Ravanasura చూసి థ్రిల్లింగ్, షాక్ గురవుతారు.. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ పాత్రలో రవితేజ.. నిర్మాత అభిషేక్ నామా
డిస్టిబ్యూటర్‌గా, ఎగ్జిబ్యూటర్‌గానే కాకుండా నిర్మాతగా రాణిస్తున్న అభిషేక్ నామా ప్రస్తుతం రావణాసుర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రవితేజ, సుశాంత్, మేఘా ఆకాష్, దక్ష నాగార్కర్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా తదితరులు నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్మాత అభిషేక్ నామా సినిమా విశేషాలు వెల్లడించారు. ఈ సినిమా గురించి, రవితేజ గురించి మాట్లాడుతూ..
రవితేజ ఇప్పటి వరకు అటెంప్ట్ చేయని రోల్: నేను ఏడాది కాలంగా రవితేజ సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నా. ఓ రోజు శ్రీకాంత్ విస్సా చెప్పిన కథను ఫైనలైజ్ చేసిన తర్వాత రవితేజ నాతో మాట్లాడి సినిమా చేయమన్నారు. కథ మీద నమ్మకంతోనే ఈ సినిమా చేశాం. రవితేజ కూడా ఈ సినిమాకు ఓ నిర్మాత. ఆ తర్వాత నేను సుధీర్ వర్మకు, సుశాంత్, నటీనటులకు ఫోన్ చేసి ప్రాజెక్టు గురించి చెప్పాను. రవితేజ తన కెరీర్‌లో ఎన్నడూ అటెంప్ట్ చేయలేదు. ఫన్, ఎనర్జిటిక్‌గా కనిపించారు. కానీ ఇలాంటి రోల్ ఇంతవరకు చేయలేదు. ప్రేక్షకులు షాక్ గురి అవుతారు అని అభిషేక్ నామా తెలిపారు.

రవితేజ ఫెర్ఫార్మెన్స్ చూసి షాక్ తినాల్సిందే :
రావణాసుర సినిమా థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్నా సినిమా. ఈ సినిమాలో వావ్ అనే మూమెంట్స్ ఉంటాయి. అందుకే ఈ సినిమా కథను, పాత్రలను రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతున్నాం. ధమాకా రిలీజ్‌కు ముందే ఈ సినిమా మొదలుపెట్టాం. కొత్త కాన్సెప్ట్ అనుకొని సినిమా ప్రారంభించాం. అనుకొన్న బడ్జెట్‌లోనే మూవీ కంప్లీట్ చేశాం. రావణాసుర కథ చాలా కొత్తగా ఉంటారు. రవితేజను చూసిన వాళ్లు ఇలా కూడా చేస్తారా అని థ్రిల్ అవుతారు. ఈ కథను చేస్తే ఏ హీరో అటెంప్ట్ చేయలేదు. అందుకే ఈ కథపై మాకు పూర్తి నమ్మకం ఉంది అని అభిషేక్ నామా అన్నారు.
టైటిల్‌లోనే నెగిటివ్ షేడ్ : రావణాసుర టైటిల్‌లోనే ఓ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రతీ మనిషిలో మంచి, చెడు ఉంటాయి. మంచితనం ఎందుకు? చెడు ఎందుకు అనేది పరిస్థితులు నిర్ణయిస్తాయి. సుశాంత్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఆయన కెరీర్‌లో 2.0 మాదిరిగా ఉంటుంది. అమాయకంగా ఉండే యువకుడి పాత్రలో సుశాంత్ పాత్ర ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని అనుకొంటున్నాం అని అభిషేక్ నామా చెప్పారు.

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని : రావణాసుర సినిమాను ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని అనుకొన్నాం. కానీ ఒకేసారి రిలీజ్ చేయడానికి వీలు కాలేదు. తెలుగులో రిలీజ్ తర్వాత ఇతర భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ప్రతీ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకొని సినిమా చేస్తాం. కంటెంట్ మీదే నమ్మకంతోనే సినిమాలు చేస్తాం. అందుకే వేగంగా చేయకుండా కాస్త నిదానంగా సినిమాలు చేసుకొంటూ వెళ్తున్నాం అని అభిషేక్ నామా పేర్కొన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ గురించి : మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్ నాకు ముందు నుంచి నాకు తెలుసు. హర్షవర్ధన్ రామేశ్వర్ తండ్రి ఏఆర్ రెహ్మాన్ వద్ద మ్యూజిక్ గ్రూప్‌లో పనిచేశారు. ఓసారి అవకాశం ఇవ్వమని అడిగితే.. నేను సాక్ష్యం సినిమాలో ట్రై చేశాను. మంచి మ్యూజిక్ ఇవ్వడమే కాకుండా టాలెంటెడ్. ఈ సినిమాకు కూడా మంచి మ్యూజిక్, రెండు పాటలు ఇచ్చారు అని అభిషేక్ నామా చెప్పారు.
కంటెంట్‌పై నమ్మకంతోనే ఓన్ రిలీజ్ : రావణాసుర సినిమాపై మాకు పూర్తిగా నమ్మకం ఉంది. అందుకే మేము స్వయంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఓన్ రిలీజ్ చేయడం రిస్కే కానీ. మాకు సినిమాపై నమ్మకం లేకపోతే థియేట్రికల్ అమ్మే ఆలోచన చేసేవాళ్లం. ఈ సినిమాపై కేవలం నమ్మకంతోనే సొంతంగా రిలీజ్ చేయాలని అనుకొన్నాం. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ చేయడం మాకు బాగా తెలుసు అని అభిషేక్ నామా తెలిపారు.
డెవిల్ రిలీజ్ గురించి : కల్యాణ్ రామ్ హీరోగా డెవిల్ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. మరో రెండు నెలల్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాం. డెవిల్ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నాం. అలాగే మా పిల్లలతో ప్రేమ, అభిమానం సినిమా పూర్తి చేశాం. వచ్చే నెలలో థియేట్రికల్, ఓటీటీలో రిలీజ్ చేస్తాం. రావణాసుర సినిమా హిట్ అయితే.. సీక్వెల్ కూడా చేయడానికి రెడీ అయ్యాం అని అభిషేక్ నామా అన్నారు.


Click it and Unblock the Notifications











