బిగ్‌బాస్-2 తేజస్వితో సినిమా ఆగిపోయింది, తర్వాత నా లైఫ్ అల్లకల్లోలమైంది!
రాజ్ గురు బ్యానర్ పై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో రాజ్ ధారపనేని నిర్మించిన చిత్రం రథం. గీతానంద్, చాందీని భగవనేనీ జంటగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా హీరో గీతానంద్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మా నాన్న కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారే కానీ... అంతగా పేరున్న వ్యక్తి కాదు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్‌కు కథలు చెబుతూ ఉండేవాడిని, కొత్తగా కథలు అల్లి చెప్పేవాడిని, స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం. డైరెక్షన్ మీద పాషన్ ఉండేది.
మా నాన్నకు తెలియకుండా షార్ట్ ఫిల్మ్ ఒకటి షూట్ చేశాను. అది చూసిన తర్వాత మా నాన్న కూడా సినిమాల్లో ఇంట్రస్ట్ ఉంటే వెళ్లమని చెప్పారు. తర్వాత నాకు దర్శకత్వం కంటే యాక్టింగ్ అనేది చాలెంజింగ్ అనిపించింది. అలా 2013లో నా జర్నీ మొదలైందని తెలిపారు.

ఆ తర్వాత నా లైఫ్ అల్లకల్లోలమైంది
చంద్రశేఖర్ కానూరితో పంతం అనే సినిమా మొదలై ఆగిపోయింది. అందులో బిగ్ బాస్-2 కంటెస్టెంట్ తేజస్వి హీరోయిన్. అంతా ఓకే అయిపోయింది. నాగినీడు, ఆమని ఇలా మంచి నటీనటులతో మొదలై 10 రోజుల షూటింగ్ తర్వత ఆగిపోయింది. ఆ తర్వాత హోప్ లెస్ అయిపోయాను. రాంగ్ ట్రాక్ లోకి వెళ్లిపోయాను. లైఫ్ అంతా అల్లకల్లోలం అయిపోయింది.

మళ్లీ ఆయనతోనే మొదలైంది
దాదాపు రెండు సంవత్సరాల బ్రేక్ తర్వాత అర్థమైంది. మనకు బ్యాగ్రౌండ్ లేదు. ఎవరూ వచ్చి ఏదీ పెట్టరు. కానీ మనకు పాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. దాన్ని సీరియస్‌గా తీసుకుని చంద్రశేఖర్ కానూరి దగ్గరి వచ్చాను. ఆయన ‘రథం' అనే మంచి టైటిల్ తీసుకుని మొదలు పెట్టారు. ఈ గ్యాపులో ఆయన కూడా ఓ మూవీ చేశారు కానీ అది ఆగిపోయింది.

రాజ్ రాకతో ఒక వెలుగు వచ్చినట్లయింది
చంద్రశేఖర్ కూడా మళ్లీ నాతో సినిమా చేయాలి, ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే మొదలు పెట్టాలని ముందుకు వచ్చారు. ఒక డెమో షూట్ తర్వాత మా ప్రొడ్యూసర్ రాజ్ ధారపనేని వచ్చారు. చీకట్లో ఉన్నవాళ్లకు వెలుగులా.... ఆయన రావడంతో మొత్తం మారిపోయింది. సనిమా ఎక్కడా ఆగకుండా కంటిన్యూస్ గా వెళుతూనే ఉంది.

హీరో అవ్వాలని రాలేదు
నేను ఇండస్ట్రీకి హీరో అవ్వుదామని రాలేదు మంచి యాక్టర్ అవ్వాలని వచ్చాను. ఈ కథకి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ప్రొడ్యూసర్‌కి కూడా ఇది మొదటి చిత్రం. ఆయన ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశాను. ఇది రొటీన్ కధ మాత్రం కాద అని గీతానంద్ తెలిపారు.


Click it and Unblock the Notifications











