Bedurulanka 2012: నేహా శెట్టితో లిప్ లాక్... RX 100 రొమాన్స్ సీక్రెట్ బయట పెట్టిన కార్తీకేయ
RX 100 సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసిన కార్తీకేయ.. తాజాగా నటిస్తున్న చిత్రం బెదురులంక. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి నటిస్తోంది. యుగాంతం అనే కాన్సెప్టుతో ఈ సినిమాను దర్శకుడు క్లాక్స్ మూవీని తెరకెక్కించారు. ఇక ఈ మూవీతోనే ఆయన ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ మూవీ ఆగస్టు 25న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. అందులో భాగంగా తెలుగు ఫిల్మి బీట్ కు హీరో కార్తీకేయ ఇంటర్యూను ఇచ్చారు. ఆ విశేషాలు ఏంటో చూద్దాం.
యుగాంతం అనే కాన్సెప్ట్‌తో బెదురులంక 2012 సినిమా ఆగస్టు 25న ప్రేక్షుకులను అలరించనుంది. ఈ నేపథ్యంలోనే హీరో కార్తీకేయ... తెలుగు ఫిల్మి బీట్ కు ఇంటర్య్వూను ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో హీరో కార్తీకేయ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతే కాదు.. ఇందులో నటించిన డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దానితో పాటు ఆర్ఎక్స్ 100 రొమాన్స్ సీక్రెట్స్ బయటపెట్టారు.

ఫిల్మి బీట్ ఎడిటర్ ఏ.రాజాబాబు గారు... హీరో కార్తీకేయను ఇంటర్వ్యూ చేశారు. నేహాశెట్టి విషయానికి వస్తే... డీజే టిల్లులో మోడ్రన్ బబ్లీ గర్ల్ గా కనిపించింది.. మరి ఈ సినిమాకు వస్తే.. అమాయకత్వం, చలాకీతత్వం కలిగిన రెండు షేడ్స్ ఆమెలో కనిపించాయి... నేహా శెట్టి క్యారెక్టర్ గురించి చెప్పండి అని ప్రశ్నించగా... దీనికి కార్తీకేయ తనదైన శైలీలో సమాధానం ఇచ్చారు. హీరో కార్తీకేయ మాట్లాడుతూ... ఆ సినిమాకు, ఈ సినిమాకు ఆమెకు పోలిక ఉండదు. చాలా డిఫరెన్స్ ఉంది. అయితే తను బ్యాలెన్స్ చేయగలుగుతుందా లేదా అని భయం వేసిందని చెప్పుకొచ్చారు.
''నాక్కూడా అలాంటి సమస్య వచ్చింది. ఆర్ఎక్స్ 100 తర్వాత అలాంటి క్యారెక్టర్ ఏ కాదు.. అన్ని చేస్తాను అని.. డిఫరెంట్ సినిమాలు చేస్తూ వచ్చాను. తను కూడా అలాగే మార్చుకుంటా అని చెప్పింది. చాలా కష్టపడి.. సినిమాకోసం కృషి చేసింది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంది. ఇక ఈ సినిమాకు కెమెరా మెన్ చాలా ముఖ్యం. సాయి గారు చాలా బాగా షూట్ చేశారు. టీంలోని ప్రతి ఒక్కరూ బాగా కష్టపడ్డారు కాబట్టే రిజల్ట్ వచ్చిందని అన్నారు.

ఇక మీ మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 విషయానికి వస్తే.. రొమాంటిక్ హీరోగా గ్రాఫ్ సెట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో మీ నుంచి అది కోరుకునే వారికి డిస్సాపాయింట్ ఏర్పడింది. ఈ సినిమాలో రొమాన్స్ ఎంత అని ప్రశ్నించగా.. కార్తీకేయ మాట్లాడుతూ... ఆర్ఎక్స్ 100 సినిమాలో రొమాన్స్ 100శాతం అవసరం. హీరోను హీరోయిన్ లవ్ చేయలేదు.. లస్ట్ మాత్రమే కోరుకుంది. అందుకే అలా చూపించారు.
ఇక ఈ సినిమాలో మాత్రం శివ అనే అబ్బాయి ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. సినిమాలకు గ్రాఫిక్స్ పనిచేస్తూ ఉంటాడు. వాడు తిరిగి ఊరుకు వస్తూ ఉంటాడు. ఊర్లో ప్రెసిడెంట్ కూతురు చిత్ర అనే అమ్మాయి ఉంటుంది. ఇద్దరూ ప్రేమించుకుంటుంటారు. రొమాన్స్ ఉంటుంది.. కానీ ఫిజికల్ రొమాన్స్ మాత్రం ఈ సినిమాకు కరెక్ట్ కాదు. మీ ఇద్దరి కెమిస్ట్రీ ఏ రేంజులో ఉంటుందని ప్రశ్నించగా... మా ట్రాక్ ఎక్కువగా ఉంటుందని కాదు.. సినిమాలో ఓ హీరోతో పాటు... అందరికి ప్రయారిటీ ఉంటుంది. ఈ సినిమాకు ఎంత రొమాన్స్ ఉండాలో అంతే ఉంటుందని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











