twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి సినిమాను అందుకే రిజెక్ట్ చేశా.. లవ్ స్టోరి ఒక ఎమోషనల్ సినిమా.. సాయిపల్లవి (ఇంటర్వ్యూ)

    |

    లవ్ స్టోరి స్క్రిప్టు శేఖర్ కమ్ముల నాకు పంపారు. అది చదివిన తర్వాత వెంటనే ఈ సినిమా చేయాలనే ఫీలింగ్ కలిగింది. ఆయన ఫోన్ చేసి కథ నచ్చిందా అని అడిగి వెంటనే ఒప్పేసుకొన్నాను. లవ్ స్టోరి సినిమాలో నేను భాగమయ్యాను. లవ్ స్టోరి ఆడ, మగ మధ్య తారతమ్యాల గురించి చర్చించే చిత్రం. లవ్ స్టోరిలో జెండర్ ఇష్యూస్ అనేది ఒక పాయింట్ మాత్రమే. సెట్‌లో ఆడ, మగ అనే తేడా కనిపించదు. స్క్రిప్టు డిమాండ్ మేరకు నాగచైతన్య, ఈశ్వరీరావు, నేను అంతా కలిసి చేశాం. ఇండస్ట్రీలో అలాంటి నటీనటులు మధ్య డిఫరెన్సెస్, వివక్ష కనిపించవు అని సాయిపల్లవి అన్నారు.

    Vidyullekha Raman: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న లేడి కమెడియన్ .. ఎంత అందంగా ఉందొ చూశారా..Vidyullekha Raman: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న లేడి కమెడియన్ .. ఎంత అందంగా ఉందొ చూశారా..

    భానుమతి, మౌనిక పాత్రలు డిఫరెంట్

    భానుమతి, మౌనిక పాత్రలు డిఫరెంట్

    లవ్ స్టోరి డ్యాన్స్ ప్రధానంగా నడిచే సినిమా, కథ కాదు. ఇంటర్నల్‌గా ఓ కీలక అంశం కథను నడిపిస్తుంది. డ్యాన్స్, ప్రేమ అనే అంశాలు కథతోపాటు ట్రావెల్ అవుతాయి. అంతేకానీ డ్యాన్స్ బేస్డ్ సినిమా కాదు. ఈ చిత్రంలో పాత్ర నుంచి, శేఖర్ కమ్ముల నుంచి చాలా నేర్చుకొన్నాను. ఫిదాతో పోల్చితే ఆ సినిమాలోని పాత్ర, లవ్ స్టోరిలోని పాత్ర వేర్వేరు. వేటికి అవే బలమైనవి. భానుమతి, మౌనిక పాత్రలు వేర్వేరు. ఆ రెండు పాత్రల జర్నీ డిఫరెంట్. కానీ ఫిదా తర్వాత ఇలాంటి పాత్రలు, తెలంగాణ యాస మాట్లాడటం చాలా ఈజీ అయింది అని సాయి పల్లవి చెప్పారు.

     నాగచైతన్యతో చాలా కంఫర్ట్ ఉంది..

    నాగచైతన్యతో చాలా కంఫర్ట్ ఉంది..

    నాగచైతన్యతో నటించడం చాలా హ్యపీగా ఉంది. మా పాత్రల పరంగా ఒకరికొకరం సహకరించుకొన్నాం. ఎక్కువశాతం నైట్ షూట్ కావడంతో కొంచెం కష్టంగా అనిపించేది. నటన పరంగా ఒక పాత్ర ఎక్స్‌ప్రెషన్ ఇస్తే.. మరో పాత్ర రియాక్ట్ కావాల్సిన అంశాలు ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో నాగచైతన్య ఇచ్చిన సహకారం చాలా బాగుంది. నేను చేసిన సీన్లకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చేవారు. ఆఫ్ స్క్రీన్ విషయానికి వస్తే.. షాట్స్ తర్వాత సన్నివేశాల మధ్య చాలా కూల్‌గా కనిపించేవాడు. ఎప్పుడు నాకు ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. చాలా స్వీట్ పర్సన్. చాలా కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చేసేవాడు అని సాయిపల్లవి తెలిపారు.

    సమాజంపై సినిమాల ప్రభావం గురించి

    సమాజంపై సినిమాల ప్రభావం గురించి

    సినిమాల వల్ల ప్రభావం చెందుతారంటే నేను కచ్చితంగా చెప్పలేను. కానీ కొంత మేరకు ప్రభావం ఉంటుంది. ఈ సినిమాలో సమాజంలో ఉన్న కొన్ని వివక్షలను ఈ సినిమా మేకర్స్ సృజనాత్మకంగా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. మహిళలపై ఉన్న వివక్షను గొంతెత్తి అరిచి చెప్పకుండా.. చాలా సున్నితంగా మనసుకు హత్తుకొనేలా చెప్పడం లవ్ స్టోరిలో పాజిటివ్ అంశం. కొన్ని విషయాలు ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటాయి అని సాయిపల్లవి పేర్కొన్నారు.

