మాది భార్యభర్తల బంధం.. అందుకే రంగస్థలం బ్లాక్‌బస్టర్.. అప్పుడే వండర్ అనిపించింది.. రత్నవేలు

By Rajababu

వెండితెర మీద అద్భుతాలను సృష్టించడంలో సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు అందే వేసిన చేయి. సేతు, రోబో, వన్ నేనెక్కడినే, కుమారి21ఎఫ్ చిత్రాలు ఆయన పనితీరుకు అద్దం పట్టాయి. తాజాగా ఆయన సినిమాటోగ్రఫీ అందించిన రంగస్థలం చిత్రం ఓ దృశ్యకావ్యంగా మారింది. అన్ని రంగాల సినీ ప్రముఖులు రంగస్థలంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. రంగస్థలం చిత్రం కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్న తరుణంలో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా సంభాషించారు. రత్నవేలు వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

Recommended Video

Rangasthalam Crossed Rs 150 Crore Mark
సుకుమార్ కథ చెప్పినప్పుడు

సుకుమార్ కథ చెప్పినప్పుడు

ఒక సినిమాకు సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ మధ్య మంచి రిలేషన్ చాలా ముఖ్యమైనది. ఓ సినిమాకు పనిచేయాలంటే కథపైన ఇద్దరి మధ్య చర్చ జరగాలి. సినిమాటోగ్రాఫర్ అంటే కేవలం కెమెరాను ఆపరేట్ చేయడం కాదు. సుకుమార్ కథ చెప్పిన తర్వాత చాలాసార్లు కలిశాం. కాఫీ షాపులో, మరికొన్ని చోట్ల చాలా రకాలుగా చర్చించాం. దాంతో చాలా ఫ్రెష్ సీన్లు వచ్చాయి.

 14 ఏళ్లుగా సుకుమార్‌తో జర్నీ

14 ఏళ్లుగా సుకుమార్‌తో జర్నీ

ఆర్య చిత్రంతో సుకుమార్‌తో జర్నీ ప్రారంభమైంది. దాదాపు 14 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నాం. రంగస్థలం కథ చెప్పినప్పుడు ప్రేక్షకులను దాదాపు 30 ఏళ్ల వెనుకకు తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈ కథ 80లో జరిగే కథ. సీన్లు, లుక్ చాలా నాటుగా ఉండాలి. గ్రామీణ కథ కావడంతో అప్పటి వాతావరణం ప్రతిబింబించాలి. నటీనటుల దుస్తులు, అలకంరణ చాలా నేచురల్‌గా ఉండాలి. అందుకే సినిమాకు ముందే చాలా వర్క్ చేశాం.

 సమిష్టి కృషితో సాధ్యమైంది

సమిష్టి కృషితో సాధ్యమైంది

సినిమాకు కేవలం సినిమాటోగ్రఫి ఒక్కటే ముఖ్యం కాదనే ముందు నుంచి గ్రహించాం. అన్ని విభాగాలను ఒకే విభాగంలోకి తీసుకురావాలని అనుకొన్నాం. దీపాలి, శాంతి, సుస్మిత క్యాస్టూమ్ డిజైనర్లుగా పనిచేశారు. సినిమాకు ముందే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది నిర్ణయం చేసుకొన్నాయి. రామకృష్ణ, మోనికా ఆర్ట్ వర్క్ చాలా ఉపయోగపడింది.

పేరు రావడం ఆనందంగా ఉంది..

పేరు రావడం ఆనందంగా ఉంది..

సాధారణంగా ఒక సినిమా హిట్టయితే దర్శకుడు, లేదా హీరోకు పేరు వస్తుంది. ఈ సినిమాకు నాలాంటి సినిమాటోగ్రాఫర్‌కు పేరు రావడం మరింత ఆనందం కలిగింది. ఒక సినిమాకు అంకితమై పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో రంగస్థలం చిత్రం నిరూపించింది. నా మొదటి సినిమా సేతు నుంచి నా తీరు అలానే ఉంటుంది.

సినిమా అంటే నాకు గౌరవం

సినిమా అంటే నాకు గౌరవం

సినిమా అంటే నాకు చాలా గౌరవం. ఒక సినిమాను ఒప్పుకొంటే అది పూర్తయ్యేంత వరకు మరో సినిమాను ఒప్పుకొను. సుకుమార్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సినిమాటోగ్రాఫర్, దర్శకులది భార్యభర్తల అనుబంధం. వర్క్ పరంగా మా మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అందుకే రంగస్థలం ఓ వండర్‌గా మారింది.

