మహేష్‌ను బాగా డిస్ట్రబ్ చేశా.. ఆ విషయం చిరంజీవికి చెప్పాను.. రష్మిక మందన్న
'ఛలో', 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రష్మిక మందన్నా. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ రష్మిక మందన్నా ఇంటర్వ్యూ.

మహేష్‌ను బాగా డిస్ట్రబ్ చేశా
సెట్‌లో నేను గొడవ బాగా చేశాను. మీరు ట్రైలర్ చూస్తే ఈ పాటికి అర్థం అయి ఉంటుంది. హీరో వెంటపడి బాగా అల్లరి చేసే క్యారెక్టర్. ఎక్‌ట్రీమ్‌లీ డ్రమోటిక్ అండ్ కామికల్‌గా ఉంటుంది. ఈ సినిమా ద్వారా నాకు ఫుల్ లెంగ్త్ కామెడీ చేసే అవకాశం దక్కింది. సాధారణంగా సెట్‌లో సీరియస్‌గా ఉండటం నాకు నచ్చదు. అల్లరి చేయడం అంటేనే ఇష్టం. అందుకని సెట్‌లో అందరితో జోవియల్‌గా ఉండేదాన్ని. సెట్‌లో మహేశ్‌గారు చాలా క్వైట్ అండ్ కామ్‌గా ఉండేవారు. నేనే వెళ్ళి తనని డిస్ట్రబ్ చేసేదాన్ని.

విజయశాంతితో మంచి అనుబంధం
సీనియర్ నటి విజయశాంతి మంచి పరిచయం ఏర్పడింది. కేరళ షెడ్యూల్‌లో నేను మొదటిసారి ఆమెను కలిశాను. నాకు ఇంతకుముందే మేడమ్ గురించి తెలుసు. లేడీ అమితాబ్‌లాంటి ఆమెతో కలిసి మాట్లాడాలంటే కొంచెం భయం వేసింది. తర్వాత సెట్‌లో ఆమె ఎనర్జీ చూసి ఫిదా అయ్యాను. వరుసగా రెండు రోజులు ఆమెతోనే ఉన్నాను. డ్యాన్స్, నటనకి సంబంధించిన కొన్ని సలహాలు అడిగి తెలుసుకున్నాను అని రష్మిక తెలిపారు.

అనిల్ రావిపూడి కథ చెప్పేటప్పుడే
దర్శకుడు అనిల్ రావిపూడి కథను చెప్పేటప్పుడే నా క్యారెక్టర్, సంగీతగారి క్యారెక్టర్, ఎలా ఉంటుందో యాక్ట్ చేసి చూపించారు. అప్పుడే నాకు బాగా నచ్చింది. అందులోనూ ఈ సినిమాలో మంచి ఫీల్ ఉంది. అలాగే మహేశ్, విజయశాంతిగారితో కలిసి నటించడం బోనస్. నేను డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఆ సన్నివేశాలు చూసి నవ్వు ఆపుకోలేకపోయాను. షూటింగ్ చేస్తున్నప్పుడే టీమ్ అంతా బాగా నవ్వుకున్నాం. రేపు ప్రేక్షకులు కూడా ఆ కామెడీ ట్రాక్‌ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు.

చిరంజీవి నాకు లక్కీ ఛార్మ్
చిరంజీవి స్టేజ్ మీద నన్ను కాంట్రాక్ట్ తీసుకున్నావా రష్మిక అనడం చాలా హ్యాపీగా ఉంది. 'ఛల్లో', 'గీత గోవిందం' సినిమాల ఈవెంట్స్‌కి చిరంజీవిగారు గెస్ట్‌గా వచ్చారు. అప్పుడు ఎందుకో మీరు నా లక్కీ ఛార్మ్ అనిపిస్తుంది సార్ అని చెప్పాను. అందుకే ఆయన అలా అనుంటారు. ఆయన చాలా స్వీట్ హార్ట్. నా ఫంక్షన్స్ అన్నింటికీ రావాలని కోరుకుంటున్నాను.


Click it and Unblock the Notifications











