twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూట్ మార్చి కొట్టేస్తున్నాడు.. అప్పుడే 100 సినిమాలా?.. రవితేజ

    |

    బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేని టచ్ చేసి చూడు, నేల టికెట్ చిత్రాల తర్వాత రవితేజ నటించిన చిత్రం అమర్ అక్బర్ ఆంథోని. ఈ మధ్యకాలంలో అసలే హిట్లు లేని దర్శకుడు శ్రీనువైట్ల ఈ చిత్రానికి దర్శకుడు. కాకపోతే వరుస విజయాలతో దూసుకెళ్తున్న సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నవంబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో రవితేజ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా గురించి ఏం చెప్పారంటే..

    మహేష్ బాబుని అడగలేదు, అడగను కూడా.. శ్రీనువైట్ల!మహేష్ బాబుని అడగలేదు, అడగను కూడా.. శ్రీనువైట్ల!

     పుష్కలంగా మాస్ ఎలిమెంట్స్‌తో

    పుష్కలంగా మాస్ ఎలిమెంట్స్‌తో

    అమర్ అక్బర్ ఆంథోని సినిమా మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న చిత్రం. కామెడీ బాగా ఉంటుంది. సెంటిమెంట్ సీన్లు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. నాకు అమర్ క్యారెక్టర్ చాలా ఇష్టం. మిగితా రెండు క్యారెక్టర్లలో ఎనర్జీ బ్రహ్మండంగా ఉంటుంది. మూస ధోరణిలో కాకుండా వినోదాత్మకంగా కథ సాగుతుంది అని రవితేజ అన్నారు.

    లోపాలు లేకుండా సరిదిద్ది

    లోపాలు లేకుండా సరిదిద్ది

    శ్రీనువైట్ల మార్క్ కామెడీతో పాటు కథలో భావోద్వేగం ఉంటుంది. కథ చెప్పగానే కొన్ని రోజులు ఎలాంటి లోపాలు లేకుండా తీర్చిదిద్దాం. నాకు ఉన్న కొన్ని సందేహాలను శ్రీనువైట్లకు చెప్పడంతో వాటిని సరిదిద్దారు. ప్రతీ పాత్రలో సరైన డోస్‌ను నింపి శ్రీనువైట్ల ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.

    మెచ్యురిటీతో తమన్

    మెచ్యురిటీతో తమన్

    భాగమతి, అరవింత సమేత సినిమాలు చూస్తే థమన్ మ్యూజిక్‌లో చాలా మెచ్యురిటీ కనిపించింది. మంచి టేస్ట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అప్పడే ఆయన వంద సినిమాలు చేశాడా అని ఆశ్చర్యపోయాను. ఇటీవల కాలంలో సంగీతాన్ని అందించే విషయంలో తన రూటు మార్చాడు. అందుకే అతడి ప్రతిభ బయటకు కనిపిస్తున్నది అని రవితేజ్ వెల్లడించారు.

    ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇలియానా

    ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇలియానా

    ఆరేళ్ల తర్వాత ఇలియానా మళ్లీ ఈ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో ఆమెది కీలకమైన రోల్. ఇలియానా గ్లామర్, యాక్టింగ్ తప్పకుండా సినిమాకు ప్లస్ అవుతుంది. మా మధ్య షూట్ చేసిన పాటలు చాలా రొమాంటిక్‌గా ఉంటాయి.

     సత్య కామెడీ ఇరుగదీశాడు

    సత్య కామెడీ ఇరుగదీశాడు

    అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో సునీల్, వెన్నెల కిషోర్, సత్య పాత్రలు బ్రహ్మండమైన కామెడీ పండింది. నాకు సత్య కామెడీ బాగా నచ్చింది. ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడు. సత్యకు మంచి పేరు వస్తుంది అని రవితేజ పేర్కొన్నాడు.

    English summary
    Amar Akbar Anthony is an action comedy-drama film co-written by Srinu Vaitla and Vamsi Rajesh Kondaveeti. Ileana D'Cruz is making comeback to the Telugu cinema after 6 years and she will be seen playing the female lead in the movie. Ravi, Ileana and Srinu's combination and the success graph of Mythri Movie Makers have generated a lot of hype and expectations about the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X