 సమంత అప్పుడు అలా అనేసింది

సమంత అప్పుడు అలా అనేసింది

రంగస్థలం పక్కా గ్రామీణ వాతావరణం ఉన్న చిత్రం. ఎక్కడ లైటింగ్ ఎక్కువ వాడాలి?.. ఎక్కువ తక్కువ లైటింగ్ వాడాలి? ఎలాంటి కలర్ ప్యాటర్న్ యూజ్ చేసుకోవాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకొన్నాం. మొదటి రోజే సమంతకు మేకప్ వేసుకోవద్దని చెప్పాను. హెయిర్ కలర్ నల్లగా ఉండొద్దు అని చెప్పాను. నేను ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు సమంత అనుమానంగా చూసింది. రెండు రోజుల షూటింగ్ తర్వాత సార్ నేను చాలా అందంగా ఉన్నాను. తెర మీద గొప్పగా కనిపిస్తున్నాను అని చెప్పింది.

దర్శకుడు ఎవరైనా సరే

దర్శకుడు ఎవరైనా సరే

సుకుమార్‌తో ఆర్య, జగడం, కుమారి21ఎఫ్, 1 నేనొక్కడినే, రంగస్థలం సినిమాలు చేశాను. 100% లవ్, నాన్నకు ప్రేమతో సినిమాలు మిస్ అయ్యాను. బాలా, శంకర్, వినాయక్, సుకుమార్‌తో పనిచేశాను. ఒక్కొక్కరి మేకింగ్ చాలా డిఫరెంట్. దర్శకులు ఎవరైనా వారికి తగినట్టు ఒదిగిపోవాలి. సినిమాటోగ్రాఫర్ నీళ్లలా ఉండాలి. దేనిలోనైనా కలిసిపోవాలి.

దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యాజిక్

దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యాజిక్

దేవీ శ్రీ ప్రసాద్‌తో పనిచేయడం చాలా ఇష్టం. సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్‌తో పనిచేస్తే ఓ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉంటుంది. రంగస్థలం సినిమాలో పాటలు మాత్రమే కాకుండా రీరికార్డింగ్ చాలా అద్బుతంగా ఉంటుంది. సన్నివేశాలను చాలా లైవ్లీగా అనిపించింది.

ముద్దు సీన్ గురించి తెలియదు..

ముద్దు సీన్ గురించి తెలియదు..

రాంచరణ్, సమంతల ముద్దు సీన్ సింగిల్ షాట్‌లో తీశాం. వారికి ముద్దు సీన్ తెలియదు. కెమెరా మూమెంట్ మాత్రమే ఫీలింగ్‌ను క్యాప్చర్ చేసింది. అది చాలా కష్టమైన షాట్ అని నేను భావిస్తున్నాను. నరేష్, రోహిణి, జగపతిబాబు, ఆది పినిశెట్టి యాక్టింగ్ సినిమాను మరోస్థాయికి చేర్చింది.

అప్పుడే వండర్ అని అనుకొన్నా

అప్పుడే వండర్ అని అనుకొన్నా

రంగస్థలం మంచి సినిమా అవుతుందని ముందునుంచే నమ్మకం ఉండేది. కానీ బ్లాక్‌బస్టర్ అవుతుందని అనుకోలేదు. వారం రోజుల ముందు ఎడిటింగ్ రూమ్‌లో సినిమా చూసినప్పుడు ఈ సినిమా వండర్ క్రియేట్ చేస్తుందని అనుకొన్నాను. అప్పుడే సుకుమార్‌కు చెప్పాను. వెంటనే సుకుమార్ నిజమా అని ఆశ్చర్యపోయారు. రోబో చూసినప్పుడు కూడా సినిమా సూపర్ హిట్ అని శంకర్‌కు చెప్పాను. నేను చెప్పిన మాటను రజనీకాంత్‌కు శంకర్ చెప్పడంతో ఆయన కాల్ చేసి నిజమా అని ఆశ్చర్యపోయారు.

అంకితభావం

అంకితభావం

రంగస్థలం సినిమాకు ఇంత పేరు రావడానికి కారణం డిడికేషన్ ఉన్న నిర్మాతలు. సినిమా లేటవుతున్నదనే ఫీలింగ్ ఎన్నడూ వారి ముఖంలో కనిపించలేదు. సినిమా బాగా రావాలన్న ఫీలింగ్ మాత్రమే వారిలో కనిపించేది. నవీన్, రవి, మోహన్‌కు సినిమా పట్ల ఉన్న అంకితభావం మాటల్లో చెప్పలేం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X