#RashmikaMandanna సమంత సూపర్ హాట్.. స్పెషల్ సాంగ్‌పై రష్మిక గరం గరం కామెంట్లు

అల వైకుంఠపురంలో మూవీ తర్వాత అల్లు అర్జున్, రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పుష్ప. రిలీజ్‌కు ముందు విడుదలైన టీజర్లు, ట్రైలర్లు, మోషన్ పోస్టర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. అయితే చివర్లలో సమంతతో స్పెషల్ సాంగ్‌ చేయించడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పుష్ప విడుదలకు సిద్దమైన నేపథ్యంలో మీడియాతో హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ..

 బాలీవుడ్‌లో అల్లు అర్జున్‌కు ఫుల్ డిమాండ్

బాలీవుడ్‌లో అల్లు అర్జున్‌కు ఫుల్ డిమాండ్

బాలీవుడ్‌లో అల్లు అర్జున్‌కు మంచి డిమాండ్ ఉంది. అక్కడ నేను షూటింగ్ చేసినప్పుడు అక్కడి వాళ్లు బన్నీ సార్‌ గురించి అడుగుతుంటారు. బన్నీకి బాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్‌కు బన్నీ వెళ్లాలని అనుకొంటే ఆయనకు వెల్కమ్ చెప్పడానికి చాలా మంది నిర్మాతలు రెడీగా ఉన్నారు. పుష్ప టీజర్ రిలీజ్ అయినప్పుడు నేను గుడ్‌బై షూటింగులో ఉన్నాను. నేను టీజర్ చూస్తుంటే అందరూ వచ్చి నా చుట్టూ మూగి చూశారు అని రష్మిక చెప్పారు.

 బాలీవుడ్‌లో గ్రాండ్ రెస్సాన్స్

బాలీవుడ్‌లో గ్రాండ్ రెస్సాన్స్

బాలీవుడ్ చిత్రం గుడ్‌బై లోని నా పాత్రకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. రషెస్ చూసిన తర్వాత నా రోల్ చాలా బాగుందని డైరెక్టర్, హీరో చెప్పారు. దాంతో నాకు ఎప్పుడెప్పుడూ ఆ సినిమా చూడాలా అని ఉంది. నేను ఎలా నటించానని చూసుకోవడానికి ఎదురు చూస్తున్నాను. నన్ను తీసుకోవడం కరెక్ట్ అని వాళ్లు భావించడంతో నాకు చాలా సంతోషంగా ఉంది అని రష్మిక మందన్న చెప్పారు.

అమితాబ్ బచ్చన్ గురించి

అమితాబ్ బచ్చన్ గురించి

అమితాబ్ బచ్చన్ చాలా కూల్ పర్సన్. సూపర్ స్టార్ అయినప్పటికీ నాలాంటి వాళ్లకు చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతారు. ఎదుటి వ్యక్తిని కంఫర్ట్‌గా ఉంచడానికి చూస్తారు. ఒక తండ్రిలా బిహేవ్ చేస్తారు. వర్క్ చేసేటప్పుడు చాలా సీరియస్‌గా ఉంటారు. ఒకసారి షాట్ ఫినిష్ అయిన తర్వాత చాలా కామ్‌గా, కూల్‌గా ఉంటారు అని రష్మిక చెప్పారు.

పుష్పలో సమంత స్పెషల్ సాంగ్‌తో

పుష్పలో సమంత స్పెషల్ సాంగ్‌తో

పుష్ప మూవీలో స్పెషల్ సాంగ్‌లో సమంత హాట్‌గా కనిపించింది. ఈ సినిమాలో నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే నేను మెసేజ్ చేసి కంగ్రాట్స్ అని చెప్పాను. అయితే స్పెషల్ సాంగ్‌లో నన్ను నటించమంటే ఒకటికి రెండుసార్లు నటించే దానిని. కానీ సూపర్ స్టార్ లాంటి సమంత ఒప్పుకోవడం చాలా గ్రేట్. ఆమె గట్స్‌కు హ్యాట్సాఫ్. ఫస్ట్‌టైమ్ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఆమె చేసిన హార్డ్‌వర్క్‌ను చూసి నేను చాలా గర్వపడుతాను అని రష్మిక అన్నారు.

ఏడుపు సీన్లు లేకుండా ఉండవు..

ఏడుపు సీన్లు లేకుండా ఉండవు..

పుష్ప చిత్రంలో నాది ఎమోషనల్ పాత్ర. ప్రతీ సినిమాలో నన్ను డైరెక్టర్ ఏడిపించకపోతే ఆ పాత్రకు గుర్తింపు ఉండదు. నేన నటించిన ప్రతీ సినిమాలో కనీసం ఒక ఏడుపు సీన్ ఉంటుంది. పుష్ప చిత్రంలో అలాంటి సీన్లు ఉన్నాయి. పుష్ప చాలా ఎమోషనల్, పవర్‌ఫుల్ సినిమాగా ఉంటుంది. సినిమా తప్పుకుండా మంచి అనుభూతిని పంచుతుంది అని రష్మిక మందన్న చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X