‘చిత్రలహరి’ని కెలికిన కొరటాల శివ.. ఆ భయంతోనే.. సాయిధరమ్ తేజ్ క్లారిటీ

ఆరు అపజయాల తర్వాత ఎలాగైనా సక్సెస్ కొట్టడానికి చిత్రలహరితో మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రేక్షకులకు ముందుకొస్తున్నాడు. నవీన్ ఎర్నేని, వై రవికిశోర్, సీవీఎం (మోహన్) నిర్మాతలుగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌తో కలిసి నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం చాలా మందికి కీలకంగా మారింది. అందుకే ఎలాంటి తప్పు జరుగకుండా జాగ్రత్తలు పడ్డాం అని సాయిధరమ్ చెప్పాడు. చిత్రలహరి సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఆయన చెప్పిన విషయాలు మీ కోసం..

ప్రతీ ఒక్కరిలో ఫెయిల్యూర్

ప్రతీ ఒక్కరిలో ఫెయిల్యూర్

చిత్రలహరి స్క్రిప్టులో దర్శకుడు కొరటాల శివ జోక్యం గురించి స్పందిస్తూ.. అవును.. కథలో లోపాలు, కథనాన్ని మరింత ఇంట్రెస్ట్‌గా చెప్పేందుకు కొరటాల శివ చిత్రలహరి స్క్రిప్టులో భాగమయ్యారు. కథ విన్నప్పటి నుంచి బాగా హెల్ప్ చేశారు. ఎందుకంటే ఈ చిత్రానికి పనిచేసిన ప్రతీ ఒక్కరికి గతంలో ఓ ఫెయిల్యూర్ వెంటాడింది. అందుకే అందరికీ అవసరమైన సక్సెస్ కోసం కొరటాల శివ జోక్యం తప్పనిసరి అయింది అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.

 డైరెక్టర్ కొరటాల శివ జోక్యం గురించి

డైరెక్టర్ కొరటాల శివ జోక్యం గురించి

దర్శకుడు కొరటాల శివ, సుకుమార్ జోక్యం ఎంత మేరకు ఉపయోగపడిందనే ప్రశ్నకు కొరటాల శివ సమాధానమిస్తూ... ఆయన అనుభవం ఈ సినిమాకు మరింత బలంగా మారింది. కొరటాల సూచనలు సినిమాకు బాగా సహాయపడ్డాయి. మాలో మరింత ధైర్యాన్ని నింపింది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్‌పై మాకు బాగా నమ్మకం కుదిరింది అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

కిషోర్ తిరుమలకు ఫ్లాప్ ఉంటే ఏంటీ?

కిషోర్ తిరుమలకు ఫ్లాప్ ఉంటే ఏంటీ?

దర్శకుడు కిశోర్ తిరుమల ఫ్లాప్‌లో ఉన్నప్పుడు ఆయనతో సినిమా చేయడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. కంటెంట్‌లో దమ్ము ఉంటే సినిమా ఆడుతుంది. ఫెయిల్యూర్‌తో కెరీర్ ఆగిపోతుందని నేను నమ్మను. ఫ్లాప్ వల్ల కెరీర్ ముగుస్తుందని అనుకోను. సినిమా ఇండస్ట్రీలో ప్రతీ యాక్టర్‌కు ప్రతీ శుక్రవారం తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

ప్రతీ ఒక్కరికి ఓ బయోపిక్‌లా

ప్రతీ ఒక్కరికి ఓ బయోపిక్‌లా

చిత్రలహరి ట్రైలర్ చూసి ప్రతీ ఒక్కరు ఇది నా బయోపిక్ మాదిరిగా ఉంది అనే సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రతీ ఒక్కరి జీవితం ఉంటుంది. ప్రతీ ప్రేక్షకుడు కథకు కనెక్ట్ అవుతుంది. ఇలాంటి సినిమాను రూపొందించిన మైత్రీ మూవీస్‌కు రుణపడి ఉంటాను. ఆరు ఫ్లాప్ తర్వాత కూడా నాతో సినిమా చేయడమంటే వారికి ఈ కథపై ఉన్న నమ్మకం అలాంటిది అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

 అందరం కసితో పనిచేశాం

అందరం కసితో పనిచేశాం

రంగస్థలం, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్లను అందించిన మైత్రీ మూవీస్ మేకర్స్ చిత్రలహరిని రూపొందించింది. ఈ సినిమాకు ముందు వరుస పరాజయాలు వారి బ్యానర్‌లో నమోదయ్యాయి. సాయిధరమ్ తేజ్‌కు, హీరోయిన్లు కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌కు, దర్శకుడు కిషోర్ తిరుమలని వరుస ఫెయిల్యూర్స్ వెంటాడాయి. ఈ సినిమా ద్వారా సక్సెస్ సాధించాలనే కసితో పనిచేశాం అని సాయిధరమ్ తేజ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X