Sai Pallavi కాబోయే భర్త గురించి సాయిపల్లవి హాట్ కామెంట్.. నా లైఫ్ పార్ట్‌నర్ అంటూ.. !
లేడీ పవర్ స్టార్, లేడి సూపర్ స్టార్ అనే ట్యాగ్స్ నా కోసం ఉపయోగిస్తుంటే.. చాలా హ్యాపీగా ఉన్నాను. అలాంటి పదాల గురించి చెప్పడానికి ఏమీ లేదు. వాటి గురించి రెస్పాన్స్ కావడానికి మాటలు రావడం లేదు. అలా అంటే చాలా ఆనందంగా ఉందని చెప్పగలను అని సాయిపల్లవి చెప్పారు. విరాట పర్వం సినిమా ప్రమోషన్‌లో భాగంగా సాయిపల్లవి మాట్లాడుతూ..

సరళ తల్లిని చూసి తట్టుకోలేకపోయా
వరంగల్‌కు చెందిన సరళ అనే యువతి జీవితంలో చోటు చేసుకొన్న సంఘనలు, జరిగిన అన్యాయాన్ని కథగా రాసి విరాటపర్వంగా తెరకెక్కించారు. వరంగల్‌లో ఆత్మీయ సభ అనంతరం సరళ తల్లిని కలిశాను. అమ్మ చాలా ఆత్మీయంగా మాట్లాడారు. ఆమె నా చేతిని పట్టుకొని.. తన కూతురుతో మాట్లాడినట్టు మాట్లాడారు. ఎక్కడికి పోయావు? ఇన్నాళ్లు ఏమైపోయావు అని అడిగితే.. నా హృదయం ముక్కలైనంత పనైంది. ఆ ప్రేమను తట్టుకోలేకపోయాను. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. ఒక ఫ్యామిలీ అనుభవాన్ని చూసి ఎమోషనల్ అయ్యాను. ఈ సినిమాలో అలాంటి ఫ్యామిలీల గురించి మాట్లాడుతున్నాను. సరళ తల్లి చూపించిన ప్రేమను మాటల్లో చెప్పలేను. నేను తిరిగి వచ్చేటప్పుడు బొట్టుపెట్టి.. చీర పెట్టి పంపించారు. నన్ను చూసి ఆమెలో సంతోషపడటం హ్యాపీగా అనిపించింది. నా ఫ్యామిలీని కలిసిన ఫీలింగ్ కలిగింది అని సాయిపల్లవి అన్నారు.

జీవితం వేరు.. నటన వేరు..
నా వ్యక్తిగత జీవితం వేరు. నేను నటించే పాత్రలు వేరు. ఏదైనా పాత్ర నాపై ప్రభావం చూపి.. ఏ రకంగా డిస్ట్రబ్ చేసినా.. ధ్యానం చేసుకొంటే.. ఆ ప్రభావం నుంచి బయటపడుతాను అని సాయిపల్లవి అన్నారు. నా జీవితం వేరు.. వెన్నెల జీవితం వేరు.. మా ఇద్దరిలో పెద్దగా పోలీకలు లేవు చెప్పారు. లేడి పవర్ స్టార్, సూపర్ స్టార్ అనే ఇమేజ్.. పెద్ద హీరోలతో నటించడానికి ఎలాంటి అడ్డంకులు కావు అని సాయిపల్లవి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నా మనుసులో అలాంటి ఇమేజ్ లేదు. ప్రేక్షకుల ప్రేమను మాత్రమే తీసుకొంటాను. మంచి సినిమాలు చేయాలని మాత్రమే అనుకొంటానని సాయిపల్లవి చెప్పారు.

శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం సినిమాలు..
శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం సినిమాల వల్ల రెండు డిఫరెంట్ టైమ్ పీరియడ్‌లో నటించే అవకాశం వచ్చింది. రాణిలా ఉండే పాత్రను పోషించడం ద్వారా చిన్నతనంలో క్వీన్ కావాలని పడిన ఆశ తీరింది. శ్యామ్ సింగరాయ్‌లోని దేవదాసి పాత్ర ద్వారా చిన్నతనంలో నాలో కలిగిన కొన్ని కోరికలు తీరాయి. విరాట పర్వంలో ఓ మట్టి మనిషి పాత్రను పోషించాను. ఒక ముతక, నేటివిటి ఉన్న పాత్రలో కనిపిస్తాను అని సాయిపల్లవి తెలిపారు.

వేణు ఉడుగుల గొప్ప రచయిత
దర్శకుడు వేణు ఉడుగుల గొప్ప రచయిత. తనకు తెలిసిన పరిస్థితుల గురించి తనకంటే ఎవరూ గొప్పగా రాయలేరని నమ్ముతాను. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి చాలా సహజంగా తీర్చిదిద్దారు. ఇలాంటి గ్రిప్పింగ్ కథలు మరెన్నో రాయాలని ఆశిస్తున్నాను. సినిమా అనేది ఎప్పటికీ నిలిచిపోవాలి. చాలా మంది లెజెండరీ నటులు నటించిన మంచి సినిమాలే మనకి గుర్తుంటాయి. అప్పుడది కమర్షియల్ సక్సెస్ కాదా అనే ఆలోచన రాదు, వుండదు. ఆడియన్స్ కి ఏ సినిమా నచ్చుతుంది, నచ్చదో మనం చెప్పాలేం. నేను సినిమా చేసేటప్పుడు.. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయాన్ని మనసులో పెట్టుకుంటాను. కళ శాశ్వతం. ఎప్పటికీ నిలిచిపోయే సినిమానే చేయాలని అనుకుంటాను. విరాట పర్వం కూడా ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమా అని సాయిపల్లవి చెప్పారు.

తెలంగాణ నాకు చాలా ఇచ్చింది..
ఫిదా నుంచి విరాటపర్వం వరకు ఎక్కువ శాతం తెలంగాణ నేపథ్యం ఉన్న చిత్రాల్లోనే నటించాను. నాకు తెలంగాణ ప్రాంతమంటే చాలా ఇష్టం. తెలంగాణ తప్ప మరోటి నాకు తెలియదు. నా మూలాలన్నీ ఇక్కడే అనేంతగా నేను ఈ ప్రాంతాన్ని నా సొంతం చేసుకొన్నాను. తెలంగాణ సమాజం నాకు చాలా ఇచ్చింది. నేను తెలంగాణ సమాజంలో భాగమవ్వడం నిజంగా అదృష్టమే అని సాయిపల్లవి అన్నారు. నా లైఫ్ పార్ట్‌నర్ తెలంగాణాలో ఉన్నాడా? లేదా అనేది పక్కన పెడితే.. ఇంకా పుట్టి ఉండరని అనుకొంటున్నాను అని సాయిపల్లవి చెప్పారు.

సాయిపల్లవి నటిస్తున్న సినిమాలు ఇవే..
శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం తర్వాత గార్గి సినిమాలో నటించాను. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆ సినిమా అద్భుతంగా ఉంటుంది. వెలుగులోకి రాని విషయాలతో సినిమా రూపొందింది. కోవిడ్ సమయంలో షూట్ చేశాం. విరాటపర్వంలానే గార్గి కూడా చాలా భిన్నమైన కథ. నా మనసుకు దగ్గరైన కథ ఇది. తెలుగులో చాలా స్క్రిప్టులు చదువుతున్నాను. శివకార్తికేయన్ గారితో తమిళ్‌లో ఒక సినిమా సైన్ చేశాను. ఇంకా కొన్ని చిత్రాలు చర్చల జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