    కుల, లింగ వివక్ష అంశాలు మేలవించి

    కుల, లింగ వివక్ష అంశాలు మేలవించి

    లింగ, కుల వివక్ష గురించి లవ్ స్టోరి సినిమాలో చర్చించాం. అయితే నాకు ఎదురయ్యాయా అని అడిగే కంటే.. ఇలాంటి సమస్యను ఏ అమ్మాయికైనా జరగకుండా ఉంటాయా అని అడగాలి. నేను, నా తల్లి, నా సిస్టర్, ఎందరో మహిళలు సమాజంలో ఎదుర్కోవడం చాలా సాధారణంగా మారాయి. నా జీవితంలో ఇలాంటి సమస్యలను దాటి వచ్చాను. సమాజంలో తప్పు చేస్తుంటే.. తప్పు చేస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. సినిమాకు తప్పును ఎత్తి చెప్పే పవర్ ఉంది. సినిమా ద్వారా ఒక విషయంపై ఆలోచింపజేయడానికి అవకాశం ఉంది అని సాయి పల్లవి తెలిపారు.

    చిరంజీవి సినిమా ఎందుకు రిజెక్ట్ చేశానంటే..

    చిరంజీవి సినిమా ఎందుకు రిజెక్ట్ చేశానంటే..

    రీమేక్ చిత్రాలకు నేను వ్యతిరేకం కాను. ఏదైనా సినిమా ఒక భాషలో హిట్ అయినప్పుడు మరో భాష ప్రేక్షకులకు చూపించాలని రీమేక్ ద్వారా ప్రయత్నం చేస్తుంటారు. రీమేక్‌లో అప్పటికే ఒకరు చేసిన పాత్రను చేయాలంటే కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ పాత్ర కంటే బెటర్ చేయాలనే ఒత్తిడి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఫ్రెష్‌గా చేస్తే నా వైపు నుంచి ఇంపాక్ట్ ఉంటుందనే ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. అందుకే నేను రీమేక్ పాత్రలకు కొంచెం దూరంగా ఉంటాను. లూసిఫర్ రీమేక్ చిత్రంలో చిరంజీవి ఆఫర్ రిజెక్ట్ చేయడం వెనుక మరే కారణం లేదు. నా వరకు పాత్ర గొప్పగా ఉండాలి అనుకొంటాను అని సాయిపల్లవి ఓ ప్రశ్నకు వివరణ ఇచ్చారు.

    తక్కువ సినిమాలు చేయడానికి కారణం

    తక్కువ సినిమాలు చేయడానికి కారణం

    సినిమాలు తక్కువ చేయడానికి కారణం ఏమీలేదు. నాకు నచ్చిన పాత్రలను, సినిమాలను ఎంపిక చేసుకొంటాను. అంతేకాకుండా.. ఇప్పడు ఉన్న పరిస్థితుల వల్ల ఒక్కో సినిమా చాలా సమయం తీసుకొంటున్నది. అందుకే ఎక్కువ గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తున్నది. ఒక సినిమా కథను రిజెక్ట్ చేయడం ఎంత కష్టమో.. ఒక సినిమా కథను ఒప్పుకోవడం కూడా అంతే కష్టం ఉంటుంది. కొన్ని సార్లు కథను ఒకే చేసిన తర్వాత సెట్స్‌లో కథ మారిపోయిన సందర్భాలు ఉంటాయి. కానీ అవి మీనింగ్ ‌ఫుల్‌గా ఉండేలా నేను చూసుకొంటాను. ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాననే ఆందోళన ఏ మాత్రం లేదు అని సాయిపల్లవి చెప్పారు.

    శేఖర్ కమ్ములలో అంత నిజాయితీగా

    శేఖర్ కమ్ములలో అంత నిజాయితీగా

    లవ్ స్టోరి లాంటి కమర్షియల్ చిత్ర కథకు సమాజంలోని క్లిష్టమైన అంశాలను శేఖర్ కమ్ముల జోడించిన తీరు గొప్పగా ఉంటుంది. భారమైన పాత్రలను చూసినప్పుడు వాటి నుంచి బయటపడటం కొంత కష్టంగా ఉంటుంది. సెన్సిబుల్ కథను చెప్పడానికి కూడా శేఖర్ కమ్ముల ఇబ్బందిపడిన సందర్భాలు కనిపించారు. నేను డైరెక్టర్‌ను అనే ఫీలింగ్ ఉండదు. శేఖర్ కమ్ముల టీమ్ పర్సన్. అందరూ కలిసి జట్టుగా పనిచేయాలనే ఒక స్పూర్తిని ఇస్తుంటారు. సినిమాలోని ఆయన కథల మాదిరిగానే ఆయన కూడా చాలా నిజాయితీగా కనిపిస్తారు అని సాయిపల్లవి అన్నారు.

    English summary
    Sai Pallavi's latest movie is Love Story. This mvoie is releasing on September 24th. In this occassion, Sai Pallavi speaks about Love Story, Naga Chaitanya and Shekhar Kammula.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X