పవన్ కల్యాణ్ వార్నింగ్.. అందుకే దూరం... అయినా నేను జనసైనికుడినే... సాయిధరమ్ తేజ్

వరుస ఫెయిల్యూర్స్‌తో తడబాటుకు గురైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమయ్యాడు. కిషోర్ తిరుమలశెట్టి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించిన చిత్రలహరి సినిమా 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శిని, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. చిత్రలహరి సినిమా విడుదల నేపథ్యంలో తన వరుస వైఫల్యాల గురించి, చిత్రలహరి సినిమా విశేషాల గురించి వివరించారు. సాయిధరమ్ తేజ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...

రాజకీయాల్లో తలదూర్చవద్దు...

రాజకీయాల్లో తలదూర్చవద్దు...

రాజకీయాల్లో తల దూర్చ వద్దని పవన్ కల్యాణ్ చెప్పాడు. సినిమాల్లోనైనా ఉండు లేదా రాజకీయాల్లోకి రారా. రెండు పడవల మీద ప్రయాణం వద్దు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రా. లేదంటే సినిమాలో ఉండి నటించు. రాజకీయాల్లో అకింతభావం ఉండాలి. అప్పుడే సేవ చేయడానికి వీలవుతుంది. ఏ రంగంలోకి ప్రవేశించినా మద్దతు ఉంటుంది అని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

ఎప్పుడూ నేను జనసైనికుడినే

ఎప్పుడూ నేను జనసైనికుడినే

పవన్ కోసం ప్రచారం చేయకున్నా ఎప్పుడూ మా మద్దతు ఉంటుంది. జనసేన ఆవిర్భావం నుంచి నేను కార్యకర్తనే. ఎప్పటి నుంచో జనసైనికుడినే. ఆ పార్టీకి ఆ మద్దతు ఉంటుంది. ప్రచారానికి దూరంగా ఉన్నాననే బాధ ఉంది అని సాయి ధరమ్ తేజ్ అన్నారు.

హర్స్ రైడింగ్ సీన్లలో

హర్స్ రైడింగ్ సీన్లలో

విన్నర్ సినిమాలో హర్స్ రైడింగ్ సీన్లలో నటించేటప్పుడు చాలా గాయాలయ్యాయి. ఆ సమయంలో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తేజ్ ఐ లవ్ యూ సినిమా షూటింగ్‌లో గాయాలు తిరగదోడాయి. కనీసం నడువ లేని పరిస్థితి. అందుకే చికిత్స కోసం అమెరికాకు వెళ్లాను. యూఎస్‌కు వెళ్లితే నాపై కొన్ని గాసిప్స్ వచ్చాయి. హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లానని, లైపో సర్జరీ కోసం వెళ్లాలని వార్తలు వచ్చాయి. అవన్నీ అవాస్తవాలే అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

 గల్లీబాయ్ సినిమా రీమేక్‌లో

గల్లీబాయ్ సినిమా రీమేక్‌లో

హిందీలో విజయం సాధించిన గల్లీబాయ్‌లో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అందులో వాస్తవం లేదు. మాకు తెలియకుండా వార్తలు వినిపించాయి. అయితే ఆ సినిమా ఇంత వరకు చూడలేదు. సమయం లేకపోవడం చూడటానికి వీలు కాలేదు. త్వరలోనే ఆ సినిమా చూస్తాను. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బిజీగా ఉన్నాను అని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నారు.

 మిడిల్ క్లాస్ నేపథ్యంగా చిత్రలహరి మూవీ

మిడిల్ క్లాస్ నేపథ్యంగా చిత్రలహరి మూవీ

దర్శకుడు కిషోర్ తిరుమలశెట్టి చిత్రలహరి సినిమాను అద్బుతంగా తెరకెక్కించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ భావోద్వేగానికి గురిచేస్తాయి. సునీల్ క్యారెక్టర్‌ మన ఇంట్లో ఎవరినో ఒకరిని గుర్తు చేస్తాయి. చిత్రలహరి నా హృదయానికి దగ్గరగా ఉండే సినిమా ఇది. సినిమాల ఎంపిక విషయంలో ఇంకా మెచ్యురిటీ వచ్చిందని చెప్పలేను. ప్రతీ రోజు జీవిత పాఠమే అని సాయిధరమ్ తేజ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X