నా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అలాంటి చిత్రం.. అది జనసేన కాదు మనసేన.. ఆర్జీవీ కామెంట్స్

Recommended Video

RGV Press Meet About Kamma Rajyam Lo Kadapa Reddlu Movie - Part 2

వివాదాలతో సావాసం చేసే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఏ చిత్రాన్ని ప్రకటించినా, తెరకెక్కించినా కాంట్రవర్సీ మొదలవ్వాల్సిందే. వివాదాలతో కూడిన సినిమాలను తీయడం, ఏ సినిమా అయినా వివాదాల్లో చిక్కుకోవడం వర్మ ప్రత్యేకత. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆర్జీవీ గత సినిమాల మాదిరిగానే ఈ చిత్రం కూడా కోర్టు మెట్ల వరకు చేరుకుంది. ఈ క్రమంలో వర్మ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చాడు.

కెరీర్‌లో ఫస్ట్ టైమ్..

కెరీర్‌లో ఫస్ట్ టైమ్..

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే చిత్రం సందేశాత్మక చిత్రమని, తన కెరీర్‌లోనే మొట్టమొదటి మెసెజ్ ఓరియెంటెడ్ చిత్రమని పేర్కొన్నాడు. భవిష్యత్తును ఊహించిన తెరకెక్కించిన కల్పితగాథ అని, ఇందులో నిజజీవితంలో ఉన్న కొందరి వ్యక్తులను పోలి ఉండటం కేవలం యాదృచ్చికమేనని అన్నాడు.

వారికే అంకితం..

వారికే అంకితం..

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణకు అంకితమిస్తున్నట్టుగా చెప్పిన ఆర్జీవీ.. ఈ చిత్రాన్ని మాత్రం ప్రఖ్యాతి గాంచిన తండ్రీ కొడుకులకు ఇస్తానని తెలిపాడు. అయితే వారెవరో మాత్రం తాను చెప్పనని, అడగొద్దని మీడియాను కోరాడు.

ఆయన్ను పట్టించుకోవడం మానేశాను..

ఆయన్ను పట్టించుకోవడం మానేశాను..

కేఏ పాల్‌పై ఓ సాంగ్‌ను విడుదల చేయగా..అది ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటపై కేఏ పాల్ తీవ్ర స్థాయిలో మండిపడితూ ఆర్జీవీపై అంత ఎత్తుకు లేచాడు. ఇదే విషయాన్ని వర్మ వద్ద ప్రస్థావిస్తే.. ఆయన్ను పట్టించుకోవడం మానేశానని, ఆయన ప్రస్తుతం ప్రపంచ యుద్దాలను ఆపే పనిలో బిజీగా ఉన్నాడని సెటైరికల్‌గా స్పందించాడు.

అది జనసేన కాదు..

అది జనసేన కాదు..

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌ను చూపించానని అందరూ అంటున్నారు అది నిజం కాదని.. అతను పవన్ కళ్యాణ్‌ను పోలిన వ్యక్తి అని అంతేకాకుండా అతని పార్టీ పేరు మనసేన అని అన్నాడు. ఆ పార్టీకి జనసేనకు సంబంధం లేదని చెప్పుకొచ్చాడు.

ఆ సీన్ వాళ్లకే బాగా నచ్చింది..

ఆ సీన్ వాళ్లకే బాగా నచ్చింది..

ట్రైలర్‌లో చూపించిన ఓ సీన్ (తన కొడుక్కు ప్రేమగా పప్పు వడ్డించడం) తెలుగు దేశం పార్టీ వాళ్లకే బాగా నచ్చిందని, ఫోన్‌లు చేసి మరీ చెబుతున్నారని అన్నాడు. వారికి ఎందుకు నచ్చిందో మీకే (మీడియా) తెలియాలన్నాడు.

సినిమా అందుకే చూడాలి..

సినిమా అందుకే చూడాలి..

మంచి భోజనం అంటే పప్పు అంటే.. మనందరం మంచి భోజనం ఎందుకు చేయాలంటే.. అందుకు ఈ సినిమాను చూడాలని చెప్పుకొచ్చాడు. మహారాష్ట్ర రాజకీయాలపై సినిమా అంటే మరో సర్కార్ తీయాలన్నాడు. దెయ్యాలు, గ్యాంగ్ స్టర్ చిత్రాల కంటే పొలిటికల్ క్రైమ్‌ బాగా ఉంటోందని అందుకే ఇటు వైపు వచ్చానని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X