Rashmika Mandanna అతడితో 100 సినిమాల్లో నటించడానికి రెడీ.. మా కెమిస్ట్రీ ఫుల్ వర్కువట్ అయిందంటూ..

కన్నడ భామగా పరిచయమైన రష్మిక మందన్న ఛలో సినిమాతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స్థిరపడిపోయారు. నాగార్జున, నాని, మహేష్ బాబు లాంటి సీనియర్ యాక్టర్లతోపాటు యువ హీరోలతో కూడా నటించి మెప్పించారు. తాజాగా అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప చిత్రంలో శ్రీవల్లి పాత్రలో నటించారు. పుష్ప మూవీ డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న మాట్లాడుతూ..

 డీ గ్లామర్ రోల్ మాత్రమే కాదు..

డీ గ్లామర్ రోల్ మాత్రమే కాదు..

పుష్ప సినిమాలో డీ గ్లామర్ రోల్‌తో పాటు ఓ నాటు పాత్రలో కనిపిస్తాను. గతంలో మేకప్ లేకుండా డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించాను. పుష్పలో కూడా మేకప్ లేకుండా గ్రామీణ యువతి పాత్రలో నటించాను. పుష్ప కోసం డిఫరెంట్ వరల్డ్‌ను దర్శకుడు సుకుమార్ క్రియేట్ చేశారు. పుష్ప సినిమా ఓ వ్యక్తి జర్నీ. పుష్పరాజ్ పాత్ర కోసం నేను, నా కుటుంబం ఎలా నిలబడ్డామనేది ఈ సినిమాలో కీలక అంశాలు. పుష్పలో నా పాత్ర శ్రీవల్లి చాలా కన్నింగ్. అయితే చాలా ఇంటెలిజెంట్. చాలా ఫన్నీగా ఉంటాయి అని రష్మిక మందన్న చెప్పారు.

నటిగా నాలో మెచ్యురిటీ కనిపిస్తున్నది.

నటిగా నాలో మెచ్యురిటీ కనిపిస్తున్నది.

ఒక సినిమా నుంచి మరో సినిమాకు నాలో ప్రతిభ రాటుదేలుతున్నది. నాలో మెచ్యురిటీ వస్తున్నది. అనుభవం వల్ల నేను బెటర్ పర్సన్ అవుతున్నానని అనిపిస్తున్నది. గీతా గోవిందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌ వచ్చిన ఆయనతో నటించాలనే కోరిక కలిగింది. అయితే పుష్ప సినిమాలో ఆఫర్ రావడం చాలా హ్యాపీగా ఫీలయ్యాను. షూటింగ్ ప్రారంభం అయినప్పడు తొలి రోజున చాలా నెర్వస్‌గా ఉన్నాను. దర్శకుడు సుకుమార్ వద్దకు వెళ్లి నేను ఈ సన్నివేశాన్ని నేను చేయగలనా అని అడిగా. అయితే ఆయన నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చారు. నీలో టాలెంట్, ప్రతిభతో నీవు ఓ రేంజ్‌కు వచ్చావు. నెర్వస్‌గా ఫీలవ్వకు అంటూ కాన్ఫిడెన్స్ ఇచ్చారు.

 అల్లు అర్జున్ డ్యాన్స్ చేసే అవకాశం

అల్లు అర్జున్ డ్యాన్స్ చేసే అవకాశం

పుష్ప సినిమాలో నేను అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. అయితే పుష్ప 2 మూవీలో డ్యాన్స్ అవకాశం ఉండేలా చూడమని సుకుమార్‌ను అడుగుతాను. సామి సామీ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో కనిపిస్తాను. అయితే ఆ పాటలో నేనే నటించానా అనే ఆశ్చర్యం కలిగింది. ఆ పాటలో నేను నమ్మలేకపోయాను. సామీ సామీ పాటకు క్రెడిట్ ఇవ్వాలంటే.. దేవీశ్రీ ప్రసాద్, శేఖర్ మాస్టర్, సుకుమార్, చంద్రబోస్‌కే ఇవ్వాలి అని రష్మిక మందన్న అన్నారు.

పుష్ప కథ ఏమిటో నాకు తెలియదు

పుష్ప కథ ఏమిటో నాకు తెలియదు

అయితే పుష్ప సినిమా కథ ఏమిటో నాకే కాదు.. ఎవరికి తెలియదు. చాలా మంది యాక్టర్లకు మొత్తం కథ తెలియదు. ఈ సినిమా కోసం నన్ను సంప్రదించినపుడు చిత్తూరు యాసను నేర్చుకోమని అడిగారు. ఆ తర్వాత మూడు లుక్‌ టెస్ట్‌లు చేసి నా పాత్రకు సంబంధించిన ఆహార్యాన్ని ఫైనలైజ్ చేశారు. షూటింగ్‌ కోసం వెళ్లినప్పుడు నా బాడీలాంగ్వేజ్ ఎలా ఉండాలనే విషయాన్ని చెప్పారు. ఫుష్ప పార్ట్ 1లో నా పాత్రకు అంతగా స్కోప్ ఉండదు. కానీ పుష్ప పార్ట్ 2లో నా క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. రంగస్థలం సినిమా డిఫరెంట్ జోనర్. పుష్ప మాత్రం పవర్‌పుల్‌గా ఉంటుంది. ఈ సినిమాలో క్యారెక్టర్లను అలా డిజైన్ చేశారు. పుష్ప ఒక్క సినిమాల నటించడం ద్వారా లభించిన అనుభవం నాలుగు సినిమాలకు సమానమని అల్లు అర్జున్ చెప్పారు అని రష్మిక మందన్న చెప్పారు.

Recommended Video

RGV Goes Gaga Over Pushpa | Allu Arjun Believed In Guts || Filmibeat Telugu
బన్నీతో కెమిస్ట్రీ వర్కవుట్ అయిందంటూ

బన్నీతో కెమిస్ట్రీ వర్కవుట్ అయిందంటూ


పుష్ప మూవీలో అల్జు అర్జున్‌తో నా కెమిస్ట్రీ వర్కవుట్ అయిందని నేను కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసిన తర్వాత మాకు సంతృప్తి కలిగింది. దాంతో ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే ఫీలింగ్‌తో ఉన్నాం. అల్లు అర్జున్‌తో మళ్లీ మళ్లీ నటించాలనే కోరిక కలిగింది. బన్నీ అడిగితే 100 సినిమాలు చేయడానికి కూడా సిద్ధం. బన్నీతో నటించడం చాలా కంఫర్ట్‌గా ఉంది అని రష్మిక మందన్న తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X