twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam మూవీ ఎందుకు చూడాలంటే.. ముద్దు ముద్దుగా మృణాల్ థాకూర్ ముచ్చట్లు

    |

    షారుక్ ఖాన్ నటించిన వీర్ జారా సినిమా చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాను. అలాంటి రేర్ స్టోరిస్ తక్కువగా వస్తుంటాయి. అలాంటి రేర్ కథతో వచ్చిన సినిమా సీతారామం. బంధాలు, అనుబంధాలు గురించే చెప్పే సినిమా సీతా రామం అని అన్నారు. సీతారామం ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఫిల్మీబీట్‌తో మృణాల్ థాకూర్ మాట్లాడుతూ..

    మానవులుగా జీవిస్తున్నామంటే.. కేవలం బంధాలు, అనుబంధాల వల్లనే. మనకు దూరమైన తర్వాత మనం మనచుట్టు ఉన్న వ్యక్తుల ప్రాధాన్యత గ్రహిస్తాం. ఈ సినిమా అలాంటి ఎమోషన్స్ చెప్పే సినిమా. ఈ సినిమాలో దుల్కర్, రష్మిక, గౌతమ్ మీనన్, సుమంత్ లాంటి పాత్రలు మెస్మరైజ్ చేస్తాయి. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, కామెడీ, లవ్, మిస్టరీ, వార్ లాంటి అంశాలు సినిమా ఓవరాల్‌గా ఒక ప్యాకేజ్. ఈ సినిమాను ప్రతీ ఆడియెన్ తన ఫ్యామిలీతో చూడదగిన సినిమా ఇది.

     Reasons to watch Sita Ramam movie: here is the Mrunal Thakur clarification

    సీతా రామం సినిమాలో రష్మిక మందన్న పాత్ర చాలా కీలకమైనది. పుష్ప తర్వాత ఆమె క్రేజ్ దేశవ్యాప్తంగా మోర్మోగుతున్నది. ప్రస్తుతం చాలా ఆఫర్లు ఉండటంతో ఫ్లయిట్‌లోనే జీవితాన్ని గడుపుతున్నది. ఒక రోజు ముంబైలో ఉంటే.. మరో రోజు హైదరాబాద్‌లో ఉంటూ చాలా బీజీగా ఉంటున్నది. అలాంటి రష్మికతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఆమె ఒక ఎనర్జీ బాల్. ఎప్పుడైనా అసౌకర్యంగా ఉంటే.. ఆమె అందరి మూడ్‌ను ఫ్రెష్ చేస్తుంది. బాలీవుడ్‌లో ఆమె ఎంట్రీ ఇస్తున్నది. నేను తెలుగులో ఎంట్రీ ఇస్తున్నా. ఒకరికొకరం వెల్‌కమ్ చెప్పుకొంటున్నాం అని మృణాల్ థాకూర్ చెప్పారు.

    సీత పాత్ర పోషించిన తర్వాత నాకు ఇక ముందు సినిమాలను ఎన్నుకోవడం నా ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్. అందుకే సీతారామం తర్వాత నా పరిస్థితి ఏమిటని అశ్వినీదత్‌ను అడిగితే.. నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పారు. సీత లాంటి పాత్రను చేసిన తర్వాత తదుపరి సినిమాల్లోని నా పాత్రలు ఎంచుకోవడం కష్టమే అనిపిస్తుంది అని అన్నారు.

    English summary
    Bollywood actress Mrunal Thakur is introducing to Telugu Audience with Sita Ramam movie which is releasing on August 5th. Here is the exclusive interview of Mrunal Thakur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X