BRO సెట్‌లో పవన్ కల్యాణ్ మాస్ ర్యాగింగ్.. అలా ఏడిపించాడు.. సాయిధరమ్ తేజ్ (ఇంటర్వ్యూ)
విరూపాక్ష సినిమాతో భారీ సక్సెస్ అందుకొన్న సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా నటించిన సినిమా బ్రో ది అవతార్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కాంబినేషన్‌లో సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను రూపొందించారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ చిత్రంలో కేతిక వర్మ, ప్రియా వారియర్, ఊర్వశి రౌటేలా నటించారు. ఈ సినిమా జూలై 28వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
తెలుగు సినిమా పరిశ్రమకు నన్ను ఎవరైతే పరిచయం చేశారో ఆయనతో నటించే అవకాశం వచ్చినప్పుడు కథ గురించి ఆలోచించలేదు. కథ ఏమిటని నేను అడగలేదు. పవన్ కల్యాణ్ ముందు నాకు నేను ప్రూవ్ చేసుకొనే ఛాన్స్ వచ్చింది. ముందు, వెనుక ఆలోచించకుండా సరే అన్నాను. కథ ఒప్పుకొన్న తర్వాత వినోదయ సీతమ్ సినిమా కాసేపు చూశాను. ఆ తర్వాత ఆపేసి.. కథ వల్ల నేను ఇన్‌ఫ్లూయెన్స్ కాకుడదనుకొన్నాను. ఆ తర్వాత నేను కథ అంతా విన్నాను. కేవలం కల్యాణ్ కోసమే నేను సినిమా చేశాను అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.

బ్రో సినిమా నాకు స్పెషల్. ఎందుకంటే పవన్ కల్యాణ్‌తో నటించడమనేది నా డ్రీమ్. అయితే నా యాక్సిడెంట్‌కు ఈ సినిమాకు లింక్ లేదు. బ్రో సినిమా నాకు యాక్సిడెంట్ జరగడానికి ముందు అంటే 2021లో ఒప్పుకొన్న మూవీ. ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ యాదృశ్చికంగా జరిగింది. నేను గురువుగా భావించే కల్యాణ్ మామ ముందు నాకు నేనుగా ప్రూవ్ చేసుకొనేందుకు. నా మీద పెట్టిన పెట్టుబడి కరెక్ట్ అని చెప్పడానికి చేసిన సినిమా ఇది అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.
బ్రో మూవీ తొలి రోజు షూటింగులో పవన్ కల్యాణ్ ముందు నటించాల్సి రావడంతో కొంత కంగారు పడ్డాను. చేతులు వణికాయ్. కల్యాణ్ మామయ్య పిలిచి ఎందుకు కంగారు పడుతావ్. నేచురల్‌గా యాక్ట్ చేయి అని చెప్పారు. దాంతో మధ్యాహ్నం నుంచి నేను ఫ్రీ అయిపోయాను. దర్శకుడు సముద్రఖని చాలా సింపుల్‌గా, కంఫర్ట్‌గా ఉంచి నాతో యాక్టింగ్ చేయించారు. కథకు నేను వ్యక్తిగతంగా కనెక్ట్ కాలేదు అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ నాకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. ఆయన కథ, స్క్రిప్టు వరకే పరిమితమయ్యారు. ఆయన లాంటి గొప్ప డైరెక్టర్, రచయిత నాకు, నా సినిమాకు డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాయడం చాలా గర్వంగా ఉంది. బ్రో మూవీ సెట్‌లో ప్రతీ రోజు టఫ్‌గానే ఉంది. కల్యాణ్ మామయ్యతో నటించడం వల్ల నాకు ప్రతీ రోజు అద్బుతమైన, మరిచిపోలేని అనుభూతికి గురయ్యాను అని సాయిధరమ్ తేజ్ అన్నారు.
బ్రో సినిమాలోను, షూటింగులోనే నన్ను కల్యాణ్ మామయ్య బాగా ర్యాగింగ్ చేశారు. ప్రతీ రోజు గట్టిగా ఏడిపించాడు. నాకు కథ చెప్పినప్పటి నుంచి పూర్తయ్యే వరకు నాతో చిలిపి చేష్టలు చేశారు. నాకు కితకితలు పెట్టి ఏడిపించాడు. బయట మేమిద్దరం ఎలా ఉంటామో.. సెట్‌లో కూడా అలాగే ఉన్నాం. చిన్నప్పటి నుంచి మేము ఎలా ఉన్నామో.. సినిమాలో కూడా అలాగే కనిపిస్తాం అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











