Virupaksha బిగ్గెస్ట్ ఛాలెంజ్ అదే.. మా అమ్మ పునర్జన్మను ప్రసాదించింది.. సాయిధరమ్ తేజ్ (ఇంటర్వ్యూ)
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్ అవుతున్నది. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలను పెంచాయి. సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం గురించి, తన ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత విషయాల గురించి సాయిధరమ్ తేజ్ వివరంగా వెల్లడిస్తూ..
యాక్సిడెంట్ తర్వాత సినిమాల్లోకి వస్తారా? : సినిమా ప్రమోషన్స్‌లో మా అమ్మ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను. నాలో కొన్ని భయాలు సహజంగా ఉన్నాయి. అలాంటివన్నింటిని అధిగమించడం చూసి మా అమ్మ చాలా హ్యాపీగా ఫీలైంది. యాక్సిడెంట్ తర్వాత అందరూ వీడు సినిమాల్లోకి వస్తాడా? అని అనుకొన్నారు. అదే నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్‌గా నిలిచింది. అలాంటి సమయంలో నాకు అండగా మా అమ్మ నిలిచింది. నా పక్కన ఉన్నారు. మాట తడబడినప్పుడు ఎలా మాట్లాడాలనేది నేర్పించింది. 36 ఏళ్ల తర్వాత మరోసారి నాకు జన్మనిచ్చింది. ఓ కొడుకుకు తల్లి ఇన్సిపిరేషన్‌గా నిలిచింది.

జీవితం ఛాలెంజ్ విసిరితే.. : సాధారణంగా ఏవరైనా అమ్మాయి వదిలేస్తే.. చనిపోదామని అనుకొంటారు. అమ్మ ముందు అమ్మాయిలు ఎందుకు పనికిరారు. మనకు లవర్ అమ్మనే. సాధారణంగా చాలా మంది నాకు కాళ్లు మొక్కాలని వస్తే.. నాకు కాదు.. మీ అమ్మకు, నాన్నకు, గురువు కాళ్లు మొక్కండి అని చెబుతాను. నాకు జీవితం ఛాలెంజ్ విసిరితే.. మా అమ్మ, విరూపాక్ష టీమ్ నాకు సపోర్టుగా నిలిచారు అని వెల్లడించారు.
సంయుక్త మీనన్ గురించి : సంయుక్త మీనన్‌తో నాకు లవ్ ట్రాక్ ఉంటుంది. ఆమె మంచి నటి. ఇండస్ట్రీలో హిట్ యాక్టర్. ఆమె గోల్డెన్ లెగ్. ఆమె సినిమాలను ఎంచుకొనే విధానం నచ్చుతుంది. ఆమెకు ఎలాంటి సినిమాల్లో నటించాలో తెలుసు. ఆమె ఇంటెలిజెంట్. వెరీ వెరీ స్మార్ట్ అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.

విరూపాక్ష పవన్ కల్యాణ్ చూశారా? : పవన్ కల్యాణ్‌కు విరూపాక్ష టీజర్ చూపించాను. సినిమా చూఢలేదు. ఆయన బిజీ అయ్యారు. ముంబైలో ఓజీ సినిమా షూట్‌లో ఉన్నారు. ఆయనను బాంబేలో కలువడానికి ప్రయత్నించాను. కానీ కుదర్లేదు. ఆయన వచ్చిన తర్వాత సినిమా చూపిస్తాను అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.

ఆంజనేయుడిని ఎందుకు పూజిస్తానంటే? : మా ఇంటి దేవుడు అంజనేయ స్వామి. అందరూ పూజిస్తుండటంతో నేను చిన్నప్పటి నుంచి ఆయనను నమ్మకొన్నాను. చిన్నప్పుడు భయపడుతుంటే ఆంజనేయుడిని తలుచుకోమని చెప్పేవారు. అలా నేను ఆంజనేయస్వామి భక్తుడినయ్యాను. అంతేకాకుండా చిరంజీవి గారు ఆరాధించడంతో మేము ఫాలో అయిపోయాం అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











