Ravanasura సినిమా కాన్సెప్ట్‌ను ఇప్పటి వరకు చూడలేదు.. ఇక ముందు చూడరు.. సుశాంత్ (ఇంటర్వ్యూ)
మాస్ మహారాజా రవితేజ విభిన్న పాత్రలో నటించిన చిత్రం రావణాసుర. దర్శకుడు సుధీర్ వర్మ రూపొందించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మించారు. యు హీరో సుశాంత్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లు భారీ అంచనాలను పెంచాయి. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంయుక్తంగా సంగీతం అందించారు. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ కాబోతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విశేషాలను సుశాంత్ వెల్లడిస్తూ..

రావణాసురలో రామ్ పాత్ర
రావణసుర చిత్రంలో నా పాత్ర పేరు రామ్. రావణసుర టైటిల్ రోల్‌ను రవితేజ పోషిస్తున్నారు. ఈ సినిమాలో అందరి పాత్రలు నెగిటివ్ షేడ్స్‌తో ఉంటాయి. హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అనే ట్యాగ్ లైన్ ఆసక్తికరంగా పెట్టారు. దాంతో ఈ సినిమాలో రాముడు ఎవరో రావణసురుడు ఎవరో అనేది ప్రేక్షకుడే నిర్ణయించాల్సిందే. ఈ సినిమాలో ఎక్సైటింగ్, థ్రిల్లింగ్, ప్రేక్షకుడిని ఆద్యంత కొత్త అనుభూతికి గురిచేసే అంశాలు చాలా ఉంటాయి అని సుశాంత్ చెప్పారు.

రవితేజను అలా చూడలేదు
నా కెరీర్‌లో ఇచట వాహనములు నిలుపరాదు సినిమా తర్వాత నేను చేస్తున్న థ్రిల్లర్ మూవీ రావణాసుర. నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలన్న లక్ష్యంతోనే ఈ సినిమాలోని రామ్ పాత్ర చేశాను. నిర్మాత అభిషేక్ ఫోన్ చేసి కథ చెప్పినప్పుడు థ్రిల్లింగ్‌గా అనిపించింది. రావణాసుర సినిమాలో చేసిన పాత్రలో రవితేజను ఇప్పటి వరకు చూడలేదు. నా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే నా పాత్ర గురించి చెప్పినప్పుడు కొంత ఇంప్రూవ్‌మెంట్ చేయాలని చెప్పాను. దర్శకుడు సుధీర్ వర్మకు నచ్చడంతో నా పాత్రకు సంబంధించి కొన్ని మార్పులు చేసి నాకు చెప్పారు. కథకు ఆ మార్పు చాలా బలాన్ని ఇచ్చింది. నా పాత్ర నేను అనుకొన్న దాని కంటే ఎక్కువగా వచ్చింది అని సుశాంత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

రావణసుర మూవీ డిఫరెంట్
రవితేజతో నా కాంబినేషన్ సీన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నా పాత్రను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారోనని ఎదురు చూస్తున్నాను. కథ, కథనాల విషయానికి వస్తే.. చాలా డిఫరెంట్ మూవీ. ఇలాంటి కాన్సెప్ట్‌ను తెలుగు సినిమాలో ఇప్పటి వరకు చూడలేదు. వినలేదు. ఇప్పటి వరకు చూడని రవితేజను ఈ సినిమాలో చూస్తారు. దర్శకుడు సుధీర్ వర్మ ఆయనను చాలా కొత్తగా చూపించారు. ఈ సినిమాలో సీన్లు చాలా ఎక్సైటింగ్‌కు గురిచేస్తాయి. ప్రేక్షకులు కొత్తదనాన్ని రుచి చూస్తారు అని సుశాంత్ చెప్పారు.

అలవైకుంఠపురంలో మూవీతో
అల వైకుంఠపురములో సినిమా నా కెరీర్‌ను మలుపు తిప్పింది. త్రివిక్రమ్ లాంటి దర్శకులతో పనిచేసే అవకాశం దక్కింది. ఆ సినిమాలో నేను చేసిన పాత్ర నాకు మంచి పేరు తీసుకొచ్చింది. సెలబ్రిటీ క్రికెట్ ఆడటానికి నార్త్ స్టేట్స్‌కు వెళ్లినప్పుడు నన్ను చూసి గుర్తుపట్టి మాట్లాడారంటే.. అల వైకుంఠపురంలో సినిమానే అందుకు కారణం. ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చిన నేను చేయలేదు. కేవలం రవితేజ కారణంగా రావణాసుర, చిరంజీవి కారణంగా భోళాశంకర్ సినిమాలు చేస్తున్నాను అని సుశాంత్ తెలిపారు.

అప్పుడే 15 ఏళ్ల పూర్తవుతున్నాయా?
నేను ఇండస్ట్రీకి వచ్చి 15 పూర్తవుతుందనే విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. అక్కినేని కుటుంబం నుంచి రావడం నా అదృష్టం. నా ముందుకు వచ్చిన ఆఫర్లతోనే సినిమాలు చేశాను. కొన్ని సినిమాలు చేయాలనుకొన్నవి ఆలస్యం కావడం, కొన్ని చిత్రాలు సమయానికి రాకపోవడం నా ప్రమేయం లేకుండా జరిగిపోయాయి. దాంతో నాకు ఒక రకమైన గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అనుకోకుండా వచ్చిందే. చిలసౌ తర్వాత గ్యాప్ తీసుకోకుడదని అనుకొన్నాను. కానీ కోవిడ్ కారణంగా రెండేళ్లు గ్యాప్ వచ్చింది. గత ఆరు నెలలుగా బిజీగా ఉన్నాను. సోలో హీరోగా సినిమాను ఒకే చేశాను. భోళా శంకర్ తర్వాత ఆ సినిమా చేస్తాను అని సుశాంత్ అన్నారు.


Click it and Unblock the Notifications











