ఒక్కొక్కొడిని చితక్కొట్టాలని ఉంది.. నాన్నను కన్విన్స్ చేశా.. రష్మిక మందన్న
Recommended Video

కిరిక్ పార్టీతో కెరీర్‌ను ఆరంభించిన కన్నడ భామ రష్మిక మందన్న టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఛలో చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్న ఈ అందాల తార తాజాగా గీత గోవిందంతో మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకొన్నారు. కెరీర్ ఆరంభంలోనే ఫెర్ఫార్మెన్స్ పాత్రలను దక్కించుకొంటున్న రష్మిక తాజాగా తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. తన కెరీర్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు.

కెరీర్ ఆరంభంలోనే
కెరీర్ ఆరంభంలోనే మంచి పాత్రలు రావడం నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లభించింది. పాత్రల ఎంపికలో నేను నా తల్లిదండ్రులు, స్నేహితుల అభిప్రాయాన్ని తీసుకొంటాను. కొన్నిసార్లు నాకు నచ్చిందంటే నా పేరెంట్స్‌ను ఒప్పిస్తాను. అలా జరిగిందే గీతా గోవిందం చిత్రం.

నాన్నను కన్విన్స్ చేశా
గీతా గోవిందం చిత్ర కథ విన్నప్పుడే ఎలాగైనా చేయాలని అనుకొన్నాను. నాకు బాగా నచ్చింది అని మా తల్లిదండ్రులకు కథ గురించి చెప్పాను. ప్రధానంగా ఎలాగైనా చేస్తానని చెప్పి మా నాన్నను కన్విన్స్ చేశాను. సినిమా రిలీజైన తర్వాత గీత గోవిందం గురించి అందరూ మాట్లాడుకొంటుంటే నా నిర్ణయం సరైనదనే ఆనందం కలిగింది.

విలన్ పాత్రలో నటించాలని
కథ నచ్చితే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు విలన్ పాత్రలో నటించాలనే కోరిక ఉంది. మంచి విలన్‌గా ఒక్కొక్కరిని చావగొట్టే అవకాశం వస్తే నాకు అంతకు మించిన కోరిక ఏమీ ఉండదు. విలన్ పాత్రను పోషించే సత్తా నాకు ఉంది అని రష్మిక వెల్లడించారు.

నానితో దేవదాస్ చిత్రంలో
ప్రస్తుతం దేవదాస్ చిత్రంతోపాటు విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాను. నానితో కలిసి నటించిన దేవదాస్ చిత్రం సెప్టెంబర్‌లో రిలీజ్ కానున్నది. ఇంకా రెండు కన్నడ చిత్రాలను ఒప్పుకోవాల్సి ఉంది. ఇంకా అవి సంప్రదింపుల దశలోనే ఉన్నాయి అని రష్మిక చెప్పారు.


Click it and Unblock the Notifications











