Breakup: విజయ్ వర్మకు అందుకే బ్రేకప్ చెప్పా! నన్ను పెళ్లి చేసుకొనే అదృష్టవంతుడు ఎవరంటే? తమన్నా
సినిమా పరిశ్రమలో కొన్ని బ్రేకప్స్, లవ్ ఫెయిల్యూర్స్ సర్‌ప్రైజ్ కలిగిస్తాయి. అప్పటి వరకు నిన్ను వీడి నేను ఉండలేను. ఈ జన్మకు నీవే నా జీవిత భాగస్వామి. నీవు నాకు దొరకడం ఏ జన్మలో చేసుకొన్న అదృష్టమో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొంటూ.. ఇంటర్వ్యూలో తమ ప్రియుడి, ప్రియురాలి గురించి ఒకరికొకరు గొప్ప విషయాలు చెప్పుకొంటూ, పొగడ్తలు గుప్పించుకొంటూ కనిపించిన వారు.. తెల్లవారే సరికి విడిపోతున్నామంటూ షాక్ ఇవ్వడం చాలా సందర్భాల్లో చూశాం. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే..
తమన్నా, విజయ్ వర్మ ప్రేమ కథలో ఇలాంటి సన్నివేశాలే సోషల్ మీడియాలో కనిపించాయి. వారిద్దరూ చెట్టాపట్టాలేసుకొని.. మమ్మల్ని ఎవరూ కూడా విడదీయలేరనే అంత బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే.. షాకింగ్‌గా విడిపోయారు. అయితే వారిద్దరి విడిపోవడం వెనుక అసలు కారణం ఏమిటి? వారిద్దరిని ఎవరు విడదీశారు? అన ప్రశ్నలు అభిమానులు, సినిమా ప్రేక్షకులను వెంటాడుతున్నాయి. అయితే వాటి గురించి తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా భాటియా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. బ్రేకప్ వెనుక మిల్కీ బ్యూటీ చెప్పిన కారణాలు ఏమిటంటే?

తెలుగులోనే కాకుండా హిందీ భాషలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న తమన్నా భాటియా, టాలెంటెడ్ యాక్టర్ విజయ్ వర్మ ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని 2023 సంవత్సరంలో వెల్లడించారు. అప్పటి నుంచి వారిద్దరూ సహజీవనం చేస్తూ.. డేటింగ్ వ్యవహారాలతో మీడియాలో అందర్నీ ఆకర్షించారు. మీడియా మొత్తం వీరి ప్రేమ కథను హైలెట్ చేస్తూ కథనాలు వెల్లడించాయి. అయితే వారిద్దరూ ఒక్కటవ్వడం ఖాయం. వీరి జంట సక్సెస్‌ఫుల్ కావడం గ్యారెంటీ అనే నమ్మకాన్ని కలిగించారు. అయితే వారిద్దరూ అందరికి షాకిస్తూ వీడిపోవడం సినీ పరిశ్రమనే కాకుండా అభిమానులను అందోళనకు గురిచేసింది.
అయితే తానో ఎంతో కమిటెడ్‌గా కొనసాగించిన లవ్ అఫైర్ బ్రేకప్ కావడాన్ని ఎట్టకేలకు జీర్ణించుకొన్న తమన్నా భాటియా.. ఇటీవల అందుకు కారణాలను వెల్లడించారు. నా జీవితంలో ఎన్నడూ అబద్దాలు ఆడలేదు. ఏదై తప్పు జరిగితే నిజాయితీగా అందుకు పరిష్కారం ఆలోచించేదానిని. నా వద్ద ఎవరైనా అబద్దం ఆడితే సహించలేను. నా ముఖం ముందే నేను జీర్ణించుకోలేని విధంగా అబద్దం చెప్పాడు. నన్ను ఒక ఫూల్ చేశాడు. ఆ విషయం నాకు తీవ్రమైన కోపం తెప్పించింది. అతడు ఆడింది ఓ అబద్దం కాదు.. నాకు తీరని మోసం చేశాడు. ఆ విషయం నన్ను బాగా హర్ట్ చేసింది. నా బ్రేకప్‌లో జరిగిన అసలు విషయం అది అని తమన్నా అందరి సందేహాలకు క్లారిటీ ఇచ్చింది.
అయితే నేను మంచి జీవిత భాగస్వామిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. నా కాబోయే భర్త నన్ను పొందినందుకు అదృష్టంగా భావించాలి. అలాంటి అదృష్టవంతుడు ఎవరో త్వరలోనే మీరు చూస్తారు అని తమన్నా భాటియా తన అభిప్రాయాలను పంచుకొన్నది. మిల్కీ బ్యూటీ కెరీర్ విషయానికి వస్తే.. 2025 సంవత్సరంలో ఓదెల 2, రైడ్ 2, బాహుబలి ది ఎపిక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే ఓ రోమియో, రేంజర్, రోహిత్ శెట్టి నిర్మించే సినిమాలో, రాగిణి ఎమ్మెమ్మెస్ మూవీలో నటించనున్నది.


Click it and Unblock the Notifications











