Bheemla Nayak త్రివిక్రమ్ లేకపోతే భీమ్లా నాయక్ లేడు.. అందుకే తొలగించాం.. దర్శకుడు సాగర్ ఇంటర్వ్యూ

అయ్యారే సినిమా సమయంలోనే నాకు ఇండస్ట్రీపై పెద్దగా అవగాహన లేదు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకు వచ్చే సరికి నాకు ఓ పరిణతి వచ్చింది. అప్పట్లో ఒకడుండేవాడు తర్వాత నేను ఓపెనప్ అయ్యాను. ఇండస్ట్రీలో ఎవరి వద్దకైనా వెళ్లే ఛాన్స్ లభించింది. భీమ్లా నాయక్ సినిమాతో మరో మెట్టు ఎక్కాను. భీమ్లా నాయక్ సినిమా అవకాశం ఇచ్చి.. నిర్మాత చినబాబు నాకు మంచి ప్రోత్సాహం అందించారు. సినిమాపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన సహకారం నాకు ఉంది అని దర్శకుడు సాగర్ పేర్కొన్నారు. ఇక భీమ్లా నాయక్ సినిమా ప్రయాణం గురించి సాగర్ వెల్లడిస్తూ..

పవన్ కల్యాణ్‌తో సినిమా చేయడం

పవన్ కల్యాణ్‌తో సినిమా చేయడం

ఫస్ట్ లాక్‌డౌన్‌లో నిర్మాత నాగవంశీ ఫోన్ చేశారు. అంతకు ముందు ఆయనకు నాకు పరిచయం కూడా లేదు. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఫోన్ చేసి.. మలయాళంలో అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రిలీజైంది. ఒకసారి చూసి మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. ఆ తర్వాత నేను నా ఫీలింగ్స్ చెప్పాను.

దాంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే మీరు వర్క్ చేస్తారా అని అడిగారు. దాంతో నేను చేస్తానని చెప్పారు. అప్పటి నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జర్నీ మొదలైంది. ఈ స్క్రిప్టును మరో లెవెల్‌కు ఎలా తీసుకెళ్తారు అని అడిగారు. దాంతో నా వెర్షన్ చెప్పాను. అలా భీమ్లా నాయక్ సినిమా జర్నీ మొదలైంది. భీమ్లా నాయక్ సినిమా విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్‌తో సినిమా చేయడం, తమన్ మ్యూజిక్ చేయడం మంచి అనుభూతి. జీవితంలో గొప్ప మధురానుభూతి అని దర్శకుడు సాగర్ చెప్పారు.

మాటల్లో చెప్పలేని అనుభూతి

మాటల్లో చెప్పలేని అనుభూతి


భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారనే విషయం తెలియగానే మాటల్లో చెప్పలేని ఫీలింగ్స్‌ ఏర్పడ్డాయి. పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేయాలంటే.. ఇంత ప్రతిభ ఉండాలి.. ఈ రేంజ్ సృజనాత్మకత ఉండాలనే ప్రమాణాలు ఉండవు. పవన్ కల్యాణ్‌తో సినిమా చేయడమనేది పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయి. నాకు ఆ అవకాశం వచ్చింది. దానిని పక్కాగా సద్వినియోగం చేసుకొన్నాను. నా కెరీర్‌లోనే నేను చాలా హ్యాపీగా ఫీలయైన సినిమా భీమ్లా నాయక్ అని సాగర్ తెలిపారు.

అందుకే అయ్యప్పనుమ్‌ను రివర్స్ చేశాం

అందుకే అయ్యప్పనుమ్‌ను రివర్స్ చేశాం


అయ్యప్పనుమ్ కోషియం సినిమాలో కోషియం పాత్ర క్యారెక్టర్ ఆర్టిస్టు మాదిరిగా ఉంటుంది. అయ్యప్పనుమ్ రోల్‌లో హీరోయిజం ఉంటుంది. అయితే తెలుగుకు వచ్చేసరికి కోషియం పాత్రను రివర్స్ చేయాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచించాడు. ఒరిజినల్ విషయానికి వస్తే.. సెకండాఫ్‌లో చాలా స్లోగా కథ నడుస్తుంది. అరగంటపాటు అలా సాగితే తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరు. కాబట్టి ఈ సినిమాను కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చేసే క్రమంలో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా చేశాం. అలా ప్రేక్షకులను మెప్పించడం వల్లే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది అని దర్శకుడు సాగర్ అన్నారు.

త్రివిక్రమ్‌తో పనిచేయడంపై

త్రివిక్రమ్‌తో పనిచేయడంపై


భీమ్లా నాయక్ సినిమాను అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్‌లా రూపొందించవద్దు. అయ్యప్పనుమ్ కోషియం సినిమాలా ఈ సినిమాను రూపొందిద్దాం. అలాంటి ఫీలింగ్ వచ్చే వరకు ఈ సినిమా కథను మారుద్దాం. భీమ్లా నాయక్ సినిమా రీమేక్ రైట్స్ మరొకరు కొనేలా భీమ్లా నాయక్ నిర్మిద్దాం. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ షాడోలో ఈ సినిమా చేస్తున్నాననే అనుకోలేదు. ఒకరితో పనిచేయడం అనేది మన మైండ్ సెట్‌ను బట్టి ఉంటుంది. త్రివిక్రమ్ నుంచి ఏం నేర్చుకోవాలి అనే చూశానే తప్ప.. మరోలా ఆలోచించలేదు. ఈ ప్రాజెక్ట్‌ను ఎలా పాపులర్ చేయాలనే ఆలోచనే తప్ప మరోటి లేదు. తివిక్రమ్ లేకపోతే భీమ్లా నాయక్ ఇంత హిట్ అయ్యేది కాదు. అసలు భీమ్లా సినిమానే లేదు అని దర్శకుడు సాగర్ తెలిపారు.

రానా కారణంగానే పవన్ అలా

రానా కారణంగానే పవన్ అలా


పవన్ కల్యాణ్ యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంది. రానా దగ్గుబాటి పవర్‌ఫుల్‌గా నటించాడు. దాంతో పవన్ కల్యాణ్ తన నటనలో వేరియేషన్ చూపించడానికి స్కోప్ లభించింది. డేనియల్ శేఖర్ పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని కీలక సీన్లను నిడివి కారణంగా ఎడిటింగ్ సీన్లను తొలగించాం. రానాకు పవన్ కల్యాణ్ మోటార్ బైక్‌పై లిఫ్టు ఇచ్చే సీన్‌కు అంత ప్రాధాన్యం ఉన్నట్టు భావించలే. అందుకే తొలగించాం అని సాగర్ చెప్పారు.

Recommended Video

Bekkam Venugopal Speech At Shikaaru Trailer Launch | Filmibeat Telugu
హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి ఏమన్నారంటే..

హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి ఏమన్నారంటే..


పవన్ కల్యాణ్‌ను మొదటిసారి నేను వకీల్ సాబ్ సెట్లో కలిశాను. ఆయన రిసీవ్ చేసుకొన్న విధానం నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఒకసారి సెట్స్‌లోకి వచ్చాక మా మధ్య ఒకరకమైన గ్యాప్, బెరుకు తగ్గింది. ఈ సినిమా చూసిన తర్వాత సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్లు అభినందించారు. కమర్షియల్‌గా ఈ సినిమాను బాగా చేశావని అన్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి అని సాగర్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X