా నిలిచారు. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు పెళ్లి కథాంశంగా వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్, ఎమోషన్స్ ఆధారంగా సాగుతుంది.

పెళ్లి ప్రాముఖ్యత తెలిసింది

పెళ్లి ప్రాముఖ్యత తెలిసింది

తెలుగు సాంప్రదాయ పద్దతిలో జరిగే పెళ్లిలో తలంబ్రాలు, జిలకర, బెల్లం లాంటి ప్రాముఖ్యత తెలుసుకొన్నాను. అప్పటి నుంచి తెలుగు పెళ్లి అంటే చాలా ఇష్టం ఏర్పడింది. నా పెళ్లి కూడా అలా జరిగితే బాగుందని అనుకొంటున్నాను. అది జరుగుతుందో లేదో తెలియదు. కానీ ఆ ఫీలింగ్ మాత్ర గొప్పగా ఉంది.

తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని

తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని

ఒకవేళ వీలైతే తెలుగు అబ్బాయిని చేసుకోవాలని ఉంది. కానీ అది జరుగుతుందో లేదో తెలియదు. జరిగితే బాగుండాలని కోరుకొంటున్నాను. పెళ్లి జరిగితే చాలూ అని అనుకొంటున్నాను. పెళ్లి జరిగితే ఇవన్నీ తప్పకుండా గుర్తుకు రావడం ఖాయం. ఇప్పటి వరకు తెలుగు పెళ్లి చూడలేదు. చాలా పెళ్లిళ్లకు వెళ్లినా ఫొటోలకు స్మైల్ ఇచ్చి వచ్చేశాను. కానీ శ్రీనివాస కల్యాణం మాత్రం పెళ్లంటే ఏంటో చెప్పింది.

English summary
Raashi Khanna is an actress in the Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras Cafe and made her debut in Telugu with the successful Oohalu Gusagusalade. She has sparked in Toliprema with her performance. And Now Raashi Khanna doing a film with Nitin in Srinivasa Kalyanam.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more