చిరంజీవితో ఆరు రాత్రులు.. ఆ అనుభవం మరిచిపోలేకపోతున్నా.. రెజీనా

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఆచార్య సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసే అవకాశాన్ని అందాల తార రెజీనా కసండ్రా దక్కించుకొన్నారు. చిరంజీవితో కలిసి స్టెప్పులేసిన అనుభవాలను మీడియాతో పంచుకొన్నారు. అయితే తనను ఐటెం నంబర్ అని పిలువొద్దని రెజీనా మండిపడుతున్నారు. ఇంతకీ ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

 ఐటెం నంబర్‌గా చూడొద్దు

ఐటెం నంబర్‌గా చూడొద్దు

ఆచార్య సినిమాలో చిరంజీవితో కలిసి పాటలో డ్యాన్స్ చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. అయితే దానిని ఐటెం నంబర్‌గా చూడొద్దు.. దానిని స్పెషల్ సాంగ్‌గానే పరిగణించాలి. నన్ను ఐటెం అంటే ఒప్పుకోను అని రెజీనా కసండ్రా అన్నారు. ఇంతకు ముందు నాకు స్పెషల్ సాంగ్స్ చేసిన అనుభవం నాకు లేదు. చిరంజీవితో అనగానే కొంత భయమేసిందన్నారు.

 ఆలోచించకుండా ఒప్పేసుకొన్నా

ఆలోచించకుండా ఒప్పేసుకొన్నా

ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించమని జనవరి మాసంలో నాకు నిర్మాతల నుంచి కాల్ వచ్చింది. మరో నిమిషం ఆలోచించకుండా ఒప్పేసుకొన్నాను. నాకు డిఫరెంట్ పాత్రలను చేయడమంటే నాకు చాలా ఇష్టం. అందుకే స్పెషల్ సాంగ్‌ను ఒప్పుకోవడానికి ప్రధాన కారణం. అదీ కాకుండా చిరంజీవితో చేయడమనేది నాకు చిరకాల స్వప్నం అని రెజీనా అన్నారు.

ఆరు రోజులపాటు రాత్రి షూటింగ్

ఆరు రోజులపాటు రాత్రి షూటింగ్

మెగాస్టార్ చిరంజీవితో పనిచేయడం గొప్ప అనుభూతి. స్పెషల్ సాంగ్ పూర్తిగా నైట్ షూట్ జరిగింది. అలా ఆరు రోజులపాటు పాట షూట్‌లో పాల్గొన్నాను. చిరంజీవిలో ఈజ్, గ్రేస్ చూస్తే చాలా ఇన్స్‌పైరింగ్‌గా ఉంది. తొలి రోజు షూటింగ్ మెమొరీస్ ఇంకా నన్ను వెంటాడుతున్నాయి అని రెజీనా అన్నారు.

చిరంజీవి ప్రశంసలు మరిచిపోను

చిరంజీవి ప్రశంసలు మరిచిపోను

స్పెషల్ సాంగ్ షూట్ సందర్భంగా చిరంజీవి గారు ఇచ్చిన ప్రశంసలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. నా డ్యాన్స్‌లో గ్రేస్ ఉందని, హావభావాలు అద్బుతంగా ఉన్నాయని కితాబివ్వడంతో నాకు కింద పడిపోయాననే ఫీలింగ్ కలిగింది. సెట్స్‌పై అలవోకగా ఆయన డ్యాన్స్ చేస్తుంటే ఆశ్చర్యం వేసింది అని రెజీనా అన్నారు.

Recommended Video

Ram Charan Reveals RRR Movie Updates || Filmibeat Telugu
చిరంజీవి సింప్లిసిటీ గ్రేట్

చిరంజీవి సింప్లిసిటీ గ్రేట్

సాధారణంగా హీరోలు, హీరోయిన్లు సీన్ షూట్ అయిపోగానే తమ క్యార్‌వాన్‌లోకి వెళ్లి కూర్చొంటారు. కానీ చిరంజీవి తన పార్ట్ షూటింగ్ అయిపోయినా సెట్లోనే ఉంటారు. తనను కలువడానికి వచ్చే గెస్టులు, డైరెక్టర్, ఇతర యాక్టర్లతో కలిసి మాట్లాడుతుంటారు. ఇతరుల పట్ల ఆయన చూపే ఆదరణ, సింప్లిసిటీ చూస్తే అందుకే ఆయన సూపర్ స్టార్ అనిపించింది అని రెజీనా పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X