Rashmika Mandanna పెళ్లికి ఇంకా టైమ్ ఉంది.. రూమర్లపై ఘాటుగా స్పందించిన శ్రీవల్లి..
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నేను ఆద్య అనే రోల్ ప్లే చేస్తున్నాను. ముక్కుసూటిగా ఉండే యువతి పాత్ర. కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచించే పాత్ర. ఫస్ట్ లాక్‌డౌన్‌కు ముందు దర్శకుడు అప్రోచ్ అయ్యారు. కథ వినగానే వెంటనే పెద్దగా నవ్వాను. ఒక ఫన్నీ క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తున్నారంటే.. రాధిక మేడమ్ చేస్తున్నారని చెప్పారు. ఊర్వశి, కుష్పూ, ఇంకా చాలా మంది యాక్ట్ చేస్తున్నారని చెప్పారు. ఆ కథ చాలా ఫన్నీగా అనిపించింది. దాంతో వెంటనే ఓకే చెప్పాను. సెట్‌లో సీనియర్లతో నటించే అవకాశం ఏర్పడింది. నటనపట్ల వారికి ఉన్న డిడికేషన్ చూసి షాక్ తిన్నాను. ఈ సినిమా వినోదపరంగా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని రష్మిక మందన్న తెలిపారు.

శర్వానంద్‌తో పనిచేయడం హ్యాపీగా
శర్వానంద్‌తో వర్క్ చేయడం చాలా స్వీట్‌గా అనిపించింది. ఆయన సహకారం వల్ల సన్నివేశాల్లో నటించడం చాలా ఈజీ అయింది. ఇంటి నుంచి అందరికి ఫుడ్ తీసుకొచ్చి కేర్ తీసుకొనే వారు. సెట్‌లో ఆడవాళ్లు ఉంటే.. చాలా కలర్‌ఫుల్ ఉండేది. ఆడవాళ్ల ముచ్చట్లతో కళకలలాడేది. అందర్నీ చూస్తే ముచ్చట వేసేది. అందరూ ఏదో ఒకటి మాట్లాడే వారు. ఫ్యామిలీ స్టోరితో రూపొందే సినిమా కావడంతో కుటుంబంతో పనిచేసినట్టు ఉండేది అని రష్మిక మందన్న అన్నారు.

భీష్మలో క్యారెక్టర్ మాదిరిగా
పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర నుంచి ఆద్య పాత్రకు షిష్ట్ కావడానికి కొంత గ్యాప్ తీసుకొన్నాను. శ్రీవల్లి కంప్లీట్‌గా డిఫరెంట్ ఫ్లేవర్. ఆద్య విషయానికి వస్తే.. భీష్మలోని క్యారెక్టర్ మాదిరిగా ఉంటుంది. శర్వానంద్ క్యారెక్టర్‌ను ఆడేసుకొనే అవకాశం కలిగింది. కథలో నా కుటుంబం కూడా శర్వా పాత్రతో కాన్‌ఫ్లిక్ట్ ఉంటుంది. మా అమ్మకు పెళ్లి చేయడం ఇష్టం లేదు. కాబట్టి ఆ డ్రామాలో భాగంగా నేను కూడా శర్వాను టీజ్ చేస్తుంటాను అని రష్మిక చెప్పారు.

సెట్స్‌లో ఓ రకమైన ఫీలింగ్‌తో
నాకు ఫ్యామిలీ డ్రామా చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో ఎమోషన్స్ బాగా పండాయి. సెట్స్‌కు వస్తున్నామంటే.. ఓ రకమైన ఫీలింగ్‌లోకి వెళ్లేవాళ్లం. సీనియర్ యాక్టర్లందరితో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తిరుమల కిషోర్ రాసిన కథ, కథనాలు, డిజైన్ చేసిన పాత్రలు చాలా బాగుంటాయి. సినిమా అందర్నీ ఆకట్టుకొంటుంది. ఈ చిత్రంలో అందర్నీ ఏడిపించాను. కానీ నేను ఏడవ లేదు అని రష్మిక చెప్పారు.

పెళ్లికి ఇంకా టైమ్ ఉంది
ఇటీవల తన పెళ్లిపై వచ్చిన రూమర్లపై రష్మిక స్పందించారు. నా పెళ్లి అంటూ రాసిన కథనాలు దృష్టికి వచ్చాయి. టైంపాస్ కోసం అలా ఎలా రాస్తారు అని అన్నారు. అయితే తన పెళ్లికి ఇంకా టైమ్ ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకొంటాను అని రష్మిక మందన్న చెప్పారు. కొద్ది రోజల క్రితం రష్మికతో పెళ్లి అంటూ మీడియాలో వార్త రావడంపై విజయ్ దేవరకొండ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్‌లో భారీ ఆఫర్లు
ఫుష్పలో శ్రీవల్లి పాత్ర తర్వాత బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. రెండు భారీ, క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాను. అధికారికంగా త్వరలోనే చిత్ర యూనిట్లు వెల్లడిస్తాయి. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. అయితే తనకు ఎమోషనల్ కంటెంట్ ఉన్న చిత్రాలు, అలాగే బయోపిక్ చిత్రాల్లో నటించాలని ఉంది అని రష్మిక చెప్పారు.


Click it and Unblock the Notifications











