100 కోట్ల నిర్మాత నాతో సినిమా అనగానే షాక్ తిన్నా.. ఆయనతో మూవీ అంటే ఇక ఖతం అన్నారు.. కార్తీకేయ

RX100 సినిమాతో అందర్ని ఆకట్టుకొన్న హీరో కార్తీకేయ తాజా చిత్రం హిప్పీ. గతంలో సూర్య, భూమికతో 'నువ్వు, నేను, ప్రేమ' సినిమాకు దర్శకత్వం వహించిన టీఎన్ కృష్ణ ఈ చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించారు. దిగంగన సూర్యవన్షీ, జేడీ చక్రవర్తి తదితరులు నటించారు. RX 100 ఫేం ఆర్డీ రాజశేఖర్ సంగీత దర్శకుడిగా, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా పనిచేశారు. ఈ సినిమా జూన్ 6వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో కార్తీకేయ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు.

RX 100 తర్వాత అనగానే

RX 100 తర్వాత అనగానే

RX 100 సినిమా హిట్ తర్వాత వస్తున్న హిప్పి మూవీ రిలీజ్‌కు ముందు టెన్షన్ ఉంది. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. నాపైన నాకు బాగా కాన్ఫిడెన్స్. సినిమా చూశాక ఎలాంటి రియాక్షన్ వస్తుంది. ఎలాంటి రివ్యూలు వస్తాయనే ఎక్సైట్‌మెంట్ మాత్రం ఉంది అని కార్తీకేయ అన్నారు. హిప్పి సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులను మెప్పిస్తుందని కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం అని తెలిపారు.

కథల విషయంలో ఆ క్లారిటీ ఉంది

కథల విషయంలో ఆ క్లారిటీ ఉంది

RX 100 తర్వాత స్టోరి సెలక్షన్ విషయంలో నాకు ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. ఎందుకంటే నాకు ఎలాంటి సినిమా చేయాలనే క్లారిటీ మాత్రం ఉంది. నా రెండో సినిమాపై ప్రేక్షకుల అంచనాలు ఉంటాయి. రొమాన్స్ హీరోగా నన్ను అంగీకరించారు. కాబట్టి ఈ విషయంలో కూడా ఏదో ఆశిస్తారు. అందుకే హిప్పి సినిమాలో ఆ మేరకు మేము రొమాన్స్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొన్నాం.

 నాలుగు రకాల పాత్రలతో

నాలుగు రకాల పాత్రలతో

హిప్పీ సినిమాలో నేను నాలుగు రకాల గెటప్స్‌లో కనిపిస్తాను. హిప్పీ పాత్రలో లాంగ్ హెయిర్‌లో, సెకండాఫ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లుక్‌లో కనిపిస్తాను. అలాగే మరో రెండు పాత్రలు సినిమాలో ట్విస్ట్‌గా ఉంటాయి. ఒకటి గుండు పాత్రలో కనిపిస్తాను. ఇంకో పాత్రను రివీల్ చేయలేదు. గుండు పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శివాజీ సినిమాలో రజనీకాంత్ గుండు బాస్ పాత్ర మాదిరిగానే ఉంటుంది. కానీ ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొంది చేసింది కాదు. అలా గుండు పాత్ర పాపులర్ అయిపోయింది.

లెజెండరీ ప్రొడ్యూసర్‌తో సినిమా

లెజెండరీ ప్రొడ్యూసర్‌తో సినిమా

RX 100 సక్సెస్ అయిందనే విషయం అర్ధం కావడానికి, జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. లెజెండరీ ప్రొడ్యూసర్ కలైపులి థాను లాంటి వాళ్లు నాతో సినిమా చేస్తానని రావడంతో నేను హీరోను అనే ఫీలింగ్ కలిగింది. 100 కోట్ల రేంజ్ సినిమా చేసే నిర్మాత గురించి చెప్పే స్థాయి నాకు లేదు. నా రెండో సినిమా ఆయనతో చేయడమే నా కెరీర్‌లో గొప్ప విషయం అని కార్తీకేయ చెప్పారు.

 జేడీ చక్రవర్తితో కాంబినేషన్ అనగానే

జేడీ చక్రవర్తితో కాంబినేషన్ అనగానే

జేడీ చక్రవర్తితో సినిమా చేయడం ఓ మంచి అనుభవం. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఆ పాత్ర గురించి చెప్పగానే జేడీ చక్రవర్తి గుర్తుకొచ్చాడు. ఆ తర్వాత నా సినిమాలో జేడీ చక్రవర్తి చేస్తున్నాడని చెప్పినప్పుడు చాలా మంది భయపెట్టారు. ఆయన సెట్లో అందర్ని కొడుతాడు. సెట్స్ నుంచి వెళ్లిపోతాడు. ఆయనతో కలిసి సినిమా చేస్తే అది పూర్తవుతుందా? అని కొందరు బెదిరించారు. కానీ సెట్స్‌లో చూస్తే ఆయన ఇతరులు చెప్పిన దాని కంటే డిఫరెంట్‌గా అనిపించారు. సీన్‌లో, స్పాట్‌లో చాలా ఇన్వాల్వ్ అవుతారు. జేడీ చక్రవర్తి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని అన్నారు.

 దర్శకుడు టీఎన్ కృష్ణ గురించి

దర్శకుడు టీఎన్ కృష్ణ గురించి

దర్శకుడు టీఎన్ కృష్ణతో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉన్నాను. RX 100 మూవీ చూసి నాకు కథ చెప్పడం ఊహించుకోలేకపోయాను. ఆయన తీసిన నువ్వు నేను ప్రేమ సినిమా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు చూసినా గానీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అలాంటి డైరెక్టర్‌తో కలిసి పనిచేయడం, ఆయన తీసిన విధానం చూస్తే నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని కార్తీకేయ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X