రాజమౌళి వల్లే.. అది ఎక్కించుకోలేదు.. అమ్మకు ఆ భయం.. ప్రభాస్

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగస్టు 30న రిలీజ్ కానున్నది. రన్ రాజా రన్ సినిమా దర్శకుడు సుజిత్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. అత్యున్నత సాంకేతికతతో రూపొందిన ఈ చిత్రంపై అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ.. సాహో మూవీ గురించి, వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను వెల్లడించారు. ప్రభాస్ చెప్పిన ఆయన మాటల్లోనే..

అలా జాతకం మారిపోయింది

అలా జాతకం మారిపోయింది

బాహుబలి సినిమాతో నా జాతకం మారిపోతుందని ఊహించలేదు. కానీ మంచి సినిమా అవుతుందని అనుకొన్నాను. ఓ తెలుగు సినిమాతో దేశవ్యాప్తంగా ఆమోదం లభించింది. జపాన్‌లో నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అది నాకు చాలా గర్వంగా ఉంది. బాహుబలి ముందు కంటే బాహుబలి తర్వాత నా జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి.

విజయం తలకెక్కుతుందని

విజయం తలకెక్కుతుందని

బాహుబలి విజయం నాకు తలకెక్కుతుందని అమ్మ భయపడి పోయేది. అయితే నేను పెద్దగా సక్సెస్‌ను తలకు ఎక్కించుకోనని అమ్మకు చెప్పినా వినకపోయేది. ఆ భయంతో అమ్మ ఉండటం నాకు కూడా బాధగా ఉండేది. అయితే అమ్మకు ఫీలింగ్స్‌కు ఎలాంటి ఇబ్బంది కలగుకుండా చూసుకోవాలని అప్పుడే అనుకొన్నాను అని ప్రభాస్ తెలిపారు.

రాజమౌళిని చూసే నేర్చుకొన్నా

రాజమౌళిని చూసే నేర్చుకొన్నా

విజయాన్ని తలకు ఎక్కించుకోవద్దనే విషయం దర్శకుడు రాజమౌళిని చూసి నేర్చుకొన్నాను. చత్రపతి, ఇతర సినిమాల విజయం తర్వాత రాజమౌళి ఒదిగి ఉండే తీరును చూసి ముచ్చటేసింది. తనకు కూడా అలాంటి సక్సెస్ వస్తే తాను కూడా అలానే ఉండాలని నిర్ణయించుకొన్నాను. విజయాన్ని తలకు ఎక్కించుకోవద్దనే విషయంలో రాజమౌళి నాకు స్ఫూర్తి అని ప్రభాస్ తెలిపారు.

ఒక్కసారి ప్రామిస్ చేస్తే

ఒక్కసారి ప్రామిస్ చేస్తే

నేను ఓ సారి ప్రామిస్ చేస్తే.. దాని బ్రేక్ చేయడం నాకు ఇష్టం ఉండదు. బాహుబలి1 ముగిసే సమయంలో సాహో కథ సుజిత్ చెప్పారు. బాహుబలి2 తర్వాత సుజిత్‌తో సినిమా చేస్తానా లేదా అనే అనుమానం కలిగింది. కానీ నేను సుజిత్‌తోనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. సుజిత్ కలిగించిన నమ్మకం అలాంటింది అని ప్రభాస్ చెప్పారు.

సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ అదే

సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ అదే

కోట్లాది మంది నన్ను ప్రేమించే తీరును చూస్తే.. అభిమానుల రుణం తీర్చుకోలేనిదనిపిస్తుంది. అందంతా బాహుబలి, రాజమౌళి వల్లే అని నేను నమ్ముతాను. సిల్వర్ స్క్రీన్‌కు ఉండే మ్యాజిక్ అది. వెండితెర చేసే మ్యాజిక్ ఎలా ఉంటుందనేది నా విషయంలోనే స్పష్టమైంది. సాహో సినిమా నా జీవితంలో మరో మైలురాయి అవుతుంది అని ప్రభాస్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X