ఎన్టీఆర్ గట్స్‌కు హ్యాట్సాఫ్.. త్రివిక్రమ్‌ను చూస్తే మైండ్ బ్లాంక్.. తమన్ (ఇంటర్వ్యూ)

Recommended Video

Aravinda Sametha : Thaman's Response On Movie

అరవింద సమేత చిత్రంలో కథతోపాటు పాటలకు మంచి గుర్తింపు లభిస్తున్నది. రం.. రుధిరమ్, పెనిమిటి పాటలు భావోద్వేగాలను పండిస్తే.. అరవింద, రెడ్డి ఇటు చూడు పాటలు మాస్‌ ప్రేక్షకులను టచ్ చేశాయి. ఇదే కాకుండా భావోద్వేగ సన్నివేశాల్లో తమన్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత పేరు వచ్చింది. ఈ ప్రశంసల మధ్య సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. అరవింద సమేత గురించి తమన్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

ఎన్టీఆర్, త్రివిక్రమ్ నుంచి కాంప్లిమెంట్

ఎన్టీఆర్, త్రివిక్రమ్ నుంచి కాంప్లిమెంట్

అరవింద సమేత మ్యూజిక్ అద్భుతంగా ఉందని ముందుగా కాంప్లిమెంట్ వచ్చింది ఎన్టీఆర్, త్రివిక్రమ్ నుంచి వచ్చింది. ఇండస్ట్రీలో ప్రతీ హీరో, నటులు, దర్శకులు ఫోన్ చేసి అభినందించారు. పరిశ్రమలో గతేడాదిగా మేము పడిన శ్రమ అందరికీ తెలుసు. అందుకే నిజాయితీగా అభినందనలు తెలిపారు.

నెలరోజులు ట్యూన్ రాలేదు

నెలరోజులు ట్యూన్ రాలేదు

త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కన ఉంటే ఆ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయన ఎప్పుడు కొత్త ఆలోచనలతో, ఓపెన్ మైండ్‌తో వస్తారు. ఎప్పుడూ ఎనర్జిక్‌గా కనిపిస్తారు. అందుకే మంచి అవుట్‌పుట్ వచ్చింది. త్రివిక్రమ్‌కు ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలనే ఆలోచనల్లో గడిపాను. నెలరోజులు ట్యూన్ కూడా రాలేదు.

పాటలకు మంచి

పాటలకు మంచి

అరవింద సమేతలోని పాటలకు మంచి గౌరవం దక్కడం కేవలం స్క్రిప్టు బలంగా ఉండటం వల్లనే. మాస్ హీరో సినిమాల్లో సాధారణంగా రొటీన్‌గా పాటల ప్లేస్‌మెంట్ ఉంటుంది. కానీ అరవిందలో పాటలు సందర్భోచితంగా ఉంటాయి. కథకు ప్రాధాన్యం ఇచ్చి పాటలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మాస్, ఐటెం పాటలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, కమర్షియల్ వాల్యూస్‌కు కట్టుబడకుండా ఎన్టీఆర్ తీసుకొన్న నిర్ణయానికి చాలా గట్స్‌ అవసరం. అందుకు ఎన్టీఆర్‌కు హ్యాట్సాఫ్.

త్రివిక్రమ్ సినిమాల్లో కథ చాలా స్ట్రాంగ్

త్రివిక్రమ్ సినిమాల్లో కథ చాలా స్ట్రాంగ్

జనరల్‌గా త్రివిక్రమ్ సినిమాలు పరిశీలిస్తే కథ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దాంతోపాటు మాటలు బలంగా ఉంటాయి. ఫోర్స్‌గా డీవియేషన్‌కు వెళ్తారు. అతడు సినిమా నుంచి త్రివిక్రమ్‌ను ఫాలో అవుతుంటాను. అతడులో ఆరు పాటలు ఉన్నా మాస్ పాటలు ఉండవు. విభిన్నమైన కోణంలో స్క్రిప్టు గురించి ఆలోచిస్తాడు. కథకు అనుగుణంగా పాటలు ఉంటాయి. త్రివిక్రమ్ ఆలోచనలు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది.

ఆ సీన్ అంటే నాకు ఇష్టం

ఆ సీన్ అంటే నాకు ఇష్టం

అరవిందలో ఆ సీన్ అంటే
అరవింద సమేత చిత్రంలో రావు రమేశ్, శుభలేఖ సుధాకర్, నవీన్ చంద్ర, ఎన్టీఆర్ అందరూ కూర్చొని శాంతి చర్చలు జరుపుతారు. ఆ సీన్ నాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆ సీన్‌లో యాక్షన్, ఎమోషన్స్, రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. వాటన్నిటిని ఎలివేట్ చేయడానికి ప్రొగ్రామర్‌గా చాలా కష్టం. డైరెక్టర్‌గా మరీ కష్టం. ఆ ఛాలెంజ్‌ను అధిగమించాను.

కాలేజ్‌కు ప్రమోట్ అయిన ఫీలింగ్

కాలేజ్‌కు ప్రమోట్ అయిన ఫీలింగ్

అరవింద సమేత చిత్రం చాలా ఇంటెన్సిటీతో కూడిన కథ. అందుకు మ్యూజిక్ విషయంలో కథపై చాలా సార్లు చర్చలు జరిగాయి. త్రివిక్రమ్ వర్క్‌ స్టయిల్ డిఫరెంట్. ఎన్టీఆర్ బ్రిల్లియంట్.. ఆయన ఎనర్టీ చెప్పనక్కర్లేదు. వీరిద్దరితో జరిపిన చర్చల వల్లనే మ్యూజిక్‌కు ఓ గుర్తింపు వస్తున్నాయి. ఈ సినిమా చేసేటప్పుడు స్కూల్ నుంచి కాలేజికి ప్రమోట్ అయిన ఫీలింగ్ కలిగింది.

ఎన్టీఆర్‌తో నాకు స్పెషల్ బాండ్

ఎన్టీఆర్‌తో నాకు స్పెషల్ బాండ్

ఎన్టీఆర్‌తో నాది నాలుగు సినిమాల అనుబంధం. అంతకంటే నాకు వ్యక్తిగతంగా మంచి రిలేషన్ ఉంది. ఈ సినిమా విషయంలో ఓ స్పెషల్ బాండ్ ఏర్పడింది. నా తొలి చిత్రమే మంచి కథ ఉన్న బృందావనం. బాద్షా, రభస, రామయ్య వస్తావయ్యా సినిమాలు చేశాను. ఆ తర్వాత బ్రేక్ తీసుకొని 8 సంవత్సరాల తర్వాత సినిమా చేశాం. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X