For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనుష్కతో ఆ రిలేషన్.. పెళ్లి జరిగితేనే వాటికి పుల్‌స్టాప్.. అమ్మను అలా ఒప్పిస్తున్నా: ప్రభాస్

|

బాహుబలితో అంతర్జాతీయ ప్రజాదరణను అందుకొన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఆయన నటించిన సాహో చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకు ముస్తాబైంది. సాహో ప్రమోషన్ కోసం ప్రభాస్ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగా సాహో మూవీ గురించి.. వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలు మీడియాతో పంచుకొన్నారు. ప్రభాస్ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..

అనుష్కతో అఫైర్ గురించి ప్రభాస్

అనుష్కతో అఫైర్ గురించి ప్రభాస్

సాహో ప్రమోషన్‌లో ప్రభాస్ పెళ్లి విషయం ఓ కీలక పాయింట్‌గా మారింది. బాహుబలి తర్వాత పెళ్లి చేసుకొంటానని చెప్పడంతో మీ పెళ్లెప్పుడు అనే విషయాన్ని మీడియా ప్రత్యేకంగా ప్రస్తావించింది. అలాగే అనుష్క‌తో ప్రేమ, అఫైర్, డేటింగ్ విషయాలు సరికొత్తగా వెలుగు చూశాయి. అనుష్కతో అఫైర్ వార్తలను ప్రభాస్ కొట్టిపడేశాడు. మా మధ్య అలాంటి రిలేషన్ లేదు. కానీ మేము మంచి ఫ్రెండ్స్. మా మధ్య ఫ్రెండ్ షిప్ రిలేషన్ కొనసాగుతుంది అని చెప్పాడు.

పెళ్లి జరిగితేనే పుల్‌స్టాప్

పెళ్లి జరిగితేనే పుల్‌స్టాప్

బాహుబలి తర్వాత అనుష్కతో అఫైర్, పెళ్లి విషయాలు మీడియాలో వచ్చాయి. వాటిని మేము తేలికగా తీసుకొన్నాం. ఇలాంటి వార్తలు వస్తాయని ముందే అనుకొన్నాం. మూడు, నాలుగు సినిమాల్లో కలిసి పనిచేసిన తర్వాత యాక్టర్ల మధ్య ఇలాంటి రూమర్లు రావడం సహజమే. ఇలాంటి రూమర్లకు చెక్ పెట్టాలంటే నాకు పెళ్లి కావాలి లేదా అనుష్కకైనా పెళ్లి జరగాలి. అప్పుడే ఈ రూమర్లకు తెర పడుతుంది అని ప్రభాస్ అన్నారు.

పెళ్లి గురించి అమ్మ ఒత్తిడి

పెళ్లి గురించి అమ్మ ఒత్తిడి

బాహుబలి సినిమా తర్వాత పెళ్లి గురించి ఇంట్లో అమ్మ ఒత్తిడి పెరిగింది. పెళ్లి చేసుకోమని సమయం చిక్కితే పోరు పెడుతుంటారు. తనకు కూడా కొడుకు, కోడలు కళ్లముందుంటే చూడాలనే కోరిక ఉంది. అలాగే అందరిలా మనమడో, మనవరాలితో ఆడుకోవాలనే కోరికతో ఉన్నారు. కానీ ఏదో ఒక మాయ మాట చెప్పి పెళ్లిని వాయిదా వేస్తు వస్తున్నాను. ఇక ముందు పెళ్లి విషయంలో తప్పించుకోలేని పరిస్థితి కనిపించడం లేదు అని ప్రభాస్ అన్నారు.

పెదనాన్న రియాక్షన్ ఎలా అంటే

పెదనాన్న రియాక్షన్ ఎలా అంటే

బాహుబలి తర్వాత పెదనాన్న (రెబల్ స్టార్ కృష్ణం రాజు) పరిస్థితి, పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఎక్కడికెళ్లిన బాహుబలి, ప్రభాస్ అంటూ ప్రశంసలు గుప్పించే సరికి ఆనందంలో మునిగిపోయేవారు. ఆ సంతోషంలో ఆయన లావెక్కిపోయారు కూడా అని ప్రభాస్ నవ్వుతూ అన్నారు. సాహో చూసిన తర్వాత పెదనాన్న వావ్ అన్నారు. షూటింగ్‌కు ముందే సాహో కథను ఆయన విన్నారు. పెదనాన్న కూడా ఓకే చెప్పారు. పెదనాన్న చూస్తే సీనియర్లా కనిపిస్తారు. కానీ ఆయన అభిరుచి ప్రజెంట్ డేకు రిలేట్ అయి ఉంటుంది అని ప్రభాస్ తెలిపారు.

English summary
Baahubali star Prabhas breaks records in even keeping memories as he takes home a car and a bike from Saaho. The much loved actor will be seen in a daunting power-packed avatar in his upcoming action thriller Saaho, which would witness him performing high octane stunts involving cars, bikes and trucks. As part of the promotion, Prabhas opened about his affair with Anushka shetty
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more