twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ దేవరకొండకు అంత సీన్ లేదు.. ఆయన కోసం కాదు.. రష్మిక మందన్న

    |

    గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న చిత్ర డియర్ కామ్రేడ్. ఈ చిత్రం ద్వారా భరత్ కమ్మ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ పిక్చర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. జూలై 26న రిలీజ్ అవుతున్న క్రమంలో హీరోయిన్ రష్మిక మందన్న తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఆమె సినిమా గురించి, తన వ్యక్తిగత అనుభవాల గురించి ఏం మాట్లాడారంటే..

    ప్రమోషన్స్‌తో యమ బిజీగా

    ప్రమోషన్స్‌తో యమ బిజీగా

    డియర్ కామ్రేడ్ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ కానున్నది. కాబట్టి ప్రమోషన్ వర్క్ కూడా చాలా హేవీగా ఉంది. మ్యూజిక్ ఫెస్టివల్స్‌తో హంగామా చేస్తున్నాం. ప్రమోషన్స్ షూట్స్, టూర్స్‌తో పూర్తిగా అలసిపోతున్నాను. ఇవే కాకుండా కొత్త సినిమా షూట్స్‌తో బిజీగా ఉన్నాను. గత కొద్దిరోజులుగా క్షణం తీరిక లేకుండా ఉంటున్నాను అని రష్మిక తెలిపింది.

     ప్రొఫెషనల్ క్రికెటర్‌గా నటించా

    ప్రొఫెషనల్ క్రికెటర్‌గా నటించా

    డియర్ కామ్రేడ్ సినిమాలో క్రికెటర్‌గా కనిపించాలి. పక్కా ప్రొఫేషనల్‌గా కనిపించాల్సి రావడంతో నాలుగు నెలలకుపైనే శిక్షణ తీసుకొన్నాను. క్రికెటర్‌గా నా పాత్ర నిడివి గురించి చెప్పను. కాకపోతే కథకు చాలా ఇంపార్టెంట్. క్రికెటర్‌గా ఎంత సేపు ఉంటాననే విషయాన్ని తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే. లిల్లీ, బాబీ లైఫ్ జర్నీలో ఇది భాగం. నేను స్టేట్ లెవెల్ క్రికెటర్‌గా కనిపిస్తాను. జాతీయ స్థాయిలో ఆడాలని కోరికతో ఉంటాను.

    విజయ్ దేవరకొండకు అంత సీన్ లేదు

    విజయ్ దేవరకొండకు అంత సీన్ లేదు

    డియర్ కామ్రేడ్ సినిమా కథ నచ్చడంతోనే అంగీకరించాను. విజయ్ దేవరకొండ కోసం సినిమా చేయలేదు. ఆయనను చూసి సినిమా చేసే అంత సీన్ లేదు. విజయ్ దేవరకొండ భరత్ కమ్మ పంపిన స్క్రిప్ట్ చదివి చాలా ఎక్సైట్ అయ్యాను. సాధారణంగా నేను ఎక్కువగా చదవడానికి ఇష్టపడను. కానీ స్క్రిప్ట్ చదవడం ప్రారంభించిన తర్వాత రెండు గంటలు కంటిన్యూగా చదివాను. కథలో ఏం జరుగుతుందో అనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆతృత నాలో పెరిగింది అని రష్మిక అన్నారు.

     జ్ఞాపకశక్తి కోల్పోవడం అనే అంశంతో

    జ్ఞాపకశక్తి కోల్పోవడం అనే అంశంతో

    డియర్ కామ్రేడ్‌‌లో నా పాత్ర మెమోరీస్ లాస్ (జ్ఞాపకశక్తి)‌తో కూడినదా అంటే సినిమా చూస్తే తెలుస్తుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం అనే అంశం గురించి తెలియజేస్తే మజా ఉండదు. నా పాత్ర ఏమిటనే విషయంపై క్యూరియాసిటీ ఉంటేనే మంచింది. ఇద్దరు యువతీ, యువకుల జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో జరిగే పరిణామాల క్రమమే నా పాత్ర అని రష్మిక చెప్పారు

     కొత్త డైరెక్టర్లతో పనిచేయడం గురించి

    కొత్త డైరెక్టర్లతో పనిచేయడం గురించి

    కొత్త డైరెక్టర్లతోనే పనిచేయడం నాకు లభించిన వరం లాంటింది. కొత్త డైరెక్టర్లు నా కోసం అలాంటి పాత్రలు రాస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాలో నా పాత్రను భరత్ కమ్మ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. యంగ్ డైరెక్టర్ల టాలెంట్ చాలా గొప్పగా ఉంటున్నది. అందుకే కొత్త డైరెక్టర్లతో కలిసి పనిచేస్తున్నాను అని రష్మిక తెలిపారు.

    English summary
    Geetha Govindam stars Vijay Deverakonda and Rashmika Mandanna are back again for an upcoming film called Dear Comrade. This movie song nee neeli Kannullona goes viral in music circle.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X