twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదెప్పుడు మైనస్‌గా ఫీల్ కాలేదు.. ఆ సీన్ మా ఇంట్లోదే అనిపించింది.. సాయి ధరమ్ తేజ్ కామెంట్స్

    |

    చిత్రలహరి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే అంటూ పలకరించబోతోన్నాడు. చాలా కాలం తరువాత సక్సెస్ రుచి చూసిన సాయి ధరమ్ తేజ్ తన పంథా మార్చుకుని జాగ్రత్తగా స్క్రిప్ట్‌లను ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో వరుసగా పరాజయాలు చవిచూస్తోన్న మారుతి లాంటి దర్శకుడితో ప్రతి రోజూ పండగే చిత్రాన్ని చేయడంతో అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ టీజర్, పోస్టర్స్, పాటలు అన్నీ ఆకట్టుకునేలానే ఉన్నాయి. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలను వెల్లడించాడు.

     కథ చెప్పగానే చిరు రియాక్షన్..

    కథ చెప్పగానే చిరు రియాక్షన్..

    ఈ కథను చిరంజీవికి చెప్పగానే బాగుందని అన్నట్లు తేజు చెప్పుకొచ్చాడు. అయితే ఎలా తీస్తాడో చూస్తానని తెలిపాడు. ఇంకా ఈ సినిమాను చిరంజీవికి చూపించలేదని, చూశాక ఏమంటారో చూడాలని చెప్పుకొచ్చాడు.

    అదెప్పుడు మైనస్‌గా ఫీల్ కాలేదు..

    అదెప్పుడు మైనస్‌గా ఫీల్ కాలేదు..

    మెగా ఫ్యామిలీ నుంచి వచ్చానని, మెగా హీరో అనే ట్యాగ్‌ను తానెప్పుడు మైనస్‌గా ఫీల్ కాలేదని చెప్పుకొచ్చాడు. అయితే మెగాస్టార్ ఇంటి నుంచి వచ్చాను కాబట్టి ఆ స్టాండర్డ్స్ మెయింటెన్ చేయాల్సి వస్తుంది.. ఏ పని చేసినా ఓ బాధ్యతతో మెలగాల్సి ఉంటుందని అన్నాడు. వారిని రీచ్ కాకపోయినా.. వారి స్టాండర్డ్స్‌ను తగ్గించేలా మాత్రం చేయకూడదని అనుకుంటానని తెలిపాడు.

    ఆ సీన్ మా ఇంట్లోదే..

    ఆ సీన్ మా ఇంట్లోదే..

    ఈ మూవీ చేస్తున్నంతసేపు, సత్య రాజ్‌ను మా సొంత తాతలానే ఫీల్ అయ్యానని తెలిపాడు. బయట తానెలా ఉంటాడో ఈ చిత్రంలో అలాగే నటించానని పేర్కొన్నాడు. డైనింగ్ టేబుల్ వద్ద అందరూ కూర్చొని ఉండే సీన్ మాత్రం వారింట్లో జరిగినట్టుగా అనిపించిందన్నాడు. ఆదివారం వస్తే చాలు చిరంజీవి ఇంట్లో అందరం కలవడం, ప్రతీ పండగకి ఒకే చోట చేరడం లాంటి సీన్లు కనెక్ట్ అయ్యాయని చెప్పుకొచ్చాడు.

    ఈ వర్కౌట్లు సరిపోవన్నాడు..

    ఈ వర్కౌట్లు సరిపోవన్నాడు..

    చిత్రలహరి కోసం లావైన సాయి ధరమ్ తేజ్.. ప్రతీరోజూ పండగే కోసం బాడీని బిల్డప్ చేసుకున్నాడు. అయితే దీనికోసం చాలానే కష్టపడ్డట్టు తెలిపాడు. ఓ రోజు జిమ్‌లో వర్కౌట్లు చేస్తుంటే.. అది చూసిన చరణ్.. ఈ వర్కౌట్లు సరిపోవని.. తన ట్రైనర్‌ను పంపాడని తెలిపాడు.

    English summary
    Sai Dharam Tej Interview About Prathi Roju Pandage. This Movie Is Produced By Geetha Arts And UV Creations. This Project Is Directed By Maruthi. Sathya Raj, Rao Ramesh And Raashi Khanna Are Main Lead And It Is Going To Release On 2oth December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X