twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముగ్గురిని రిజెక్ట్ చేసి.. నన్నే కావాలనుకొన్నాడు.. రష్మిక మందన్న

    By Rajababu
    |

    ఛలో సినిమాతో అందాల భామ రష్మిక మందన్న టాలీవుడ్‌కు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా గీత గోవిందం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ దేవరకొండ సరసన డామినేట్‌ పాత్రలో నటించి మెప్పించారు. గీత పాత్రలో రష్మిక నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తున్నది. ఈ నేపథ్యంలో తన విజయానందాన్ని పంచుకోవడానికి ఫిల్మీ బీట్‌తో ముచ్చటించింది. రష్మిక చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

    ఫస్ట్ డే ఫస్ట్ షో..

    ఫస్ట్ డే ఫస్ట్ షో..

    గీతా గోవిందం సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. మొదటి రోజు మొదటి షో చూడటం ఇదే తొలిసారి. సినిమా షూటింగ్‌లోనే చాలా ఎంజాయ్ చేశాం. కానీ తెర మీద చూస్తే చాలా ఫన్నీగా ఉంది. స్క్రీన్ మీద నన్ను చూసుకోవడం మరోసారి కొత్త అనుభూతి కలిగింది.

    Recommended Video

    Geetha Govindam Movie Public Talk గీత గోవిందం సినిమా పబ్లిక్ టాక్
    రెండో చిత్రంలోనే భావోద్వేగంగా

    రెండో చిత్రంలోనే భావోద్వేగంగా

    టాలీవుడ్‌లో గీత గోవింద నాకు రెండో సినిమానే. భాష గురించి నాకు తెలియదు. కానీ రెండో చిత్రంలోనే చాలా భావోద్వేగమైన పాత్ర లభించడం ఓ చాలెంజ్‌ అనిపించింది. ఆ పాత్ర ద్వారా నాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ మరింత ఆనందాన్ని కలిగించింది.

     నేనే కావాలని పట్టుపట్టారు

    నేనే కావాలని పట్టుపట్టారు

    కిరిక్ పార్టీ సినిమా చూసిన తర్వాత దర్శకుడు పరుశురాం నేనే కావాలని పట్టుపట్టారట. నాకు పరుశురాం కథ చెప్పగానే మరోమారు ఆలోచించకుండా ఈ సినిమాను ఒకే చేశాను. నేను తీసుకొన్న విషయం ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తున్నది.

    ముగ్గురిని రిజెక్ట్ చేసిన తర్వాత

    ముగ్గురిని రిజెక్ట్ చేసిన తర్వాత

    గీత పాత్ర కోసం ముగ్గురిని ఎంపిక చేసి రిజెక్ట్ చేసిన విషయం తర్వాత తెలిసింది. వారు ఈ పాత్ర కోసం పనికి రారని వారిని రిజెక్ట్ చేశారట. అలాంటి పాత్ర నాకు రావడం చాలా అదృష్టంగా భావించాను. హీరోయిన్లను రిప్లేస్ చేయడం ఇండస్ట్రీలో చాలా కామన్. దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

    బలమైన హీరోయిన్ పాత్రలో

    బలమైన హీరోయిన్ పాత్రలో

    గీత గోవిందం సినిమాను ఒప్పుకోవడానికి ప్రధాన కారణం ఈ చిత్రంలో ఉన్న వినోదం. కథ విన్నప్పుడే నాలుగైదు సార్లు బాగా నవ్వుకొన్నప్పుడు ఒప్పుకోకపోవడంలో అర్ధం కనిపించలేదు. కేవలం ఆట పాటలకు పరిమితమైన హీరోయిన్ పాత్ర కాకుండా ఓ మంచి పాత్రను పరుశురాం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.

    సీరియస్‌గా కనిపించడం కష్టమైంది

    సీరియస్‌గా కనిపించడం కష్టమైంది

    గీత పాత్రలో సీరియస్‌గా కనిపించడం చాలా కష్టంగా మారింది. నేను స్వతహాగా నేను చాలా జోవియల్. అలాంటిది ఏడు నెలలపాటు కోపంగా ఉండటం ఇబ్బంది కలిగించింది. చివర్లో హ్యుమర్ ఉండే సన్నివేశాల్లో నటించడం రిలీఫ్ కలిగింది. కోపంగా ఉండే తీరు మాత్రం షాట్ పూర్తయ్యంత వరకే. ఆ తర్వాత చాలా హ్యాపీగా ఉండే వాళ్లం.

     నవ్వు ఆపుకోవడం కష్టమైంది

    నవ్వు ఆపుకోవడం కష్టమైంది

    గీత గోవిందంలో చాలా పొడవైన డైలాగ్స్ చెప్పాల్సి రావడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే నాకు భాష రాకపోవడమే. గోవిందంగా విజయ్ మేడమ్ మేడమ్ అంటూ నా వెంటపడుతుండటం మరింత ఇబ్బందిగా మారింది. ఎందుకంటే నేను సీరియస్‌గా ఉండాలి. కానీ విజయ్‌ను చూస్తే బాగా నవ్వు వచ్చేది. దానిని ఆపుకోవడానికి చాలా కష్టపడేది.

    English summary
    Geetha Govindam is a Telugu movie starring Vijay Deverakonda and Rashmika Mandanna in prominent roles. It is a romantic drama directed by Parasuram. Allu Aravind, Bunny Vasu are the producers for this movie. This movie released on August 15, 2018. This movie collecting huge collections world wide. In this occassion, Heroine Rashmika Mandanna speak to Telugu Filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X