Renu Desai: జీవితంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేను.. పవన్ కల్యాణ్ పేరు వాడుకోను.. రేణు దేశాయ్

నటి, రచయిత, స్టైలిష్ట్, డైరెక్టర్ రేణుదేశాయ్ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె కీలక పాత్రను పోషిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆమె మళ్లీ తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20 తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రేణుదేశాయ్ మూవీ గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ..

యాక్టింగ్‌కు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం నాకు నచ్చిన సినిమాలు రాలేదు. నా ముందుకు ఎవరైనా వచ్చి ఆఫర్ ఇస్తే.. క్యారెక్టర్, స్టోరి, డైరెక్టర్ గురించి ఆలోచిస్తాను. అయితే వంశీ చెప్పిన కథలో నా క్యారెక్టర్ బాగుంది. కథ నాకు నచ్చింది. వంశీ చెప్పిన విధానం ఇంకా బాగా నచ్చింది. నాకు కావాల్సిన మూడు అంశాలు ఉండటంతో టైగర్ నాగేశ్వరరావు చేయడానికి ముందుకు వచ్చాను. అంతేకాకుండా నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా ఉండటంతో ఈ సినిమా చేశాను అని రేణు దేశాయ్ అన్నారు.

Renu Desai reveals interesting things about her personal life, Pawan Kalyan and Tiger Nageshwar Rao movie

తెలుగు సినిమా పరిశ్రమకు దూరంగా లేను కానీ.. నాకు నచ్చిన పాత్రల కోసం వేచి చూశాను. ఇన్నాళ్లు నేను నటించలేదనే అసంతృప్తి నాకు లేదు. హేమలత లవణం పాత్ర మిస్ అయితే నాకు రిగ్రెట్ అయి ఉండేది. వచ్చే సంవత్సరం, వచ్చే ఐదేళ్లలో నేను ఎక్కడ ఉండాలనే టార్గెట్ నాకు లేదు. యాక్సిడెంట్ అయి పోవచ్చు. లేదా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోవచ్చు. జీవితం ఎప్పుడూ ఏమీ అవుతుందో చెప్పలేం అని రేణుదేశాయ్ వేదాంతం చెప్పారు.

Renu Desai reveals interesting things about her personal life, Pawan Kalyan and Tiger Nageshwar Rao movie

టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఓ డైరెక్టర్ వచ్చి.. నీ కోసం ఓ పాత్ర రాశాను. మీరు చేయండి అంటే నేను చేయడానికి రెడీ కావొచ్చు. లేదా మరో ఐదేళ్ల వరకు ఎవరు కూడా నా వద్దకు రాకపోవచ్చు. డైరెక్టర్లు చెప్పే కథలు నాకు నచ్చకపోవచ్చు. జీవితంలో ఏైదనా జరగవచ్చు అని రేణు దేశాయ్ తెలిపారు.

అయితే టైగర్ నాగేశ్వర్ రావు తర్వాత నా సొంత సినిమా నా డైరెక్షన్‌లో మొదలవుతుంది. లాక్‌డౌన్‌కు ముందు నేను ఓ సినిమా స్టార్ట్ చేశాను. 2021లో కరోనావైరస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. అయితే త్వరలోనే ఆ సినిమాను నేను మళ్లీ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశాను అని రేణుదేశాయ్ అన్నారు.

Renu Desai reveals interesting things about her personal life, Pawan Kalyan and Tiger Nageshwar Rao movie

టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం పాత్రకు ఇప్పటి వరకు ఎవరి నుంచి కూడా ప్రశంసలు రాలేదు. ట్రైలర్ రిలీజ్ తర్వాత నా క్యారెక్టర్, గెటప్ చూసి నా కూతురు ఆద్య మెచ్చుకొన్నది. నీ వయసుకు తగిన పాత్రను బాగా చేశావు అని చెప్పారు. నేను నా పిల్లలు అకీరా, ఆద్య చెప్పిన ఫీడ్‌బ్యాక్‌ను నేను సీరియస్‌గా తీసుకొంటాను. ఇలాంటి వ్యక్తిగత విషయాలను సినిమా ఫంక్షన్లో మాట్లాడటం వల్ల పవన్ కల్యాణ్‌ను ఉపయోగించుకొంటానని అంటున్నారు. కానీ నేను పవన్ కల్యాణ్ పేరును ఉపయోగించుకోవడం ఇష్టం లేదు అని ఓ ప్రశ్నకు రేణుదేశాయ్ సమాధానం చెప్పారు.

టైగర్ నాగేశ్వరరావు మూవీలో రవితేజతో నటించడంపై నా మనసులో కొన్ని మాటలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను. ప్రీ రిలీజ్ రోజున నేను రవితేజ గురించి చెబుతాను. స్టేజ్ పైన చెప్పే మాటలు వినండి. అప్పటి వరకు మీరు ఆగండి. ఆయన గురించి చాలా చెప్పాలి అని రేణుదేశాయ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X