Bedurulanka 2012 ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే బెదురులంక బ్లాక్ బస్టరే.. హీరో కార్తికేయ (ఇంటర్వ్యూ)

RX 100 సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొన్న యువ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన తాజా చిత్రం బెదురులంక. డీజే టిల్లు సినిమాతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన హీరోయిన్‌ నేహా శెట్టితో కలిసి నటించిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. యుగాంతం అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకు యువ డైరెక్టర్ క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సీ యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో కార్తికేయ మీడియాతో మాట్లాడుతూ..

RX 100 సినిమా సమయంలో దర్శకుడు అజయ్ భూపతి ద్వారా నాకు క్లాక్స్ పరిచయం అయ్యారు. రాంగోపాల్ వర్మ వద్ద పనిచేసిన క్లాక్స్ ఆ సమయంలో నాకు కథ చెప్పాడు. కథలో కొత్తదనం, ఫన్ ఉండటంతో నేను సినిమా కథకు కనెక్ట్ అయ్యాను. యుగాంతం అనే పాయింట్‌ నన్ను బాగా ఆకట్టుకొన్నది. అయితే కథ విన్నప్పుడు విజువల్‌గా ఎలాంటి రెఫరెన్స్‌ దొరకలే. సాధారణం ఎవరైన కథ చెప్పినప్పుడు కొన్ని సీన్లు మన మైండ్‌లో ఫ్లాష్ అవుతాయి. కానీ ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఎలాంటి సీన్లు గుర్తుకు రాలేదు. సినిమా పూర్తయిన తర్వాత క్లాక్స్ చెప్పిన కథ కంటే విజువల్‌గా చాలా ఎక్కువ ఫీల్ కలిగింది అని కార్తికేయ అన్నాడు.

RX 100 fame Kartikeya Gummakonda confident about Bedurulanka 2012 movie success and Neha Shetty

బెదురులంక సినిమా కథ వినోదంతోపాటు మంచి సందేశం కూడా ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో ఉండే కొందరు వ్యక్తుల ప్రవర్తన, వారి బాడీ లాంగ్వేజ్‌తో కథ సాఫీగా సాగిపోతుంది. శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, రాంప్రసాద్‌ పాత్రల నుంచి డెలివరీ అయ్యే ఫన్, పంచ్ డైలాగ్స్ మంచి ఫీల్ కలిగిస్తుంది. రెండున్నర గంటలపాటు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు అని కార్తీకేయ చెప్పాడు.

RX 100 సినిమాలో నా పేరు శివ, అలాగే ఆ సినిమా గోదావరి జిల్లాల నేపథ్యంతో సాగుతుంది. ఇక బెదురులంక సినిమాలో నా పేరు శివ. ఈ సినిమా కూడా గోదావరి జిల్లాల నేపథ్యంగా సాగుతుంది. ఇది సెంటిమెంట్ కోసం ఇలా సెట్ చేయలేదు. కేవలం యాదృచ్చికంగా జరిగిపోయింది. సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి విషయాలు గుర్తుకు రాలేదు. సినిమా షూట్ అయ్యేటప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకొని క్లాక్‌ను అడిగితే.. కథ రాసేటప్పుడు ఆ విషయం నాకు కూడా గుర్తుకు రాలేదని చెప్పాడని కార్తీకేయ తెలిపాడు.

RX 100 fame Kartikeya Gummakonda confident about Bedurulanka 2012 movie success and Neha Shetty

బెదురులంక సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ బలంగా మారింది. బ్యాక్ గ్రౌండ్ స్కోరుతోపాటు పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. విభిన్నమైన జోనర్‌తో రూపొందుతున్న సినిమాకు అద్బుతంగా రీరికార్డింగ్ ఇచ్చారు. ఈ సినిమాను మణిశర్మ చాలా ఇష్టపడి చేశానని చెప్పారు. తన కెరీర్‌లో గొప్పగా అనిపించిన సినిమా అని చెప్పారు. సాధారణంగా ప్రమోషన్స్‌కు వచ్చి ఇంటర్వూలు ఇవ్వడం చేయరు. కానీ ఈ సినిమా కోసం స్వయగా పిలిచి ఇంటర్వ్యూలు చేద్దామని చెప్పారు అని కార్తీకేయ అన్నారు.

RX 100 fame Kartikeya Gummakonda confident about Bedurulanka 2012 movie success and Neha Shetty

బెదురులంక సినిమా కథ 2012 సంవత్సరం నేపథ్యంతో, గోదావరి జిల్లాలోని లంక గ్రామంలో సాగుతుంది. ఈ సినిమా క్వాలిటీ కోసం నిర్మాత బెన్నీ రాజీ పడకుండా నిర్మించారు. ఈ సినిమాలో ప్రజలు పరుగులు తీసే సీన్ ఒకటి ఉంది. ఎక్కువ మంది జనాలు కావాలి. ఖర్చు విషయంలో నిర్మాత అసలు రాజీ పడకుండా ఎక్కువ మంది జనంతో షూట్ చేశాం. కథ స్క్రీన్ పై ఎలివేట్ కావడానికి ఏం కావాలో అన్నీ సమకూరాయి. హీరోయిన్‌గా నేహా శెట్టిని తీసుకొంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) నిర్మాణంలో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది అని కార్తీకేయ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X