Sai Dharam Tej Interview యాక్సిడెంట్ తర్వాత చిరంజీవి ఏం మెసేజ్ పంపారంటే.. సాయిధరమ్ తేజ్ (ఇంటర్వ్యూ)
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం మంచి బజ్‌తో భారీ అంచనాలు పెంచేసింది. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం ఎప్రిల్ 21వ తేదీన రిలీజ్ అవుతున్నది. నూతన దర్శకుడు కార్తీక్ రూపొందించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది.
ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాకు బాపినీడు బీ సమర్ఫకుడిగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..

గ్రామంపై చేతబడి చేస్తే: విరూపాక్ష చిత్రం 1989 నుంచి 1991 వరకు రుద్రవనం అనే ఒక ఊరిలో జరిగే కథ. ఆ ఊరిపై చేతబడి చేస్తారు. ఆ ఊరి చేతపడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? చేతబడి చేస్తే ఏమైంది. హారర్ ఎలిమెంట్స్ ఆ గ్రామంలో మిస్టరీ ఎలా ట్రావెల్ చేసిందనేది అనే సినిమా కథ. విరూపాక్ష అంటూ రూపం లేని కన్ను. శివుడు మూడో కన్ను. రూపంలోనే దానితో హీరో ఫైట్ చేస్తుంటాడు. దానికి కారణం ఏమిటి అనే విరూపాక్ష సినిమా కథ అని సాయిధరమ్ తేజ్ అన్నారు.
ప్రతీ విషయం నాకు ఛాలెంజే: ఇప్పటి వరకు నేను నటించిన సినిమాల్లోని పాత్రల్లో జీవించాను. కానీ విరూపాక్ష సినిమాలో సూర్య క్యారెక్టర్‌లో మొదటిసారి నటించాను. ప్రతీ యాక్టర్‌కు ప్రతీ సినిమా మొదటి సినిమానే. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ఈ సినిమా నాకు ఛాలెంజ్‌గా నిలిచింది. యాక్సిడెంట్ కారణంగా నటనపరంగా ఏమీ తేడా జరగలేదు. కాకపోతే నాకు నేనుగా బెటర్ అయ్యేందుకు ప్రయత్నించాను అని తెలిపారు.

కాంతార సినిమాతో పోలీక లేదు: కాంతార చిత్రంతో ఎలాంటి పోలిక లేదు. కాంతార సినిమా కల్ట్ క్లాసిక్. విరూపాక్ష డిఫరెంట్ జోనర్. ఇది ఒక రకమైన కల్ట్ క్లాసిక్‌గా ఉంటుంది. ఇండియానా జోన్స్ సినిమా మాదిరిగా ఉంటుంది. ఓ గ్రామంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా సినిమా నడుస్తుంది.
చాలా డిఫరెంట్ మూడ్ సినిమాలో కనిపిస్తుంది. నేను బ్లాక్ మ్యాజిక్ నమ్మను. కేవలం అంజనేయుడి మ్యాజిక్ నమ్ముతాను. ఆయన మన పక్కన ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. మేము ఈ సినిమా ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వడం లేదు అని సాయిధరమ్ తేజ్ అన్నారు.
సుకుమార్ గురించి: సుకుమార్ అంటే ప్రేమ కథలు గుర్తొస్తాయి. కానీ హారర్ జోనర్ వచ్చింది. ఈ సినిమాకు ఆయన రాసిన స్క్రీన్ ప్లే రాశారు. ప్రతీ 10 నిమిషాలకు కొత్త క్యారెక్టర్ వస్తుంది. కొత్త అనుభూతిని కలిగిస్తుంది. వర్క్ షాప్ జరిగేటప్పుడు చాలా ఇన్‌పుట్స్ ఇచ్చారు. చాలా విషయాలు చెప్పారు. యాక్సిడెంట్ తర్వాత నేను సెట్లోకి వెళ్లిన మూడో రోజు నేను నార్మల్ అయిపోయాను అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.

కార్తీక్ గొప్పగా కథ చెప్పారు: దర్శకుడు కార్తీక్ నాకు కథ చెప్పారు. కథ చెప్పినప్పుడే నేను బాత్రూంకు వెళ్లి రిలాక్స్ అయి వచ్చాను. హరర్ కథను అంత గొప్పగా చెప్పారు. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, మారుతి తర్వాత అంత గొప్పగా కార్తీక్ కథ చెప్పాడు. కార్తీక్ బ్రిల్లియెంట్, సూపర్, కథ ఇంత బాగా చెప్పినప్పుడు.. తీయడం కూడా బాగా చేస్తారని నమ్మకం కుదిరింది. ఆయన కథ చెప్పిన వెంటనే యస్ అని ఒప్పేసుకొన్నాను. అజనీష్ లోక్‌నాథ్‌ను కాంతార కంటే ముందే ఎంపిక చేసుకొన్నాం అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.

చిరంజీవి నాకు ఏం మెసేజ్ పంపారంటే?: యాక్సిడెంట్ తర్వాత చిరంజీవి గారు చాలా ఇన్సిపిరేషన్‌తో కూడిన మాట చెప్పారు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అనే మెసేజ్‌ను పంపారు. సిరివెన్నెల రాసిన పాటలోని కొన్ని లైన్లను నాకు పంపించడంతో నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఆ మాటలను స్పూర్తిగా తీసుకొన్నాను అని సాయిధరమ్ తేజ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











