డిగ్రీలో సాయి ధరమ్ తేజ్ ప్రేమకథలు.. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తిట్టారు

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ప్రతీరోజూ పండగే అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నాడు. చిత్రలహరి లాంటి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన ఈ హీరో.. కథలపై మంచి పట్టే సాధించినట్టు కనిపిస్తోంది. అంతకు ముందు మాస్ మంత్రం జపిస్తూ ఉన్న మెగా హీరో.. రూట్ మార్చి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వైపు వచ్చేశాడు. సినిమా విషయాలు కాసేపు పక్కన పెడితే.. సాయి ధరమ్ తేజ్ తాజాగా ఓ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అలీ హోస్ట్‌గా నిర్వహించే ఈ షోలో దర్శకుడు మారుతితో కలిసి అనేక విషయాలను చెప్పుకొచ్చాడు.

 హీరోనే మొగాడు..

హీరోనే మొగాడు..

తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. అది కాస్తా ప్రస్తుతం వైరల్ అవుతోంది. మొదటగా ఎంట్రీ ఇచ్చిన మారుతిని.. ‘ఇద్దరు వస్తారని చెప్పారు. ఒక్కరే వచ్చారేంటి?' అని అలీ ప్రశ్నించగా.. ‘ఎంతమాత్రం యాక్టర్ అయితే హీరో వస్తే గానీ ప్రోగ్రామ్ మొదలు పెట్టవా?' అని మారుతి పంచ్ వేశాడు. టెక్నీషియన్‌లుంటేనే హీరో.. హీరో ఉంటేనే టెక్నీషియన్‌లు అంటూ అలీ కవర్ చేసుకుంటూ.. ఇద్దరూ మొగుడు పెళ్లాలు అని చెప్పుకొచ్చాడు. హండ్రెడ్ పర్సెంట్ మొగుడు ఆయనే అంటూ మారుతి అనడంతో.. మీరే పెళ్లామని ఒప్పుకున్నారా? అని అనడంతో నవ్వులు పూశాయి.

 సోలో బతుకే సో బెటరు..

సోలో బతుకే సో బెటరు..

అనంతరం ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఓ బావ పాటకు స్టెప్పులు వేశాడు. ఏం తేజు గర్ల్ ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్నావట? అని అలీ ప్రశ్నించగా.. హ్యాపీగా ఉన్నా.. సోలో బతుకే సో బెటరు అంటూ చెప్పి తప్పించుకున్నాడు.

డిగ్రీలో చాలానే కథలున్నాయి..

డిగ్రీలో చాలానే కథలున్నాయి..

సాయి ధరమ్ తేజ్ లవ్ స్టొరీ గురించి తెలుసా నీకు అని మారుతిని ప్రశ్నించాడు అలీ. డిగ్రీలో జరిగిన విషయాలు చెప్పు అంటూ అలీ హీరోకు ఆర్డర్ వేశాడు. ఏం డార్లింగ్ నాకు చెప్పలేదు అని మారుతి అనగా.. ఒకటి కాదన్న చాలానే ఉన్నాయని సిగ్గుపడుతూ చెప్పేశాడు. అవునా.. ఈ ట్రాక్ నాకు తెలియలేదు.. తెలిస్తే ఎక్కడో చోట వాడే వాడిని కదా అని మారుతి అనగా.. అలా వాడుతావనే చెప్పలేదని తేజు కౌంటర్ వేశాడు.

 పవన్ కళ్యాణ్ తిట్టారు..

పవన్ కళ్యాణ్ తిట్టారు..

ఓ రాత్రి లేటుగా వచ్చినందుకు ఎవరో బాగానే ఫుడ్ పెట్టారంటా? అని అప్పటి విషయాన్ని బయటకు తెచ్చేందుకు అలీ ప్రయత్నించసాగాడు. నాన్చుతూ ఆ వ్యక్తి ఇంకెవరు పవన్ కళ్యాణ్ అంటూ చెప్పేశాడు. మమ్మీ లేదు.. ఆ రోజు వచ్చే సరికి అక్కడే ఉన్నారు.. చూసి నేను ఆగిపోయాను అంటూ నాటి సంగతిని గుర్తు చేసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X