ఆవిరి కథకు కలెక్టర్ ఆమ్రపాలికి లింక్.. సాహో సినిమాను కూడా వదులుకున్న.. రవిబాబు షాకింగ్ కామెంట్స్

విభిన్న కథాచిత్రాలను తెరకెక్కిస్తూ రవిబాబు తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. చివరగా అదుగో అంటూ ఓ ప్రయోగాన్ని చేశాడు. అయితే అది అంతగా వర్కౌట్ కాలేదు. దీంతో మరోసారి తనకు కలిసి వచ్చిన థ్రిల్లర్, హారర్ జానర్‌పై దృష్టి పెట్టాడు. ఆవిరి అంటూ మరోసారి తన స్టైల్ మేకింగ్‌ను పరిచయం చేసేందుకు సిద్దమయ్యాడు.

ఆకట్టుకున్న ఆవిరి ట్రైలర్

ఆకట్టుకున్న ఆవిరి ట్రైలర్

ఓ ఇంట్లో దెయ్యం ఉండటం, చిన్న పాపతో స్నేహం చేయడం.. తల్లిదండ్రులు ఖంగారు పడటం.. పాప కనిపించకుండా పోవడం.. ఇలా ప్రతీ సీన్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా చేయడంలో ఆవిరి ట్రైలర్ సక్సెస్ అయింది. ఈ శుక్రవారం (నవంబర్ 1) ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ రవిబాబు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఆమ్రపాలిపై వచ్చిన వార్తలు

ఆమ్రపాలిపై వచ్చిన వార్తలు

తన కలెక్టరేట్ భవనంలో దెయ్యం ఉందని అటు వైపు వెళ్లడానికి తనకు భయమేస్తుందనే వార్తలు అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వార్తలను చూసిన రవిబాబుకు ఆవిరి సినిమా చేయాలనే ఆలోచన వచ్చినట్లు తెలిపాడు. అక్కడి నుంచి ఈ కథను డెవలప్ చేసుకుంటూ వెళ్లినట్లు పేర్కొన్నాడు.

సాహో సినిమాను కూడా వదులుకున్నా..

సాహో సినిమాను కూడా వదులుకున్నా..

అదుగో సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డాను. ఆ సమయంలో ఎన్నో సినిమాల్లో నటించేందుకు అవకాశాలు వచ్చాయి. కానీ అదుగో మూవీతో బిజీగా ఉండటంతో నటించలేకపోయాను.. అందుకే సాహో లాంటి పెద్ద సినిమాలను కూడా వదులుకున్నానని తెలిపాడు. అయితే మళ్లీ నటనలో కూడా బిజీ అవబోతోన్నట్లు పేర్కొన్నాడు.

శ్రీదేవీ, కమల్ హాసన్‌లా..

శ్రీదేవీ, కమల్ హాసన్‌లా..

ఈ చిత్రంలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీ ముక్తా గురించి చెబుతూ.. తానొక అద్భుతమైన నటి అని తెలిపాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా శ్రీదేవీ, కమల్ హాసన్‌లా మున్ని పాత్రలో అలవోకగా నటించేసిందని అన్నాడు. తనకు ప్రతీ సన్నివేశాన్ని అర్థమయ్యేట్లుగా ఎంతో వివరంగా చెప్పేవాడని రవిబాబు గురించి చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీ ముక్తా చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X