For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ విషయంలో తప్పులు చేశా.. నా కెరీర్ ఇంకా క్లోజ్ కాలేదు.. ‘ఎవరు’ గురించి రెజీనా కసండ్రా

  |

  టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ బ్యానర్‌పై పర్ల్ వీ పొట్లూరి, పరమ్ వీ పొట్లూరి నిర్మాతలుగా నూతన దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఎవరు. అడివి శేషు, నవీన్ చంద్ర, రెజీనా కసండ్రా, మురళీ శర్మ నటించిన ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన విడుదల కానున్నది. టీజర్లు, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న హీరోయిన్ రెజీనా కసండ్రా తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. రెజీనా చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే.

  80 శాతం నా పాత్రకే ప్రాధాన్యత

  80 శాతం నా పాత్రకే ప్రాధాన్యత

  ఎవరు సినిమా ప్రారంభానికి ముందు నిర్మాత పీవీపీ నాకు కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు రాంజీ, అడవి శేషు చెన్నైకి వచ్చి సినిమా కథ చెప్పారు. కథ చెప్పగానే ఈ సినిమా చేస్తున్నామని స్పష్టం చేశాను. అప్పుడు ఈ సినిమాకు మీరు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదంటే ఇంకా హ్యాపీగా ఫీలయ్యాను. అలా ఈ చిత్రంలో సమీరా పాత్ర నాకు దక్కింది. ఎక్స్‌ప్రెషన్స్ లేని ఓ విభిన్నమైన పాత్ర నాకు చేసే అవకాశం కలిగింది. 80 శాతం నా పాత్రకే ప్రాముఖ్యత ఉంటుంది అని రెజీనా తెలిపారు.

  ఎవరు సినిమా కథ గురించి రెజీనా

  ఎవరు సినిమా కథ గురించి రెజీనా

  ఎవరు సినిమాలో ఓ కంపెనీ సీఈవో భార్యగా సమీరా పాత్రలో కనిపిస్తాను. నా కెరీర్‌లో చాలా ఇంటెన్సివ్ రోల్‌లో నటించాను. చాలా కామ్‌గా ఉండే నేచర్. ఎంతో కష్టపడి ఓ స్థాయికి చేరుకొంటుంది. అలాంటి మహిళ లైఫ్‌లో ఓ జరుగకూడదని సంఘటన చోటుచేసుకొంటుంది. అది ఎందుకు జరిగింది? ఏలా జరిగింది? ఆ సంఘటన వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనాల్సి వచ్చిందనే ప్రశ్నలకే సమాధానమే ఎవరు సినిమా అని రెజీనా చెప్పారు.

  బద్లా సినిమా గురించి

  బద్లా సినిమా గురించి

  హిందీలో విజయం సాధించిన బద్లా సినిమా కథ, ఎవరు స్టోరి ఒకేలా ఉంటుందనే ప్రచారం జరుగుతున్నది. ఆ విషయం గురించి చాలా మంది నన్ను అడిగారు. వారికి నేను చెప్పే ఒకే ఒక మాట.. సినిమా చూడండి.. బద్లాకు సంబంధం ఉందా? లేదా అనే విషయం మీకే బోధపడుతుంది. స్క్రిప్టు పరంగా మార్పులు కూడా చేయలేదు. ఈ విషయంపై వస్తున్న ప్రశ్నలకు రిలీజ్ రోజున అసలు విషయం తెలుస్తుంది అని రెజీనా కసండ్రా అన్నారు.

  ఎంత వరకు అప్‌గ్రేడ్ అంటే

  ఎంత వరకు అప్‌గ్రేడ్ అంటే

  ఎవరు సినిమా నా కెరీర్ ఎలా దోహదపడుతుంది. నా ప్రొఫెషన్‌ను మరోస్థాయికి ఎలా తీసుకెళ్తుందనే విషయం గురించి ఇప్పుడే చెప్పలేను. కానీ నా కెరీర్‌లో ఓ సంతృప్తికరమైన పాత్రను మాత్రం పోషిస్తున్నాను. ఇప్పటి వరకు యాక్టర్‌గా అప్‌గ్రేడ్ అవుతానని చేయలేదు. అ! సినిమా విషయంలో నేను ఎంత చేయాలో అంత చేశాను. ఆ సినిమాకు అవార్డు రావడం నాకు ఇంకా సంతోషం కలిగింది. సమీరా పాత్ర ద్వారా నేను ప్రేక్షకులను మెప్పించిదా? ఆ పాత్రను నేను ఎలా చేశాను అనే విషయాన్ని చూసుకొంటాను అని రెజీనా వెల్లడించారు.

  నా కెరీర్ క్లోజ్ ఇంకా కాలేదు

  నా కెరీర్ క్లోజ్ ఇంకా కాలేదు

  టాలెంట్ ఉన్నా నేను పెద్ద సినిమాలు ఎందుకు చేయలేనే విషయాన్ని ఆలోచించలేదు. ఏడేళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఇంకా నా కెరీర్‌ క్లోజ్ కాలేదు. ఇండస్ట్రీని అర్ధం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. నా ఫ్యామిలీకి ఇండస్ట్రీతో పరిచయం లేదు. ఇండస్ట్రీలో ఎలా ఉండాలో అనే విషయాలు, నియమాలు తెలుసుకోవడానికి సమయం పట్టింది. సక్సెస్, ఫెయిల్యూర్ విషయంలో విశ్లేషణ చేసుకొంటాను. నేను చేసిన తప్పులను సరిద్దిద్దుకొంటున్నాను. మంచి విషయాలతో ముందుకెళ్తుతున్నాను. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఇంకా చాలా విషయాలను బేరీజు వేసుకొంటున్నాను అని రెజీనా అన్నారు.

  English summary
  Evaru Telugu thriller film directed by Venkat Ramji. The film produced by Pearl V Potluri, Param V Potluri and Kavin Anne. The film starring Adivi Sesh, Regina Cassandra, and Naveen Chandra. The music is composed by Sricharan Pakala and editing by Garry Bh. The film is scheduled for release on 15 August 2019. In this occassion, Regina speaks to Telugu filmibeat exclusively.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X