వరలక్ష్మీ శరత్ కుమార్ కోసం ఆ రిస్క్ చేశా.. శబరి నిర్మాత మహేంద్ర నాథ్

టాలెంటెడ్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ నటించిన సినిమా శబరి. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ బ్యానర్‌పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

మా స్వస్థలం గుంటూరు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాను. ఉద్యోగం చేస్తూనే సొంతంగా బిజినెస్ మొదలుపెట్టాను. కన్సల్టెన్సీ, ఇతర బిజినెస్‌లు ఉన్నాయి. అయితే చిన్నప్పటి నుంచే నాకు సినిమాలు అంటే ఆసక్తి. చాలాకాలంగా సినిమా రంగంలోకి ప్రవేశించాలని అనుకొన్నాను. అయితే శబరి సినిమాతో నేను నిర్మాతగా మారాను అని తెలిపారు.

Sabari Producer Mahendranath Kondla says I take risk for Varalaxmi Sarathkumar Movie

దర్శకుడు మహేష్ అప్పటికే వరలక్ష్మీ శరత్ కుమార్‌కు కథ చెప్పి ఆమెను ఒప్పించారు. ఆ తర్వాత నాకు స్క్రిప్టు గురించి చెప్పడం.. నాకు నచ్చడంతో సినిమా చేయాలని అనుకొన్నాను. వరలక్ష్మీ శరత్ కుమార్ చేస్తారనే ఒకే ఒక మాటతో ఈ సినిమాకు నిర్మాతగా మారాలని అనుకొన్నాను అని మహేంద్రనాథ్ అన్నారు.

నా మొదటి సినిమా శబరి రిలీజ్ కాకముందే.. మరో రెండు సినిమాలు మొదలుపెట్టాను. అయితే రిస్క్ చేయడం నాకు అలవాటు. నేను సినిమా రంగంలో ఉండాలని అనుకొంటున్నాను. కాబట్టి వరుసగా మూవీస్ చేయాలని డిసైడ్ అయ్యాను. మరో సినిమా వరుణ్ సందేశ్, మూడో సినిమా బిగ్‌బాస్ అమర్ దీప్‌తో సినిమాలు చేస్తున్నాను. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయింది అని చెప్పారు.

Sabari Producer Mahendranath Kondla says I take risk for Varalaxmi Sarathkumar Movie

నిర్మాతగా నా మొదటి సినిమా ద్వారా చాలా విషయాలు తెలుసుకొన్నాను. కొత్త అనుభవం బాగుంది. ప్రతీ రోజు నేను 18 గంటలు పనిచేస్తాను. ఈ సినిమా కోసం అంతే పనిచేశాను. నా మొదటి సినిమా గురించి నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. ప్రొడక్షన్‌లో రకరకాలు ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. ఏ బిజినెస్‌లోనైనా ఇలాంటి ఉంటాయి. కానీ నాకు నా యూనిట్ నుంచి సంపూర్ణ సహకారం లభించడంతో నాకు ఎలాంటి సమస్యలు రాలేదు అని అన్నారు.

Sabari Producer Mahendranath Kondla says I take risk for Varalaxmi Sarathkumar Movie


ప్రొడ్యూసర్‌గా నా మొదటి సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడం రిస్క్‌గానే అనిపించింది. నాకు రిస్క్ చేయడం కొత్తేమీ కాదు. రిస్క్ చేస్తే తప్ప మనం ఎంచుకొన్న రంగంలో రాణించలేమని నేను నమ్ముతాను. ఈ సినిమాను అన్నీ భాషల్లో సొంతంగా మూవీని రిలీజ్ చేస్తున్నాం. ఫలితాన్ని మా తదుపరి ప్లానింగ్ ఉంటుంది అని మహేంద్రనాథ్ కూండ్ల అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X